chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: వివేక్, జానుల జాతకాలు కలిశాయని, ఇద్దరి మనసులు కలిశాయని అలాంటి వాళ్లని కలపడానికి నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు అని అరవింద దేవయానిని అడుగుతుంది. దానికి దేవయాని కోపంగా జాహ్నవికి తన కొడుకు చేత తాళి కట్టించుకోవడానికి తమ ఇంటికి కోడలు అవ్వడానికి ఎలాంటి అర్హత లేదు అని మండిపడుతుంది. అసలు దాన్ని నా కోడలిగా ఎప్పటికీ ఊహించుకోలేను అని అంటుంది. ఇక అక్కడే ఉన్న వివేక్‌కి తాను చూసిన అమ్మాయితో పెళ్లికి రెడీగా ఉండమని చెప్తుంది. తన జీవితంలో జాను లేకపోతే తనకు జాను లేనట్లే అని వివేక్ అరవిందతో చెప్తాడు. 


దీక్షితులు: లక్ష్మీ.. పరిష్కార మార్గం దొరికిందని ఆనంద పడాలో బాధ పడాలో అర్థం కావడం లేదు. 
లక్ష్మి: ఏమైంది దీక్షితులు గారు మిత్ర గారు గండం నుంచి బయట పడటం మనకు కావాలి. ఆయన ప్రాణాలతో బయట పడటం మనకు కావాలి. అందుకు ఓ మార్గం దొరికితే సంతోషించాలి కానీ ఎందుకు ఇలా సందేహ పడుతున్నారు. 
దీక్షితులు: లక్ష్మీ.. ఈ సారి మిత్రకు రానున్న గండం ఎంత బలమైనదో దాన్ని తొలగించడానికి చేయబోయే ప్రయత్నం అంత భయంకరమైనది.
లక్ష్మీ: ఎంత కష్టమైన పర్వాలేదు దీక్షితులు గారు.
దీక్షితులు: అయ్యో లక్ష్మీ నీకు ఎలా చెప్పాలో తెలీడం లేదు. మిత్రను గండం నుంచి గట్టెక్కించాలి అనుకుంటే నీ ప్రాణానికి గండం తప్పదు. ఈ పరిష్కారం మార్గంలో నీ ప్రాణాలకు ముప్పు ఉంది. 
లక్ష్మీ: దీక్షితులు గారు ప్రేమించిన భర్తకు దూరంగా ఉండటం కంటే కష్టమైనది ఏదో ఉండదు. ఇప్పుడు నేను పడుతున్న బాధ, ఆవేధన కంటే కఠినం ఇంకేంది ఉండదు. మిత్ర గారి కోసం నేను ఏం చేయడానికి అయినా రెడీ. దయచేసి మీరు ఆ మార్గం చెప్పండి. దీక్షితులు గారు లక్ష్మీకి ఆ పరిష్కారం మార్గం చెప్తారు. లక్ష్మీ దానికి తాను సిద్ధమే అని అంటుంది. 


జున్ను, వసుధారలు లక్కీ ఇంటికి వస్తారు. వసుధార పండ్లు కొనడానికి వెళ్లే జున్ను పరుగున ఇంటికి వస్తాడు. దేవయాని జున్నుని చూసి వాడిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటుంది. లక్కీకి ఏమైతే ఎందుకు అంత పరుగులు పెడుతున్నావ్ అని నేను సొంత వాళ్లకి ఏమైనా పట్టించుకోను అని దేవయాని అంటుంది. 


