Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode: శౌర్య తన తల్లి కోసం స్కూల్ దగ్గర వెయిట్ చేస్తుంటుంది. ఇక మరో పాపని తన తండ్రి వచ్చి ప్రేమగా బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లడం చూసిన శౌర్య తనకి తండ్రి కూడా తన దగ్గర ఉంటే బాగున్ను అనుకొని ఏడుస్తుంది. శౌర్యకి నాన్న లేడు ఎక్కడికో వెళ్లిపోయాడు అని ఏడుస్తుంది. మరోవైపు జ్యోత్స్న పారిజాతం గొంతు పట్టుకొని ఎందుకు చేశావ్ ఇదంతా అని నాకు చెప్పి తీరాలి అని సీరియస్‌గా ఉంటుంది. 


పారిజాతం: వదిలితే గొంతు నొక్కి చంపేసేలా ఉన్నావ్. మీ బావని కూడా ఇలాగే అడిగావా.
జ్యోత్స్న: గొంతు నొక్కలేదు కానీ నొక్కి నట్లే అడిగాను. అప్పుడే శౌర్య గురించి అని చెప్పాడు.
పారిజాతం: వీక్ నెస్ అర్థమైంది కదా ఇప్పుడేం చేయాలో నేను చెప్తా.
జ్యోత్స్న: నీ పాత వీడియోలు నాకు వద్దు గ్రానీ. నీ ఐడియాలు నాకు వద్దు. భర్త వదిలేసిన ఆడదానిగా బావకి దీప మీద విపరీతమైన సింపతీ ఉంది. ఇదే టైంలో శౌర్య బావకి దగ్గర కావడంతో ఆ సింపతీ ఇంకాస్త ఎక్కువ అయింది. దాంతో వాళ్లిద్దరూ కలవడానికి శౌర్యనే కారణం అవుతుంది. 
పారిజాతం: నాకు ఒక మాట చెప్పు నీతో పెళ్లి ఇష్టం లేదు అన్నట్లు మీ బావ మాటల్లో నీకు ఎక్కడైనా అనుమానం అనిపించిందా. 
జ్యోత్స్న: ఈ డౌట్ నీకు ఎందుకు వచ్చింది. ఇలాంటి ప్రశ్న నువ్వు నాకు ఎందుకు అడిగావ్. బావ నీతో ఏమైనా చెప్పాడా. ఇంట్లో ఖాళీగా ఉండి ఏది పడితే అది ఆలోచించకు. వచ్చే ముహూర్తానికి నీ మనవడు మనవరాలికి పెళ్లి చేయమని అన్నావు కదా అదే ఫిక్స్ అవ్వు.
జ్యోత్స్న: ఇప్పుడు నా టార్గెట్ వాళ్లిద్దరే. దీప, శౌర్య.


మరోవైపు దీప శౌర్య ఇంటికి వస్తుంటారు. శౌర్య డల్‌గా ఉంటుంది. నడుచుకొని వెళ్లడానికి కాళ్లు నొప్పి వస్తున్నాయని శౌర్య అంటుంది. ఆటో కనిపించే వరకు నడుచుకొని వెళ్దామని దీప అంటుంది. ఇక శౌర్య కార్తీక్‌కి కాల్ చేసి రమ్మని చెప్తాను అని అంటుంది. దీప వద్దని అంటుంది. ఇక ఫోన్ ఇవ్వకపోతే రాను అని శౌర్య అంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. శౌర్య సంతోష పడుతుంది. దీప, కార్తీక్, శౌర్యలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అనసూయ అటుగా వచ్చి చూసి వీళ్లకి ఇళ్లు లేదు వాకిలి లేదు ఎక్కడ పడితే ఇక్కడ ఇలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందని తిట్టుకుంటుంది. చిరాకు పడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక కార్తీక్ డ్రాప్ చేస్తాను అంటే దీప తను హోటల్‌కి వెళ్తాను అంటుంది. కార్తీక్ పాపని తీసుకొని ఇంటికి వెళ్లిపోతాడు. దీప హోటల్‌కి బయల్దేరుతుంది. 


శోభ నర్శింహని హేళన చేస్తుంది. ఇప్పటి వరకు తనని ఎవరూ కొట్టలేదని ఆ దీప మాత్రం కొట్టిందని తిట్టుకుంటుంది. ఇంతలో అనసూయ వచ్చి దీప వల్ల తనకు తన కొడుకుకు ఈ గతి వచ్చిందని దీప జోలికి వెళ్లొద్దని అంటే నర్శింహ వినడు అని నర్శింహని తిట్టుకు అంటే నువ్వు వినవు అని అంటుంది. ఇంతో శోభకి కళ్లు తిరిగి వాంతులు అవుతాయి. అనసూయ చూసి శోభ ప్రెగ్నెంట్ అయిందని చెప్తుంది. నర్శింహ తెగ హడావుడి చేసేస్తాడు. ఇక అనసూయ డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్దామని చెప్తుంది. ఇక దీప కూడా హాస్పిటల్ దగ్గరకు టిఫెన్స్ తీసుకు వెళ్లి ఇస్తుంది. ఇక నర్శింహ వాళ్లకు దీప ఎదురు పడుతుంది. శోభ ప్రెగ్నెంట్‌ అని అనసూయ దీపతో వెటకారంగా చెప్తుంది. దీప షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకి జ్యోత్స్న వార్నింగ్.. ఐలవ్‌యూ చెప్పి కార్తీక్‌ని కట్టిపడేసిన జ్యో.. బాబోయ్ శ్రీధర్ డబుల్ యాక్షన్ అదుర్స్!