Trinayani Today Episode హాసిని పేపర్ మీద గాయత్రీ పాపనే గాయత్రీ దేవి అని రాస్తుంది. అయితే విశాల్ అది ఎవరికీ చెప్పకుండా హాసిని తిలోత్తమ చీర కొట్టేసింది అని చెప్తాడు. తిలోత్తమ అడిగి తీసుకోవచ్చు కదా అని రెండు తిట్టి వెళ్లిపోతుంది. మరోవైపు గాయత్రీ పాప పాదాలకు పావనా మూర్తి మొక్కుతాడు. చిన్నపాపకి దండం పెట్టడం ఏంటి మామయ్య అని అడిగితే తను పాప కాదు గాయత్రీ దేవి అని అంటాడు. ఇంతలో నయని అక్కడికి వస్తుంది. ఏంటి మీ రహస్యాలు అని అడుగుతుంది. విశాల్, పావనా మూర్తిలు కవర్ చేస్తారు.
నయని: మీరు ఏ విషయం అయినా నాతో చెప్తారు. ముఖ్యంగా బాబుగారు నా దగ్గర ఏమీ దాయరు.
పావనా: మనసులో..దాచేదే ఈ మహానుభావుడు.
నయని: భార్యభర్తల మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అని అన్ని నాతో చెప్తారు.
పావనా: మనసులో.. కన్న బిడ్డనే దత్త పుత్రిక అని చెప్పే ఈ కథానాయకుడు. నీ పెద్ద కూతురు ఎవరో తెలుసుకునే ప్రయత్నానికి అడ్డుపడుతున్నాడు.
ఇక నయని గాయత్రీ పాపకి ముద్దులు పెట్టుకొని చాలా సంతోషంగా ఉంటుంది. దాంతో పావనామూర్తితో విశాల్ మీరు వెళ్లిపోతే తర్వాత నయని నాకు ముద్దు పెడుతుంది. అని అంటే పావనా మూర్తి దంపతులు అంటే మీలా ఉండాలని అనుకొని వెళ్లిపోతాడు. ఇక తిలోత్తమ బ్యాగ్‌తో ఇంటికి వస్తుంది. హాసిని ఎదురై ఇప్పుడే ఇంట్లో నుంచి ఉన్నారు ఇప్పుడు బయట నుంచి బ్యాగ్‌తో వస్తున్నారు అని అంటుంది. ఇక హాసిని తిలోత్తమ బ్యాగ్ అడుగుతుంది. తిలోత్తమ వద్దు అంటే హాసిని మొండికేస్తుంది. బ్యాగ్ లాగుతుంది. మరోవైపు తిలోత్తమ, వల్లభ, ఇంకోవైపు హాసిని కూడా బ్యాగ్ లాగుతారు. తిలోత్తమ గట్టిగా లాగడంతో వల్లభ, తిలోత్తమలు కిందపడిపోతారు. బ్యాగ్ ఓపెన్ అయిపోతుంది. అందులో నిమ్మకాయలు, ఎండు మిర్చి, మందారం పువ్వులు, గవ్వలు, మేకులు ఇలాంటివి ఉంటాయి.
నయని: మీ బ్యాగ్‌లో బట్టలు ఉంటాయి అనుకున్నాను ఇలాంటివి ఉన్నాయి.
తిలోత్తమ: నాకు అదే తెలీడం లేదు.
విశాల్: అమ్మ ఏంటి ఇవన్నీ.
తిలోత్తమ: నేను తీసుకురావడం ఏంటి నాన్న అసలు ఇవి ఎలా వచ్చాయో నాకు తెలీదు. ప్రామిస్ ఈ బ్యాగ్‌లో ఇవి ఉన్నట్లు నాకు తెలీదు. బ్యాగ్ మారిపోయి ఉండొచ్చు.
నయని: అత్తయ్యే మారిపోయారు బ్యాగ్ మారిపోదా.
తిలోత్తమ: నేను మారిపోవడం సర్పదీవికి వెళ్లిన ప్రతిఫలం, ఇది మారిపోవడం సేమ్ కలర్ ఉండటం.
నయని: మిస్ అయిన అత్తయ్య బ్యాగ్‌లో ఏముందంట.
తిలోత్తమ: క్యాష్ ఉంది. పోతే పోనీలే.. వల్లభ ఈ చెత్త తీసుకెళ్లి బయట పడేయ్.
విశాల్: ఇంట్రస్టింగ్..
విక్రాంత్: అమ్మ హారం ఇవ్వగానే అది వేసుకున్న వదిన అద్దంలో చూసుకుంటే అందంగా కనిపించకుండా తలనొప్పి వచ్చి మనసులో ఉన్న మాట చెప్పడం ఏంటి.
సుమన: మీకు పెళ్లాం కంటే వదినల బాగోగులే ముఖ్యం అనుకుంటా.
విక్రాంత్: విషయం తెలుసుకోకుండా వాగితే లైట్స్ ఆపి కొడతా. హాసిని అక్క పేపర్‌లో విలువైన సమాచారం రాసి ఉంటుంది. స్వార్థ పరులు దుర్మార్గులకు తెలీకూడదు అనే పాప చేత ఆ విశాలాక్షి అమ్మవారు ముక్కలు ముక్కలు చేయించింది.
సుమన: ఈయన ఏం మాట్లాడుతారో నాకు ఈ జన్మకు అర్థం కాదు.
ఉదయం ఇంటికి డమ్మక్క వస్తుంది. పావనా మూర్తి డమ్మక్కని హగ్ చేసుకుంటా అని వెళ్లి హాసినిని పట్టుకుంటాడు. దాంతో హాసిని హవ్వా.. డమ్మక్కని హగ్ చేసుకుందామనుకున్నావా అని అంటుంది. ఇక విశాలాక్షి కూడా వస్తుంది. విశాలాక్షి ఏం పట్టుకొని వచ్చిందని తిలోత్తమ అడగమని అంటాడు. ఇక తిలోత్తమను విశాలాక్షి సర్పదీవి నుంచి నువ్వు దొంగతనం చేసుకొని వచ్చావని అంటుంది. హారం గురించి సుమన అంటే అదొక్కటే కాదు ఇంకా చాలా తెచ్చుకొని ఉంటుంది మీ అత్త అని విశాలాక్షి అంటుంది. నిజం చెప్పమని విశాల్ అడిగితే అవమానిస్తున్నారా.. అనుమానిస్తున్నారా అని అడుగుతుంది తిలోత్తమ. సర్పదీవి నుంచి ఇంకేమీ తీసుకురాలేదని తిలోత్తమ అంటే విశాలాక్షి అబద్ధం చెప్తున్నావ్ అని అంటుంది. చింతామణి నిజం చెప్తుందని అంటుంది. ఎవరు ఆ చింతామణి అని అందరూ ప్రశ్నిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.