Trinayani Today Episode: తిలోత్తమ ఎటు వెళ్తే అటు గుమ్మడికాయ వెళ్తుంది. తిలోత్తమ భయంతో ఇంట్లోకి వచ్చేస్తుంది. గారడీలు ఆపు అని తిలోత్తమ అంటే నువ్వు చేసిన పనులు బాగున్నాయా అని విశాలాక్షి అడుగుతుంది. అత్తయ్య ఏం చేసిందని నయని విశాలాక్షిని అడుగుతుంది. వల్లభ, విక్రాంత్‌లు మరో కొత్త తండ్రిని పరిచయం చేస్తావా ఏంటి అని అడుగుతారు. 


సుమన: అత్తయ్య ఎందుకు ఈ పేచీ ఆ దిష్టి ఏదో తీయించుకోండి. 
డమ్మక్క: దుష్ట శక్తులన్నీ వెళ్లిపోతాయని తిలోత్తమ అమ్మ విచారిస్తుంది.
నయని: దుష్ట శక్తులు వెళ్లిపోతే ఎవరైనా బాధ పడతారా.
విశాలాక్షి: మరి మీ అత్తయ్య ఎందుకు భిన్నంగా ఆలోచిస్తుంది.  
తిలోత్తమ: మనసులో.. ఈ గారడి పిల్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అఖండ స్వామి మరీ మరీ చెప్పారు. చూస్తుంటే అందరి ముందు నా గురించి చెప్పేసేలా ఉంది.
విశాల్: అమ్మ దుష్ట శక్తులు ఇంట్లో నుంచి వెళ్లడం నీకు ఇష్టం లేదా.
హాసిని: ఇంట్లో నుంచా ఒంట్లో నుంచా.
విశాలాక్షి: కరెక్ట్‌గా అడిగావు పెద్దమ్మ. 
సుమన: నిజంగా ఇంట్లో దుష్ట శక్తి ఉందా.
నయని: ఎందుకు దిష్టి తీయించుకోవడం లేదు అత్తయ్య.
తిలోత్తమ: నాకు ఇష్టం లేదు అని వెళ్తుంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. సరే గుమ్మడికాయ తిప్పండి.. తిప్పి ఎవరి తలకేసి కొడతారో కొట్టండి.


నయని గుమ్మడికాయ మీద హారతి వెలిగించి తిలోత్తమకు దిష్టి తీయబోతుంది. ఇంతలో డమ్మక్క అమ్మవారిని తలచుకో నయని అని చెప్తుంది. వద్దు అని తిలోత్తమ పెద్దగా అరుస్తుంది. అందరూ షాక్ అవుతారు. కానీ నయని మాత్రం పెద్దగా మంత్రాలు చదువుతూ తిలోత్తమ చుట్టూ గుమ్మడికాయ తిప్పుతుంది. దాంతో తిలోత్తమ నుంచి వద్దు అంటూ ఓ మగడి గొంతు పెద్ద పెద్దగా అరుస్తుంది. అందరూ బిత్తర పోతారు. భయపడతారు. నయని మాత్రం మంత్రాలు చదువుతూనే ఉంటుంది. విశాలాక్షి ఆపకుండా మూడు సార్లు గుమ్మడికాయ తిప్పమని చెప్తుంది. 


తిలోత్తమ: పురుషుడి గొంతుతో.. ఆపు.. ఏయ్ ఆపు నేను నీకు దిష్టి తీయమని చెప్పలేదు. నా ముందుకి కూస్మాండాన్ని తీసుకురమ్మనలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావ్. ఆపేయ్ నన్ను ఏం చేద్దామని ఇలా చేస్తున్నావ్. 
విశాల్: అమ్మా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్. 
విశాలాక్షి: ఆపకు అమ్మ తిప్పు.
తిలోత్తమ: ఏయ్ సర్వశక్తులు ఒడ్డిన నన్ను బలి తీసుకోకు. అంటూ తిలోత్తమ తన కుడి చేతితో గుమ్మడికాయని కత్తితో నరికినట్లు నరికేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. అందరినీ చూసి తిలోత్తమ మామూలుగా మారి ఏం జరిగింది అని అడుగుతుంది. 
సుమన: అదేంటి అత్తయ్య చేసింది అంతా చేసి అలా అడుగుతున్నారు.
తిలోత్తమ: నేనేం చేశాను.
హాసిని: మిమిక్రీ మగాడిలా మాట్లాడి వీరంగం సృష్టించి భయపెట్టేశారు మళ్లీ ఏమైంది అని అడుగుతున్నారు.


