Jagadhatri Serial Today July 5th Episode ధాత్రి నిషికని అడ్డుకుంటుంది. దాంతో నిషిక తన తల్లికి కాల్ చేసి అమ్మ నువ్వు నాకు కోటి రూపాయలు ఇచ్చి పంపించావ్ కదా ఎందుకు పంపించావో ఈ జగధాత్రికి చెప్పు అని నిషి ఫోన్ ఇస్తుంది. దాంతో నిషిని కాపాడటానికి నిషి తల్లి బెదిరించి ఫోన్ పెట్టేస్తుంది.
ధాత్రి: కరెంట్ పోవడం, జనరేటర్ ఆన్ కాకపోవడం ఇంట్లో ఇంత డబ్బు ఉండటం. ఏదో ప్లాన్ చేస్తున్నారు కేదార్. అదేంటో కనిపెట్టాలి.
రాత్రి అందరూ పడుకుంటే యువరాజ్ సీక్రెట్‌గా ఇంట్లోకి వస్తాడు. నిషిక, యువరాజ్ తల్లి వాళ్లు సీక్రెట్‌గా తలుపు తీస్తారు. ఇక ధాత్రి లేచి డోర్ సౌండ్ వచ్చిందని కేదార్‌కి చెప్తుంది. చూసి వస్తానని బయటకు వెళ్తుంది. ఎవరూ కనిపించకపోవడంతో మళ్లీ గదిలోకి వచ్చేస్తుంది. యువరాజ్ గదిలోకి వెళ్లి గానే యువరాజ్‌ని తల్లి కొడుతుంది. తల్లి గురించి పట్టించుకోకుండా ఎక్కడున్నావని ఏడుస్తుంది. ఇక యువరాజ్ తాను జేడీ నుంచి ఎలా తప్పించుకొని వచ్చానో చెప్తాడు. రెండు రోజుల్లో పాస్ పోర్ట్ రెడీ అయిపోతుందని ఎవరికీ తెలీకుండా నిషికని తీసుకొస్తే దుబాయ్ వెళ్లిపోతానని యువరాజు అంటాడు. ఇక యువరాజ్ డబ్బు తీసుకొని ఇంటి నుంచి వెళ్లడానికి బయల్దేరుతూ కుండీ తన్నేసి పడిపోతాడు. దాంతో నిషిక వాళ్లు యువరాజ్‌ని తప్పించి దొంగ అని అందరికీ చెప్తాడు. కౌషికి గది నుంచి వస్తుంటే చూశామని చెప్తారు. అందరూ దొంగని వెతకడానికి వెళ్తారు.
ధాత్రి: కేదార్ వచ్చింది దొంగ కాదు యువరాజ్.
కేదార్: అంటే ఆ డబ్బు యువరాజ్ కోసం తీసుకొచ్చారా.
యువరాజ్ పారిపోతాడు. డబ్బుని వదిలేస్తాడు. ధాత్రి డబ్బుని తీసుకుంటుంది. డబ్బు పట్టుకొని ఇంటికి వెళ్తుంది. ఇక కౌషిక వచ్చి తన లాకర్‌లో ఉన్న డబ్బు తీసుకున్నాడని చెప్తుంది. పోలీసులకు ఫోన్ చేస్తాను అని కౌషికి అంటే ధాత్రి వద్దని డబ్బు తీసుకొచ్చానని దొంగ తప్పించుకున్నాడని అంటుంది. ఇక ధాత్రి ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేరని కేసులు పోలీసులు వద్దని ధాత్రి అంటుంది. మళ్లీ ఇలా చేస్తే అందర్ని జైలులో పెట్టిద్దామని అంటుంది. నిషికని ఏం చేస్తాం చెప్పు అని అంటే జైలులో పెట్టిద్దామని అంటుంది. అందరూ వెళ్లిపోతారు.
కేదార్: యువరాజు ఇంత డబ్బు తీసుకున్నాడు అంటే ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు ధాత్రి.
ధాత్రి: యువరాజ్‌ని పట్టుకోవాలి అంటే ముందు ఆ బాడీ యువరాజ్‌ది కాదు అని యువరాజ్ బతికే ఉన్నాడు అని ఫ్రూవ్ చేయాలి. లేకపోతే యువరాజ్‌ని ఆపడం కష్టం.
ఉదయం ధాత్రి షూ పాలిష్ చేస్తుంటుంది. కేదార్ చూసి పోలీస్ ఆఫీసర్‌గా ఎంతో గంభీరంగా ఉన్న తను ఇలా పాలీష్ చేయడంతో తన దగ్గరకు అంత పవర్ ఉన్న నువ్వు నా షూ పాలిష్ చేయడం ఏంటి అని అడుతాడు. మరోవైపు కౌషికి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.