Satyabhama Today Episode రుద్ర రేణుకని హాస్పిటల్‌కి తీసుకొస్తాడు. అబార్షన్ చేయించడానికి ఫర్మాలిటీస్ ఫిల్ చేయిస్తాడు. రేణుకతో సంతకం పెట్టిస్తాడు. ఇక డాక్టర్లు రేణుకని అబార్షన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్తారు. రేణుకని ఈ జన్మలో తల్లి కానివ్వను అని రుద్ర అంటాడు. మరోవైపు సత్య, క్రిష్‌లు హాస్పిటల్‌కు బయల్దేరుతారు. భైరవి చికెన్ సూప్ తీసుకొని క్రిష్‌ ఇష్టమని తీసుకొని గదికి వెళ్తుంది. రెండు జంటల్ని పిలుస్తుంది. ఎవరూ పలకకపోవడంతో పని మనిషి పంకజాన్ని పిలిచి ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. పంకజం తనకు తెలీదు అంటుంది. తనకి చెప్పకుండా బయటకు వెళ్లారని అనుకుంటుంది. ఇంతలో మహదేవయ్య వస్తాడు. పిల్లలు ఎవరూ లేరు అని చెప్పకుండా ఎక్కడికో  వెళ్లారని చెప్తుంది.


మహదేవయ్య: ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావే.. ఎవరు ఎక్కడికి పోతున్నారో చూసుకోవా.
భైరవి: వాళ్లు చెప్పకుండా పోతే నేను ఏం చేయాలి అయ్యా. నేను వంటింట్లోనే ఉన్నా.
మహదేవయ్య: చెప్పకుండా పోయారు అంటే ఏదో జరుగుతుంది.


సత్య హాస్పిటల్‌కి చేరుకొని పరుగులు తీస్తుంది. క్రిష్ చూసి సత్య బ్యాండేజీ మార్చాల్సింది నాకు కదా నువ్వు పరుగులు పెడుతున్నావ్ ఏంటి. మరోవైపు రేణుకకి అబార్షన్ చేయడం మొదలు పెడతారు. సత్య డాక్టర్‌ని కలిసి క్రిష్‌కి గాయాలకు డ్రస్సింగ్ చేయమని చెప్తుంది. డాక్టర్ క్రిష్‌ని చూస్తుండగా సత్య ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్లి రేణుక కోసం వెతుకుతుంది. సత్య రుద్రాని చూస్తుంది. రుద్ర కూడా సత్యని చూసి షాక్ అయిపోతాడు. సత్య ఇక్కడికి వచ్చిందేంటని అనుకుంటాడు.  


