Nindu Noorella Savasam Today Episode మిస్సమ్మ డెస్టబిన్‌లో కనిపించిన మందు డబ్బా పట్టుకొని ఏదో తేడా జరుగుతుందని భావించి కనుక్కోవడానికి మెడికల్ షాప్‌కి వెళ్తుంది. ఇక రణవీర్‌ని పోలీసులు ఇంటరాగేషన్ చేస్తారు. మిలటరీ, లెఫ్ట్‌నెంట్లు ఉన్న ఫంక్షన్‌లో నీ టార్గెట్ ఎవరని అడుగతారు. 


రణవీర్: నాకు కావాల్సిన వాళ్లు మిలటరీ వాళ్లు కాదు. చంపాక అది ఎవరో మీకే తెలుస్తుంది. నా గన్‌లోని అన్ని బులెట్ల గమ్యం ఒక్కరే. 
కానిస్టేబుల్: సార్ లెఫ్ట్‌నెంట్ అమర్ గారు కాల్ చేశారు ఈయన్ని ఒకసారి కలవాలి అనుకుంటున్నారు.
రణవీర్: ఆయన నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు.
అమర్: ఆ హిందీ వాళ్లు వెతుకుతున్నది మనోహరి గురించే అని అనిపిస్తుంది రాథోడ్. కానీ వాళ్లు పగ పట్టేంతలా మనోహరికి వాళ్లకి సంబంధం ఏంటి. అది తెలుసుకోవాలి రాథోడ్. ఫంక్షన్‌లో అటాక్ చేసిన వ్యక్తికి కలిస్తే కానీ నా ప్రశ్నలకు సమాధానం దొరకవు.


పోలీస్ అమర్‌కి కాల్ చేసి రమ్మని చెప్తాడు. అమర్ రాథోడ్‌కి ఇంటికి వెళ్తామని అంటాడు. మరోవైపు బాటిల్ మిస్సమ్మ కంట పడిందని మనోహరి టెన్షన్ పడుతుంటుంది. ఇంతలో అమర్ తనకి కాల్ చేయడంతో షాక్ అయిపోతుంది. మిస్సమ్మకి నిజం తెలిసి చెప్పేసిందా అని అనుకుంటుంది. ఇంతలో అలా ఏం కాదు అని ధైర్యంగా అమర్‌తో మాట్లాడాలని అనుకుంటుంది. అమర్ మనోహరితో బయటకు వెళ్లాలి రెడీగా ఉండు అని చెప్తాడు. అమర్‌తో బయటకు వెళ్లే ఛాన్స్ రావడంతో మనోహరి చాలా సంతోషంతో మంచిగా రెడీ అవ్వాలి అని వెళ్తుంది.  ఇక మిస్సమ్మ మెడికల్ షాప్‌కి వెళ్లి ఆ బాటిల్‌ గురించి అడుగుతుంది. అది పాయిజిన్ అని తెలుసుకుంటుంది. అది కొంచెం మనిషి శరీరంలోకి వెళ్లినా చాలా ప్రమాదం అని అరగంటలో ట్రీట్మెంట్ అందకపోతే చనిపోతారు అని అంటాడు. ఇక అన్నంలో కలిపి ఇస్తే ఎవరికీ అనుమానం రాదు అని మెడికల్ షాప్ ఆయన చెప్పడంతో మిస్సమ్మ ఆలోచించి పిల్లలకు ఇచ్చిన ఫుడ్‌లో కలిపుంటారని పిల్లల్ని కాపాడాలి అని పరుగులు తీస్తుంది. 


మరోవైపు ఆరు లంచ్ టైం అవ్వడంతో పిల్లల్ని మిస్సమ్మ కాపాడుతుందో లేదో అని కంగారు పడుతుంది. ఇక పిల్లలు లంచ్‌కి రెడీ అవుతారు. ఇక ఆరు దేవుడి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ తన పిల్లల్ని కాపాడమని వేడుకుంటుంది. ఇక పిల్లలు లంచ్‌కి మిస్సమ్మ తండ్రిని పిలవాలి అని అమ్ము, తన చెల్లి వెళ్తారు. మిస్సమ్మ తన తండ్రికి కాల్ చేసినా ఆయన లిఫ్ట్ చేయడు. పిల్లలు తాతని లంచ్‌కి పిలవడంతో ఆయన వద్దు అంటూనే వెళ్లారు. ఇక మనోహరి అందంగా రెడీ అవుతుంది. అమర్ ఇంటికి రావడంతో ఆరు పరుగున అక్కడికి వెళ్తుంది. తను ఓ ఆత్మ అని మర్చిపోయి. ఏవండీ పిల్లలు తిన్న కూరలో మనోహరి విషం కలిపిందని మిస్సమ్మ అనుమానంతో వెళ్లిందని మీరు కూడా వెళ్లి పిల్లల్ని కాపాడండి అని వేడుకుంటుంది. గుప్త గారు గీసిన గీత వల్ల తాను ఇళ్లు దాట లేకపోతున్నాను అని ఏడుస్తుంది. అమర్ తనతో ఎవరో మాట్లాడుతున్నట్లు ఫీలవుతాడు. ఇక రాథోడ్ మనోహరిని పిలవడానికి వెళ్తాడు. మనోహరి తను వెళ్లబోయేది పోలీస్‌ స్టేషన్‌కి అని తెలియక తెగ పొంగిపోతుంది. అమర్ తల్లిదండ్రులకు వెటకారంగా చెప్పి అమర్ దగ్గరకు వెళ్తుంది. ఇక పోలీస్‌ స్టేషన్‌లో రణవీర్‌ని కలవడానికి వెళ్తున్నాం అని అమర్‌ చెప్తే మనోహరి షాక్ అయిపోతుంది. మరోవైపు మిస్సమ్మ స్కూల్‌ గేటు తీసుకొని లోపలికి పరుగులు తీస్తుంది. మరోవైపు మిస్సమ్మ తండ్రి విషం కలిపిన అన్నం తినేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: పెళ్లెప్పుడు ప్రియాంక - అప్పుడే అంత వయస్సు వచ్చేసిందా? ఇక పప్పు అన్నం పెట్టాల్సిందే అంటున్న ఫ్యాన్స్