Suma Adda Latest Promo: తన కామెడీ పంచులతో, అదిరిపోయే టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంటారు సుమ. గత కొన్ని వారాలుగా తను హోస్ట్ చేస్తున్న ‘సుమ అడ్డా’లోకి సీరియల్ ఆర్టిస్టులే గెస్టులుగా వస్తున్నారు. కానీ వచ్చేవారం కాస్త రూటు మార్చారు. ఈసారి సిరి హనుమంత్ - శ్రీహాన్, అలీ, సౌమ్యలతో సందడి చేశారు. జులై 23న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ఇక చాలాకాలం తర్వాత లవ్ బర్డ్స్ అయిన సిరి, శ్రీహాన్ బుల్లితెరపై కలిసి కనిపించనున్నారు. ఇక యాంకర్ సౌమ్య కూడా తన కిచిడి తెలుగుతో అందరినీ నవ్వించింది.


సిరి, శ్రీహాన్‌ల కొడుకుగా అలీ..


అలీ రాగానే వెల్‌కమ్ టూ సుమ అడ్డా అంటూ వారికి డ్రింక్స్ ఇచ్చారు సుమ. అది చూడడానికి వెరైటీగా ఉందని.. ఏంటి ఇది అని అడగగా వైన్ అని టక్కున చెప్పేసింది సౌమ్య. ‘‘పాప కర్ణాటక నుండి వచ్చింది. తెలుగు కొంచెం రాదు’’ అని సౌమ్య గురించి అలీ చెప్తుండగానే ‘‘తెలుగు బాగానే వస్తుంది కానీ మాట్లాడుతున్నప్పుడు లింగ కన్‌ఫ్యూజన్ అవుతుంది’’ అని క్లారిటీ ఇచ్చింది సౌమ్య. లింగ అంటే అర్థం కానీ సుమ షాకయ్యింది. అదేంటో క్లారిటీ ఇవ్వగానే అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత సిరి, శ్రీహాన్ భార్యాభర్తలుగా.. అలీ తన కొడుకుగా స్కిట్ చేశారు. అలీకి మార్కులు తక్కువ రావడంతో శ్రీహాన్ తనను బెదిరించాడు. కెమిస్ట్రీ టీచర్ మాత్రమే బాగుందని, అందుకే కెమిస్ట్రీలో మాత్రమే మంచి మార్కులు వచ్చాయని అలీ చెప్పడంతో భవిష్యత్తులో సిరి, శ్రీహాన్‌కు కొడుకు పుడితే అలాగే ఉంటాడని సుమ కౌంటర్ వేశారు.


నీకు సెటప్ ఉన్నారు..


తాజాగా విడుదలయిన ‘సుమ అడ్డా’ ప్రోమోలో అలీ - సౌమ్య, సిరి - శ్రీహాన్ మధ్య గేమ్‌లో కూడా గట్టి పోటీ నడిచింది. అదే క్రమంలో ‘అమ్మాయిలను ఎలాంటి దుస్తుల్లో చూస్తే అబ్బాయిలు ఇంప్రెస్ అవుతారు?’ అనే ప్రశ్న ఎదురయ్యింది. దానికి లంగా, ఓణీ అని సమాధానం ఇస్తూ సిరి, శ్రీహాన్ రూ.1 లక్ష రూపాయలు బెట్ పెట్టారు. కానీ అది కరెక్ట్ ఆన్సర్ కాదంటూ సౌమ్య.. రూ.50 వేలు పందెంలో పెట్టింది. ఆ తర్వాత ఈ ప్రోమో అంతా ఎక్కువశాతం ఫన్ మూడ్‌లోనే సాగిపోయింది. సిరి, సౌమ్య కలిసి బిందెల్లో నీళ్లు నింపుకోవడానికి కొట్టుకునే మహిళల్లాగా యాక్ట్ చేశారు. ‘‘ఇక్కడ నల్ల ఏది’’ అని సౌమ్య అడగగా.. ‘‘ఇక్కడ ఉంది అనుకో. ఈమెకు అన్నీ సెటప్ చేయాలి’’ అని సిరి కౌంటర్ ఇచ్చింది. ‘‘నీకు అయినా సెటప్ ఉన్నారు. నాకు లేరు’’ అంటూ సౌమ్య రివర్స్ కౌంటర్ ఇచ్చింది.



మలయాళంలో సుమ కామెడీ..


అక్కడ టాప్‌ను తన భర్తే పెట్టించాడని, అందుకే ముందు తనే నీళ్లు నింపుకుంటానంటూ గొడవకు దిగింది సౌమ్య. ఆ తర్వాత తన బిడ్డకు వాష్ చేయడానికి కూడా నీళ్లు లేవు అనగానే ‘‘నీ బిడ్డ వల్లే మన బస్తీలో మొత్తం కంపు కొడుతుంది’’ అని అడుగుతూ సుమ కూడా వీరి స్కిట్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత అందరూ కలిసి మరో స్కిట్ చేశారు. అలీ, శ్రీహాన్ పెళ్లిచూపులకు వచ్చిన అబ్బాయిల్లాగా నటించారు. ఆ స్కిట్‌లో మలయాళంలో మాట్లాడి అందరినీ నవ్వించారు సుమ. పాట పాడమని అడగగానే ఊ అంటావా పాట పాడి ఇంప్రెస్ చేశారు అలీ. ఆ తర్వాత సుమ కూడా వారితో శృతికలిపారు. ఇక ప్రోమో చివర్లో తన బెస్ట్ కాంబినేషన్ ఎవరితో అని అలీని అడుగుతూ రవితేజ, పవన్ కళ్యాణ్ అంటూ రెండు ఆప్షన్స్ ఇచ్చారు సుమ. దానికి అలీ.. పవన్ కళ్యాణ్ అని సమాధానమిచ్చారు. దీంతో నెటిజన్స్.. మొత్తానికి అలీ ఒప్పకున్నాడుగా అని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా ఇద్దరు కలిస్తే బాగుంటుందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ కాంబినేషన్ మళ్లీ చూడాలని ఉందంటూ అంటున్నారు.



Also Read: ‘మనోరథంగల్’, ఇండస్ట్రీ అంతా ఒక్కచోట చేరితే అదే ఇది - త్వరలో ZEE5లోకి ఈ క్రేజీ సిరీస్‌