chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: మిత్రతో మాట్లాడాలి అని మనీషా మిత్రను బయటకు తీసుకెళ్తుంది. అసలు నేను ఈ ఇంట్లో నేను ఏంటి అని అడుగుతుంది. అది విన్న దేవయాని చప్పట్లు కొట్టుకొని వస్తూ కరెక్ట్‌ ప్రశ్న వేశావని అంటుంది. మిత్ర మాత్రం అర్థం లేని ప్రశ్న అని అంటాడు. దానికి మనీషా సమాధానం చెప్పలేకపోయావు కాబట్టి నీకు అర్థం లేని ప్రశ్న అని అంటుంది.  


దేవయాని: ఫ్రెండ్ అని అనవు అలా అని ప్రేమ అని దగ్గరకు తీసుకోవు. కనీసం పెళ్లి చేసుకుంటా అని భరోసా కూడా ఇవ్వువు. అలాంటప్పుడు మనీషా ఇక్కడ ఎవరికి ఏమవుతుందని ఉండాలి. 
మనీషా:  మిత్ర ఒకప్పుడు మనం ఎంతగా ప్రేమించుకున్నామో నీకు తెలుసు. పెళ్లి చేసుకుందామని ప్రమాణం చేసుకున్నామని కూడా నీకు తెలుసు. కానీ లక్ష్మీ రావడంతో జాతకాలే మారిపోయాయి. మన జీవితాలే తారు మారు అయిపోయాయి. కనీసం ఆ లక్ష్మీ వెళ్లిన తర్వాత అయినా మనం అనుకున్నది జరుగుతుంది అనుకున్నా కానీ ఇప్పుడు లక్కీని కారణం చూపించి నా జీవితం నాశనం చేస్తున్నావ్. రేపు నీ జీవితంలోకి మరొకరు వస్తారు. అంత ఎందుకు ఆ లక్ష్మీనే తిరిగిరావొచ్చు. సరే చెప్పు మిత్ర నువ్వు వాళ్ల కోసం వీళ్లకోసం నన్ను జీవితాంతం ఒంటరిగా వదిలేస్తావా. మిత్ర నువ్వు నా మెడలో తాళి కడతావా లేదా. లేదా ఈ ఇంటి నుంచి నన్ను శాశ్వతంగా వెళ్లిపోమంటావా.
మిత్ర: మనీషా ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం.
మనీషా: మిత్ర ఇప్పుడు అడగకపోతే ఇంకెప్పుడు చెప్పవు. కానీ ఒకటి గుర్తు పెట్టుకో నేను ఇప్పుడు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవడం అంటే ఈ జీవితం వదిలి శాశ్వతంగా వెళ్లిపోవడమే.  
అరవింద: మనీషా.. ఏంటి ఆ మాటలు.. ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రానా అభిప్రాయాలు మారిపోతాయి అనుకుంటున్నావా. 
మనీషా: ఇన్నాళ్లు నా ఎదురు చూపులకు మీరు ఇచ్చే సమాధానం ఇది. ఇన్నేళ్ల నా ప్రేమకు మీరు ఇచ్చే బహుమతి ఇది.
మిత్ర: మనీషా నేను ఆలోచించుకోవడానికి నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి.
మనీషా: ఇంకా ఎంత టైం కావాలి మిత్ర. మన ప్రేమ కోసం నేను ఎంత కుమిలిపోతున్నానో నీకు తెలీదా.
మిత్ర: నా చుట్టూ ఎన్ని గండాలు ఉన్నాయో నీకు తెలుసు. అవన్నీ తెలుసి నేను ప్రేమ పెళ్లి అని ఆలోచించలేదు. కాస్త ఓపిక పట్టు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఓకేనా..
అరవింద: మనసులో.. మిత్ర ఓ నిర్ణయం తీసుకోకముందే  లక్ష్మీ గురించి ఓ క్లారిటీ రావాలి. తను బతికి ఉంటే మళ్లీ ఈ ఇంటికి తీసుకురావాలి. ఈ విషయంలో దీక్షితులు గారిని కలిస్తే ఓ క్లారిటీ వస్తుంది. 


ఉదయం మిత్ర జాగింగ్ చేస్తుంటాడు.  రోడ్డు మీద ఓ ట్రక్ బ్రేకులు ఫెయిల్ అయి యాక్సిడెంట్ అయినట్లు లక్ష్మీకి కల వస్తుంది. నిద్రలో ఏవండీ అని లేస్తుంది. జున్ను లేచి ఏమైందని అడుగుతాడు. దానికి లక్ష్మీ మీ నాన్నకి ఏమైనా అయినట్లు కల వచ్చిందని చెప్తుంది. దానికి జున్ను నాన్న నిన్ను అంత బాగా చూసుకునేవాడా నాన్న గురించి కంగారు పడుతున్నావు. నాన్న ఎవరు అమ్మా అని అడుగుతాడు. దాంతో లక్ష్మీ నువ్వు నాన్నని తిడుతూ అసహ్యించుకుంటూ ఉంటే కోపం వచ్చిందని కానీ ఈరోజు నాన్నని ప్రేమగా అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను అని జున్నుతో లక్ష్మీ అంటుంది. ఇక లక్ష్మీ అలాంటి కల ఎందుకు వచ్చిందని దీక్షితులు గారిని సమాధానం అడగాలి అనుకుంటుంది. 


అరవింద దీక్షితులు గారికి కాల్ చేస్తుంది. దీక్షితులు గారి శిష్యుడు కాల్ రిసీవ్ చేసి అడవుల్లో ఉన్నారని కాసేపట్లో వేరే చోటుకు వెళ్తారు అని రెండు రోజుల తర్వాత వస్తారు అని వీలైనంత తొందరగా రమ్మని చెప్తారు. సరే అని అరవింద మిత్రని తీసుకొని బయల్దేరుతుంది. మరోవైపు లక్ష్మీ కూడా దీక్షితులు గారి దగ్గరకు బయల్దేరుతుంది. దీక్షితులు గారి కోసం లక్ష్మీ ఓ వ్యక్తిని అడుగుతుంది. ఆయన ఓ చెక్ పోస్ట్ దగ్గరకు వెళ్లమని దాని తర్వాత పోలీసులు మనుషుల్ని వాహనాలను అక్కడికి పంపరని కేవలం కాలి నడకనే వెళ్లాలని చెప్తారు. దీక్షితులు గారు చెక్ పోస్ట్ దగ్గరకు వెళ్తారు. పై అధికారుల దగ్గర నుంచి పర్మిషన్ ఉండటంతో దీక్షితులు గారికి ఇద్దరు కానిస్టేబుల్స్‌ని తోడుగా ఇచ్చి అమ్మవారి దగ్గరకు పోలీస్ అధికారి పంపుతారు. వాళ్లు వెళ్లగానే లక్ష్మీ చెక్ పోస్ట్ దగ్గరకు చేరుకుంటుంది. లక్ష్మీని పోలీసులు వెళ్లకుండా అడ్డుకుంటారు. దీక్షితులు గారు వెళ్తున్న దారిలో పులి తిరుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. . 


Also Read: సత్యభామ సీరియల్: తన మనసు గెలుచుకున్నావ్ అని క్రిష్‌తో చెప్పిన సత్య.. రేణుక విషయం తెలిసి మహదేవయ్య ఇంట్లో రచ్చరచ్చ!