కుడి చేతితో గుమ్మడికాయ పగలగొట్టావని చెప్పగా తిలోత్తమ అయ్యో ఏంటి ఇలా చేశాను అని వెళ్లిపోతుంది. ఇక విశాలాక్షి నయనితో నీ అనుమానమే నిజం అవుతుంది అమ్మ అని అంటుంది. ఇక సుమన దిష్టి తీసిన తర్వాత స్నానం చేయాలి అని అంటుంది. విక్రాంత్‌ని కూడా స్నానానికి వెళ్లమంటుంది. ఇక సుమన రెడీ అయి కిందకి వస్తుంది. దాన్ని చూసి హాసిని అరగంటకు ఓ చీర కట్టి బాగానే ఉందని అని వెటకారం చేస్తే తిలోత్తమ అత్తయ్యలోకి ఏ దుష్ట శక్తి దూరిందో అని అంటుంది. గతంలో సుమన కూడా మగ గొంతుతో అలాగే ప్రవర్తించిందని హాసిని అంటుంది. 



వల్లభ, తిలోత్తమలు అఖండ స్వామి దగ్గరకు వెళ్తారు. జరిగింది చెప్తారు. ఇక గంటలమ్మ కూడా అక్కడికి వస్తుంది. 


తిలోత్తమ: విశాలాక్షి నాలో దుష్ట శక్తి దాగి ఉందని అందరి ముందు అల్లరి చేయబోయింది. 
గంటలమ్మ: దైవ శక్తికి ఎదురు వెళ్లొద్దని నీకు అఖండ చెప్పాడు కదా ఎందుకు వెళ్లావు.
అఖండ: గుమ్మడికాయ దొర్లింది అంటే మీ అమ్మ భౌతికకాయం దొర్లించే పని జరుగుతుంది. 
విశాల్: అంటే ఏంటి.
తిలోత్తమ: నన్ను చంపి నా బాడీ పూడ్చాలి అని చూస్తున్నారురా.
గంటలమ్మ: మీ అమ్మని భయపెట్టేదాన్ని పట్టడమేరా అవసరం. ప్రాణాలతో ఉన్న వాళ్లు తిలోత్తమ ప్రాణం తీయలేరు. ప్రాణం పోయిన వాళ్లే మరణపు రణంలో ఓడిస్తారు.
తిలోత్తమ: గాయత్రీ అక్కయ్యే నన్ను కడతేర్చుతుంది అంటున్నారురా.
వల్లభ: అడ్డుకోలేరా మీరు.
గంటలమ్మ: అడ్డుకోవాలి అంటే గాయత్రీ దేవి ఆత్మ దొరకాలిరా. నాకు జరిగిన అవమానం కోసం అయినా రేపు గాయత్రీ దేవి వర్ధంతి జరగాలి అని చెప్పాను.
తిలోత్తమ: రేపు గాయత్రీ అక్కయ్య ఆత్మ వస్తుందా.
గంటలమ్మ: రప్పించాలి. 
అఖండ: చేయరానిది చేయాలి అప్పుడు గాయత్రీదేవి ఆత్మ వస్తుంది. 
గంటలమ్మ: ఆమె ఫొటోకి దండ వేయండి. అన్నింటి కంటే ముందు పిండం పెట్టండి. 
తిలోత్తమ: రానీ అక్క లెక్క ముగించేస్తా. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: సత్యభామ సీరియల్: రేణుకకి అబార్షన్ చేయకుండా ఆపిన సత్య.. రుద్రని అసహ్యించుకుంటూ తండ్రి దగ్గరకు తీసుకెళ్లిన క్రిష్!