Karthika Deepam Idi Nava Vasantham Serial Episode దీప ఇంటికి వచ్చి బ్యాగ్‌ సర్దుకుంటుంది. జ్యోత్స్న దీప ఇన్న ఇంటి వైపు చూసి దీప హాస్పిటల్‌లో ఉంటే లైట్ వెలుగుతుంది ఏంటి అని చూస్తుంది.  మీరు ఇచ్చిన గడువులోపే మీ డబ్బులు అందుతాయి అని పేపర్ మీద రాసి డబ్బులు దాచిన డబ్బాలో పెట్టి దీప బ్యాగ్ తీసుకొని వెళ్లిపోతుంది. జ్యోత్స్న దీపని చూసి ఉండు నీ పని చెప్తాను అని పరుగులు తీస్తుంది. 


దీప: మనసులో.. క్షమించండి అమ్మ చెప్పకుండా తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు మీ మేనల్లుడు. నా వల్ల మీకు మీ కుటుంబానికి ఎలాంటి బాధ కలగకూడదు. నేను ఇక్కడే ఉంటే నర్శింహ వచ్చి మీకు విషయం చెప్తాడు. అప్పుడు మీరు అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. అందుకే వెళ్లిపోతున్నా. 
జ్యోత్స్న: దీప ఇలా ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోతుందని ఊహించలేదు. వెళ్లిపోవడం నాకు మంచిదేలే నేను చేయాలి అనుకున్న పని తనే చేసింది. అలా అని నేను ఇప్పుడు ఫాలో అయి నిలదీసినా నిజం చెప్పదు. పోనీ.. శౌర్య నా కూతురే అన్న బావ మాట ఇంకెవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. దీప దీన్ని నేను ఎప్పటికీ క్షమించను.


శౌర్య కార్తీక్ కార్తీక్ అని కలవరిస్తుంది. దీప శౌర్య దగ్గరకు వస్తుంది. ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోదామని దీప అంటుంది. ఉదయం సుమిత్ర పువ్వులు తెంచుతూ దీప నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు అని చూడ్డానికి వెళ్తుంది. దీపని పిలుస్తుది ఎవరూ లేకపోవడం బట్టులు కూడా లేకపోవడంతో కంగారు పడుతుంది. అక్కడే పేపర్ చదువుతున్న భర్త దగ్గరకు వెళ్లి దీప ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని చెప్తుంది. 


దశరథ్: అయ్యో ఇప్పుడు ఏం జరిగిందని వెళ్లిపోవడానికి. పిన్ని దీపని ఏమైనా అనుంటుందా.
పారిజాతం: నేనేం అంటాను దశరథ్. అయినా నాకేం పని.
శివనారాయణ: అమ్మ సుమిత్ర జ్యోత్స్న ఎక్కడికి వెళ్లింది. కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. 
సుమిత్ర: ఇదేంటి ఇక్కడ దీప లేదు అక్కడ జ్యోత్స్న కనిపించడం లేదు. దీప ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయింది.
దశరథ్: ఏంటి సుమిత్ర ఇది. ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్లారు. దీప ఎక్కడికి వెళ్లిందో జ్యోత్స్న ఫాలో అయిందా.


దీప బిల్లు కట్టడానికి వెళ్తే కార్తీక్ డబ్బులు కట్టేశాడని చెప్తుంది. దీప తన తండ్రి జ్ఞాపకంగా దాచుకున్న బంగారం గాజులను కౌంటర్‌లో ఇచ్చి సార్‌ డబ్బులు సార్‌కి ఇచ్చేయ్‌మని బంగారంలో మిగిలిన డబ్బులు కూడా ఆయనకే ఇచ్చేయ్ మని చెప్తుంది. ఇంతలో జ్యోత్స్న జాగింగ్ నుంచి ఇంటికి వస్తుంది. అందరూ జ్యోత్స్నని దీప గురించి అడుగుతారు. దీప రాత్రి బ్యాగ్ సర్దుకొని వెళ్లిపోయిందని చెప్తుంది.


సుమిత్ర: ఆ మాట ఇప్పుడా చెప్పేది వెళ్లినప్పుడు నువ్వు అయినా ఆపాలి. లేదంటే మాకు అయినా చెప్పాలి. 
జ్యోత్స్న: ఎందుకు చెప్పాలి మమ్మీ. తనేమైనా మన ఇంటి పని మనిషా, లేక మన ఇంటి మనిషా ఆపడానికి. నిన్ను కాపాడింది మన అవసరం కోసం ఉండమన్నాం. ఇప్పుడు తన అవసరం కోసం ఉండిపోయింది. ఇప్పుడు వెళ్లిపోయింది. వదిలేయొచ్చు కదా. దీప ఏమైనా చిన్న పిల్లనా  తనకి తెలీదా ఎక్కడ ఉండాలో ఉండకూడదో. దీప ఎలాంటిదో మీకు అర్థం కావడం లేదు. 
దశరథ్: దీపని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ అమ్మా.
జ్యోత్స్న: ఇప్పుడే కరెక్ట్‌గా అర్థం చేసుకుంటున్నాను. బావ నన్ను రెస్టారెంట్‌కి ఎందుకు పిలిచాడో తెలుసా పెళ్లి గురించి మాట్లాడటానికి. మా పెళ్లి గురించి దీపని ఎందుకు పిలిచాడో అనుకున్నా. శౌర్య గురించి అని సరిపెట్టుకున్నా. దీప ఉన్నట్టుండి వెళ్లింది. హ్యాండ్ వాష్ ఒక వైపు అయితే దీప మరోవైపు వెళ్లింది. అక్కడ మామయ్యతో మాట్లాడింది. తర్వాత మామయ్య గురించి అందరూ అడిగితే ఎవరితోనో మాట్లాడుతున్నారు బిజీ అని చెప్పింది. అదంతా అబద్ధం నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను చూశా కాబట్టి. మామయ్యని ఆపాల్సిన అవసరం దీపకి ఏంటో నాకు అర్థం కాలేదు. అర్థరాత్రి వెళ్లాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇవన్నీ మీకు అర్థమైతే నాకు చెప్పండి అప్పుడు దీపని ఎందుకు ఆపలేదో నేను చెప్తా.   
పారిజాతం: చెప్పు సుమిత్ర నీ కూతురు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు.  


దశరథ్ కార్తీక్‌కి కాల్ చేస్తాడు. దీప ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని చెప్తాడు. దాంతో కార్తీక్ హాస్పిటల్‌కి వెళ్తాడు. దీపని గట్టిగా అడగాలి అని అంటాడు. ఇక కౌంటర్‌లో పాప లేదు అని దీప తీసుకెళ్లిపోయిందని, డబ్బులు కోసం తన బంగారం గాజులు ఫోన్ ఇచ్చి వెళ్లిపోయారు అని చెప్తారు. కార్తీక్ వాటిని తీసుకుంటాడు. ఇక దీప కడియం దగ్గరకు వచ్చి వేరే దగ్గరకు వెళ్లిపోతా అని వేరే చోటుకి వెళ్లిపోతాను అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: రీతూ చౌదరి లవర్ గురించి సీక్రెట్ బయటపెట్టిన విష్ణుప్రియ - ఇదెక్కడి ట్విస్ట్ రా మావ!