సత్య: అక్క ఎక్కడ.
రుద్ర: ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఇక్కడి నుంచి పో.
సత్య: నేను పోను మీరు అనుకున్న ఈ ఘోరం జరగనివ్వను. అని సత్య ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తుంటే రుద్ర ఆపుతాడు. సత్య రుద్రని నెట్టేసి రేణుక దగ్గరకు వెళ్తుంది. డాక్టర్‌తో సత్యతో తన అక్కకు అన్యాయం జరుగుతుందని చెప్తుంది. రుద్ర సత్యని లాక్కెళ్తా మీరు అబార్షన్ చేయండి డాక్టర్ అంటాడు. ఇంతలో రేణుక లేచి సత్యని ముట్టుకుంటే మర్యాదగా ఉండదు అని చెప్తుంది. 
డాక్టర్: ఏంటి ఈ గొడవ అంతా. వాళ్లు సంతకం పెట్టారు. వాళ్ల ఇష్ట ప్రకారమే చేస్తున్నాం.
సత్య: మా అక్క ఇష్ట ప్రకారం సంతకం పెట్టలేదు. బావ బెదిరించారు. అందుకే పెట్టింది.
రేణుక: అవును నన్ను బెదిరించి సంతకం పెట్టించిండు. నాకు బిడ్డ కావాలి. నేను అమ్మని కావాలి. 
డాక్టర్: ఏంటి రుద్ర గారు. నాకు ఎందుకు అబద్ధం చెప్పారు. నిజానికి మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. చూడమ్మా ఇలాంటి విషయాల్లో భర్తకు ఎదురు తిరగాలి కానీ ఇలా గమ్మున ఉండకూడదు. ఇది నీ మాతృత్వానికి సంబంధించిన విషయం. రేణుకని తీసుకెళ్లండి. క్రిష్ బయటకు వస్తాడు. సత్య కోసం వెతుకుతూ రుద్రని చూస్తాడు. 
క్రిష్: అన్న.. నవ్వేంటి ఇక్కడ. ఎక్కడికో పని మీద పోవాలి అన్నావు కదా. ఏమైంది వదినకు. ఆపరేషన్ రూం నుంచి తీసుకొస్తున్నారు ఏంటి. ఎవరూ మాట్లాడరేంటి. ఏమైంది సత్య.
సత్య: మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా బావగారు.
రుద్ర: పోలీసోలు పట్టుకున్న దొంగలా మాట్లాడుతున్నావ్ ఏంటి. నా పెళ్లాం. నా కాపురం నేను ఏమైనా చేసుకుంటా అది నా ఇష్టం. మీ ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు నడు పోదాం.
క్రిష్: అన్నా ఆగు ఏమైంది అన్నా. ఎందుకు అంత కోపం.
సత్య: తప్పు చేసి దొరికిపోతే ఎవరు అయినా ఇలాగే బుకాయిస్తారు. మీ అన్నకి తన భార్య అంటే ఎంతో ప్రేమ లంచ్‌కి తీసుకెళ్లడానికి రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేశాడు అన్నావు కదా. వాళ్లకి కుదరక ఆ అవకాశం మనకి ఇచ్చారు అన్నావు. బావగారికి భార్య మీద ప్రేమ లేదు. నీ మీద ప్రేమలేదు. అక్క ప్రెగ్నెంట్. అక్కతో బిడ్డను కననివ్వడం బావగారికి ఇష్టం లేదు. బలవంతంగా అక్కని హాస్పిటల్‌కి తీసుకొచ్చి బిడ్డని తీయించాలి అనుకున్నారు. మనం ఇంట్లో ఉంటే తెలిసిపోతుంది. అడ్డు పడతామని మనల్ని లంచ్ పేరుతో బయటకు పంపాడు.
క్రిష్: అన్న సత్య చెప్పేది నిజమేనా. అన్న నిన్నే అడిగేది.
రుద్ర: రేయ్ ఇది మా మొగుడు పెళ్లాలకు సంబంధించి విషయం.
క్రిష్: కాదు మన ఫ్యామిలీ విషయం.
రుద్ర: నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. 
క్రిష్: నువ్వు చేసింది తప్పు ఒప్పుకో అన్న.
సత్య: మీ ఇంట్లో వాళ్ల ప్రేమలు ఎలా ఉంటాయో నీకు కళ్లారా చూపిద్దామని నిన్ను తీసుకొచ్చా. మనం రావడం కొంచెం లేటు అయింటే అక్కకి మరోసారి కన్నీళ్లే మిగిలేవి.
క్రిష్: వదిన కడుపులో బిడ్డ చంపడం తప్పు కాదు అన్న పాపం. ఈ పాపం చేయడానికి నీకు ఎట్లా మనసు వచ్చిందన్నా. ఇలాంటి మగాలు కూడా ఉంటారా. వదిన కడుపులో ఉన్నది నీరక్తం. ఎలా చంపుకోవాలి అనిపించిది. నువ్వు అసలు మనిషివేనా. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇక్కడ కాదు తేల్చాల్సిన చోట తేల్చుకుందాం. తేల్చుతాను. వదిన ఇంటికి పోదాం పదండి. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్ - గుడ్‌న్యూస్ చెప్పిన శోభ.. నడిరోడ్డుపై ఇదేం పాడు పనిరా.. కార్తీక్, దీపలను అలా చూసి తిట్టుకున్న అనసూయ!