జున్ను:  ఎందుకు ఇందాక మీ అబ్బాయిని కారు గుద్దేసి కింద పడిపోయారు కదా. ఇప్పుడు ఆయనకు ఏమైందో అని మీకు బాధ అనిపించదా.. ఏమీ అనిపించదా.
దేవయాని: ఏం మాట్లాడుతున్నావ్‌రా వివేక్‌కి ఏమైంది. కారు గుద్దిందా ఎప్పుడు. ఎక్కడ..
జున్ను: ఆగండి.. ఆగండి.. మీ అబ్బాయికి ఏం కాలేదు నేను అబద్ధం చెప్పాను.
దేవయాని: అబద్ధం ఎందుకు చెప్పావ్ రా ఏమైందో అని ఒక్కసారి గుండె జారిపోయింది తెలుసా.
జున్ను: నేను కూడా లక్కీకి ఏమైందా అని ఇలాగే బాధ పడ్డాను. ఇంకొక్కసారి ఎదుటి వాళ్ల బాధని వెక్కిరించకండి.


ఇక వసుధార రావడంతో జున్ను, వసుధారలు లోపల జున్ను దగ్గరకు వెళ్లారు. ఇక వివేక్ మిత్రతో జున్ను మాటల్లో చాలా డెప్త్ ఉందని అంటాడు. ఇక వివేక్ మిత్రతో నీకు వదినకు కొడుకు పుట్టి ఉండుంటే ఇలాంటి వాడే పుట్టుండేవాడు అని అంటాడు. ఇక మిత్ర తనకు అలాంటి కొడుకు ఉంటే తనలా పెంచుతాను అంటే వివేక్ ఇప్పుడు నీలాగే ఉన్నాడని అలా అన్నాను అని సెటైర్లు వేస్తాడు. జున్ను లక్కీని చూసి ఎమోషనల్ అయిపోతాడు. ఏడ్చేస్తాడు. మిత్ర జున్ను మాటలు వింటాడు. జున్ను లక్కీతో నేను అమ్మకి ఏమైనా ఇలాగే ఏడుస్తాను. నీకు ఏమైనా ఏడుస్తాను అంటాడు. మిత్ర రావడంతో జున్ను పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అంటాడు. ఇక జున్ను లక్కీతో నాన్నలు కేర్‌లెస్‌గా ఉంటారని అమ్మ ఉంటే పక్కనే ఉండి చూసుకునేది అని అంటాడు. మిత్ర లక్కీ మాటలతో తనకే ఎసరు పెడుతున్నాడు అని జున్నునే లక్కీని పాడుచేసేస్తున్నాడు అని అంటాడు. 


ఇక అమ్మ ఎందుకు రాలేదు అని లక్కీ అడుగుతుంది. అమ్మతో ఉంటే బాగుండేది అని లక్కీ అంటుంది. మిత్ర ఇంటికి లక్ష్మీ వచ్చి దూరం నుంచి ఇంటిని చూస్తూ మిత్రని దగ్గరుండి చూసుకోవాలి అనుకుంటుంది. ఇక జున్ను లక్కీతో రోజంతా ఉంటాను అని అంటాడు. మిత్ర పర్లేదు అని అంటాడు. మరోవైపు జాను కూడా మిత్ర ఇంటికి దగ్గరకు వస్తుంది. జాను మిత్రని చూస్తుంది. అక్క అక్క అంటూ పరుగులు తీస్తుంది. అది లక్ష్మీ కారు అద్దంలో చూసి షాకైపోతుంది. జాను చూసిందా అనుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. జాను రావడం చూసిన దేవయాని కుక్క వస్తుందని అంటుంది. ఇక దేవయాని జానుతో ఇప్పుడు వస్తే వచ్చావ్ కానీ రేపు వివేక్‌కి పెళ్లి అయితే ఇంటికి వచ్చావు అంటే వాడి పెళ్లాం నిన్ను ఉంచదని తిడుతుంది. వివేక్ వచ్చి తల్లి మీద సీరియస్ అవుతాడు. వివేక్ జానుని తీసుకెళ్లిపోతాడు. వివేక్ సీరియస్ అవ్వడంతో మనీషా నీ పట్టు తగ్గిపోతుందని దేవయానిని రెచ్చగొడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: రెస్టారెంట్‌లో దీప వింత ప్రవర్తన.. 'దీప నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా': జ్యోత్స్న,