Trinayani Today Episode: నయని తను కన్న తొలి బిడ్డ గాయత్రీ దేవిని కలుస్తుందని గురువుగారు చెప్తారు. విశాల్ షాక్ అవుతాడు. కంగారు పడతారు. నయని కన్న బిడ్డను కచ్చితంగా కలుసుకొని తీరుతుందని గురువుగారు చెప్తారు. తన కన్న బిడ్డకు గండం రావడం నయనికి తెలియదు కాబట్టి తాను చెప్పానని లేదంటే ఈ నిజం నయనినే మనతో చెప్పేదని గురువుగారు అంటారు. నయని చాలా సంతోషిస్తుంది. తన బిడ్డను ఇన్నాళ్లకు చూడబోతున్నాను అని పొంగిపోతుంది. 


హాసిని: ఇంతకీ ఆ గండం ఎలా వస్తుందో చెప్పలేదు గురువుగారు.
గురువుగారు: ఇంటికే వస్తుంది. 
వల్లభ: మమ్మీ మనకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా.
తిలోత్తమ: సమస్య రావాలి. అప్పుడేగా దాన్ని పరిష్కరించుకోగలం.
విశాల్: అంటే స్వామి గండం ఇంటికి వస్తే ఒకటికి రెండు సమస్యలు రావొచ్చు కదా. మీకు తెలియనిది కాదు.
గురువుగారు: ఇంటికి వచ్చే గండం ఇక్కడి నుంచి గమ్యస్థానాన్ని మార్చుతుంది. అక్కడికి నయని వెళ్లవలసి ఉంటుంది. 


తిలోత్తమ: నయనితో వల్లభ, తిలోత్తమలు ఆరుబయట మాట్లాడుతారు. నయని నా మీద నీకు ఎంత మంట ఉందో నాకు తెలుసు కానీ నువ్వు నన్ను అని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఎవరికైనా ఆపద వస్తుందంటే నువ్వు ఎంత వేగంగా పరుగులు తీస్తావో నాకు తెలుసు. ఇప్పుడు నీ కాళ్లకు బ్రేక్ వేయడానికి కారణం ఏంటంటే. పునర్జన్మలో ఉన్న గాయత్రీ అక్కయ్యకి గండం వస్తుందని గురువుగారు చెప్పారు. పుష్పం కూడా ఇచ్చారు. దాని ఆధారంగా చూసి నయని పెద్దబిడ్డ దగ్గరకు వెళ్తుందట. కానీ అది రెండు రోజుల్లోనే వాడిపోతుంది.
నయని: ఈలోపే నేను నా బిడ్డ దగ్గరకు వెళ్తాను. అది ప్రాణ గండం అయినా ఏమైనా నేను ప్రాణాలతో ఉండగా నా బిడ్డకు ఏం అవ్వనివ్వను.
తిలోత్తమ: ఈ ప్రయాసలో నీ ప్రాణం పోతే.
నయని: నా కూతురు అయితే ప్రాణాలతోనే ఉంటుంది. నీ అంతు చూడటానికి. మీది రక్త చరిత్ర అయి తీరుతుంది. ఒక్కసారి నేను నా పెద్ద కూతుర్ని కలిశాను అంటే తనని ఇంటికి తీసుకొస్తాను. తను ఇంటికి వచ్చింది అంటే మీకు చావు వచ్చినట్లే. గండం ఉందా లేదా అని జాతకాలు తిరగేయాల్సిన అవసరం లేదు. ఈ  పెద్ద కొడుకు మీ కోసం గోయ్యి తీస్తే చాలు. మీ అమ్మ శవాన్ని గోతిలో వేసి కప్పేయడానికి. 
వల్లభ: మంత్ర పుష్పం ఎఫెక్టా మమ్మీ ఇంత వార్నింగ్ ఇచ్చింది.
తిలోత్తమ: ఆరిపోయే దీపం బాగా వెలుగుతుందిరా.


సుమన విక్రాంత్‌తో మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. మీ వదిన పెద్ద కూతురు వస్తుందని ఊరేగండి అని వెటకారంగా మాట్లాడుతుంది. విక్రాంత్‌ని ఉద్దేశించి కోట్లు ఉన్నా బికారిలా బతుకుతారని అంటుంది. విక్రాంత్ సుమనను తిడతాడు. ఇక తిలోత్తమ, వల్లభలు గంటలమ్మ దగ్గరకు వెళ్తారు. గురువుగారు నయనికి పుష్పం ఎందుకు ఇచ్చారని ఆలోచిస్తున్నాను అని గంటలమ్మ అంటుంది. 


గంటలమ్మ: గురువుగారు మంత్ర పుష్పం నయనికి ఇచ్చారు అంటే తన పన్నాగాన్ని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారని అర్థమవుతుంది. 
వల్లభ: అసలు ఈవిడ ప్లాన్ ఏంటో చెప్పమను మమ్మీ.
గంటలమ్మ: గాయత్రీ దేవి గత జన్మలో ఎంత గొప్ప జాతకాన్ని కలిగి ఉందో పునర్జన్మలో అంత కంటే గొప్ప యోగఫలాన్ని పొందగలదు. పసి బిడ్డలా ఉన్న తనని పట్టి పుర్రెలదిబ్బకి తీసుకెళ్తే రక్త చాముండికి సమర్పణ జరుగుతుంది.
తిలోత్తమ: అంటే నా శత్రువు అయిన గాయత్రీ అక్క చరిత్ర అంతటితో ముగిస్తుంది కదా. 
గురువుగారు: ఆ పుష్పం వల్ల నయనిని ఇరకాటంలో పెట్టేయొచ్చు. గాయత్రీదేవి తర్వాత అంత గొప్ప జాతకం ఉన్నది నయని దత్తత తీసుకున్న గాయత్రీ పాపకే. తనని ముందు పుర్రెలదిబ్బకు తీసుకెళ్తే నయని తన దత్తపుత్రికను కాపాడాల లేక తొలి బిడ్డను కాపాడాలా అని అయోమయంలో పడుతుంది. ఆలోపు రెండు కార్యాలు పూర్తి చేయొచ్చు.
తిలోత్తమ: ఆసక్తి గానే ఉంది కాని ఆ పిల్లని తీసుకెళ్లే శక్తి ఎవరికి ఉంది.
గంటలమ్మ: విభూదికి ఉంది. ఆ విభూది మాయ చేసి ఎవర్ని అయినా తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్లడమే తిరిగి రావడం ఉండదు. సజీవంగా వెళ్లి ఎముకల గూడుగా మిగిలిపోతారు. బలిరా బలి. 


విశాల్, విక్రాంత్, నయని వాళ్లు ఫైల్స్ చెక్ చేస్తారు. సుమన వచ్చి నయని తొలిబిడ్డ గురించి వెతకరా అని అడుగుతుంది. లేదంటే ఆ పాప ఆస్తి ఉలూచికి అయినా ఇస్తారా అని సుమన ఆశ అని వల్లభ అంటాడు. మేం ఎందుకు ఇస్తామని నయని అంటుంది. పునర్జన్మ ఎత్తిన తన తల్లి ప్రపంచానికి పరిచయం అవ్వడానికి ఇంకా టైం ఉందని విశాల్ అంటాడు. ఇక ఆరు నెలల్లో అచూకి చెప్తారా అని సుమన అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జేఎమ్మార్‌ని బతికించిన లక్ష్మీ.. అచ్చం జేఎమ్మార్ కూతురిలా ఉన్న లక్ష్మీ బిజినెస్‌లు చూసుకుంటుందా!