Trinayani Today Episode: తిలోత్తమను అందరూ తన చేతి గురించి ప్రశ్నిస్తారు. సర్పదీవిలో దీపం వెలిగించినప్పుడు అలా అయిందని అంటుంది. దాంతో విశాల్ కుడి చేతిలో ఉలూచి పాము పిల్లగా ఉంది కదా అమ్మ ఆ జ్యోతి ఎలా వెలిగించావ్ అని అడుగుతుంది. ఉలూచి కోరల్లోంచి మంట చిమ్మితే దీపం వెలిగించాను అంటుంది.
విక్రాంత్: సుమన నువ్వు పాప కాళికి సాక్సులు తీసినప్పుడు తన కాళ్లు ఎలా ఉన్నాయి.
సుమన: నల్లగా బాగా కందిపోయి ఉన్నాయి.
విక్రాంత్: కందిపోలేదు కాలిపోయావు.
విశాల్: అదేంట్రా అలా అంటావ్.
విక్రాంత్: బ్రో అమ్మ చెప్పినట్లు మంట ఉలూచి కోరల్లోంచి వచ్చుంటే నోరు కాలిపోయి ఉండాలి. సరే.. పాము పిల్ల కాబట్టి ఏం కాలేదు అనుకున్నా కాళ్లు నల్లగా మాడిపోయినట్లు ఎలా ఉంటాయి.
నయని: నిజమే అత్తయ్యకి చేయి ఉలూచికి కాళ్లు అలా ఎలా కాలిపోతాయి.
తిలోత్తమ: ఏంటి మీ పిచ్చి అనుమానాలు నా చేయి కాలి నేను బాధ పడుతుంటే పిల్ల కాళ్లు కాల్చి తీసుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు.
విశాల్: అది కాదు అమ్మ ఉలూచి పాదాలు ఎందుకు అలా ఉన్నాయని అడుగుతున్నాం.
నయని: సరే ఆ సంగతి తెలియాల్సిన టైంలో తెలిసిపోతుంది కానీ.. మీ చేయి మణికట్టు వరకు కాలిపోతుంటే సైలెంట్‌గా చూస్తూ ఉన్నారా అత్తయ్య.
తిలోత్తమ: గావు కేకలు పెట్టాను. నీళ్లు తీసుకొచ్చి వేసేది ఎవరు.
విక్రాంత్: అంత మంట పుడితే చేయి తప్ప ఒంటి మీద మరెక్కడా గాయం అయినట్లు లేదు. అంత మంటలకు నీ చీర మీద నిప్పులు పడి నీ ఒంటికి అంటుకోలేదు కదా అమ్మ.
విశాల్: విక్రాంత్ చెప్పేది ఏంటి అంటే రూపం అంతా మారిపోయినప్పుడు చేయి ఎందుకు మారలేదు అని.
తిలోత్తమ: మీరు నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నారా. నేను చెప్పకపోతే పోలీసులకు పట్టిస్తారా ఏంటి.
నయని: ఇక ఆ చేయి మామూలుగా మారడం అనేది జరగని పని.
సుమన: సర్జరీ చేసినా కూడా రాదా.
నయని: రాదు ఎన్ని వేషాలు వేసినా సరే ఆ చేయి అలాగే ఉంటుంది.
ఏం సమాధానం చెప్పకుండా తిలోత్తమ వెళ్లిపోతుంది. విక్రాంత్ అందరితో తన తల్లి చేయి సర్ప దీవిలో కాలిపోలేదు అని ఇంకేదో జరిగింది అని అంటాడు. దానికి విశాల్ సరిగ్గా కొలత ప్రకారం కాల్చినట్లు ఉందని అంటాడు. నయని ఆలోచనలో పడుతుంది. ఇక నయని రాత్రి తిలోత్తమ గదిలోకి వెళ్తుంది.
నయని: రూపం మార్చుకొని లలితాదేవిలా ఇంటికి వచ్చినప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకున్నారు అత్తయ్య. మీ అమ్మ తోలు తీద్దామని వచ్చాను బావగారు.
తిలోత్తమ: వల్లభ నువ్వు కాసేపు బయటకు వెళ్లురా.
నయని: ఏం పర్లేదు ఉండనివ్వండి. మీ వారసుడు వింటాడు. మీ అమ్మ రూపం మారింది అని మనందరం అర్థం చేసుకొని తనని ఒప్పుకున్నాం. అయితే లలితాదేవి అమ్మగారిలా కూడా రూపం మార్చుకొని వస్తే ఎలా ఒప్పుకుంటాం చెప్పండి.
తిలోత్తమ: నువ్వు చాలా తెలివైనదానివి అని మరోసారి ఒప్పుకుంటాను నయని. నయని నువ్వు నా విషయంలో ఎక్కువ జోక్యం చేసుకోకు. దెబ్బతింటావ్.
నయని: అలవాటు అయిపోయింది. మీరు చెప్పకపోయినా నేను తెలుసుకుంటాను. ఈలోపు బాబుగారికి కానీ అమ్మగారికి కానీ తెలిస్తే మిమల్ని ఏం చేస్తారో నేను అయితే చెప్పలేను. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పటికే మణికట్టు వరకు కాలిపోయింది తర్వాత చితిలో కాలిపోతారు పూర్తిగా..
తిలోత్తమ: వచ్చేసారి ఎవరి రూపంలో వస్తానో చచ్చినా కనిపెట్టలేరు.
వల్లభ, హాసినిల పెళ్లి రోజు కావడంతో తిలోత్తమ ఓ గిఫ్ట్ బాక్స్ తీసుకొని దాని చుట్టూ అగరఒత్తులు తిప్పుతుంది. ఎందుకు అని వల్లభ అడుగుతాడు. దాంతో తిలోత్తమ తర్వాత చెప్తాను అని అంటుంది. ఇక ఆ గిఫ్ట్ హాసినికి ఇస్తాను అని తిలోత్తమ అంటుంది. అందరి ముందు తనకి హారం గిఫ్ట్ ఇస్తే నువ్వు తన మెడలో వేయమని అంటుంది. ఇక ఆ హారం హాసిని వెళ్లాక తనని తాను అద్దంలో చూసుకుంటే దిమ్మతిరిగి పోతుందని అంటుంది. హారం వేసుకున్న తర్వాత హాసినికి కళ్లు తిరిగినట్లు అయి ఇప్పటి వరకు తెలియని రహస్యం పేపర్ మీద రాసి ఇచ్చేస్తుందని అంటుంది.
అందరూ హాల్‌లో కేక్ ఏర్పాటు చేసి డెకరేషన్ చేసి రెడీగా ఉంటారు. ఇంతలో పెద్ద బొట్టమ్మ వచ్చి పాపని అడుగుతుంది. సుమన సీరియస్ అవుతుంది. హాసిని, వల్లభలు కిందకి దిగుతారు. అందరూ హాసిని, వల్లభలకు శుభాకాంక్షలు చెప్తారు. ఇక సుమన నయని వాళ్లతో మీరు ఏం గిఫ్ట్ ఇవ్వడం లేదా అని అడుగుతుంది. తిలోత్తమ తన వెంట తీసుకొచ్చిన గిఫ్ట్ హాసినికి ఇస్తానని అంటుంది. ఇక తిలోత్తమ హాసినికి గిఫ్ట్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.