Trinayani Today Episode సుమనకు తిలోత్తమ ఆస్తి రాసిస్తుంది. అయితే ఒకసారి ఆ డాక్యుమెంట్లు పోతే మరోసారి రాయను అని చెప్తుంది. వల్లభ తిలోత్తమ దగ్గరకు వస్తే సుమన పూజ చేసి హారతి ఇచ్చే టైంలో అమ్మవారి దగ్గర ఉన్న పేపర్లు మీద నిప్పుపడి పేపర్లు కాలిపోవాలని చెప్తుంది. వల్లభ ఈ సారి కచ్చితంగా పేపర్లు కాల్చేస్తానని చెప్తుంది.ఎవరికీ అనుమానం రాకుండా చక్కగా రెడీ అవ్వాలని వల్లభతో చెప్తుంది. మరోవైపు హాసిని విశాల్, నయనిలతో తిలోత్తమ 70 కోట్ల విలువైన ఆస్తిని ఎలా ఇస్తుందని అనుమానపడుతుంది.
హాసిని: తిలోత్తమ అత్తయ్య ఏదీ ఊరికే ఇవ్వదు. ఇచ్చింది అంటే దానికి డబుల్ లాగేసే మెంటాలిటీ తనది. అలాంటిది చిట్టీని కోటీశ్వరురాల్ని చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని నా అనుమానం.
విశాల్: స్వార్థంతో ఇచ్చిందేమో. ఎలా అయినా అమ్మ సంపాదించిన ఆస్తి వల్లభ అన్నయ్య, విక్రాంత్‌కి సమానంగా ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు సుమనకు ఇచ్చినా విక్రాంత్ కూడా బాగుపడతాడని ఆలోచించొచ్చు కదా.
నయని: నాకు ఎక్కడో తేడాగా అనిపిస్తుంది. మనసులో.. నా అనుమానం ఏంటి అని వీళ్లు అడగలేదు. నేను చెప్పలేదు.
దురంధర పూజకు ఏర్పాట్లు చేస్తుంది. దురంధరకు పిల్లలు లేరని వల్లభ అంటాడు. దానికి తిలోత్తమ మిమల్ని అల్లుళ్లలా కాకుండా పిల్లల్లా చూసుకుందని అంటుంది. ఇక సుమన డాక్యుమెంట్స్ తీసుకొని వస్తుంది. గురువుగారు కూడా వస్తారు. హారతి ఎప్పుడెప్పుడు ఇస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారని తిలోత్తమ, వల్లభలను ఉద్దేశించి గురువుగారు అంటారు. సుమన, దురంధరలకు పూజ చేయమని నయనితో పాటు గురువుగారు చెప్తారు. పేపర్ల మీద హారతి పడేలా చేయమని తిలోత్తమ వల్లభకు సైగ చేస్తుంది. దురంధర, సుమనలు దేవుడికి హారతి ఇస్తారు. మధ్యలో వల్లభ నేను హారతి ఇస్తానని పళ్లెం తీసుకొని గిరగిరా తిప్పుతాడు. హారతి కరెక్ట్‌గా ఆస్తి పేపర్ల మీద పడే టైంకి విశాల్ హారతి కర్పూరం చేతిలో పట్టుకుంటాడు. దాంతో తిలోత్తమ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది.
సుమన: థ్యాంక్స్ బావగారు మీరు సమయానికి హారతి పట్టుకోకపోయి ఉంటే ఆస్తి పేపర్లు కాలిపోయేవి. మళ్లీ రాసిచ్చేవారు కాదు అత్తయ్య. అలా జరిగుంటే నేను ఈ జన్మకి కోటీశ్వరురాలు కాలేకపోయేదాన్ని.
గురువుగారు: కాలేవు కూడా సుమన.
విక్రాంత్: అదేంటి స్వామి అలా అంటారు. అమ్మ ఆస్తి 70 కోట్లు రాసిచ్చింది కదా.
గురువుగారు: రాయలేదు.
వల్లభ: రాయలేదా. మరి మా అమ్మ సంతకం చేసింది కదా. దురందర అత్తయ్య రాసింది కదా.
తిలోత్తమ: 70 కోట్లు అయితే పోయినట్లే కదా.
గురువుగారు: సుమనకు ఆస్తి రాయలేదు. రాదు కూడా.
పావనా: తనకి రాకపోతే ఇంకెవరికి వస్తుంది స్వామి.
గురువుగారు: అది నీ భార్య చెప్పాలి పావనా.
పావనా: చెప్పవే.
దురంధర: అయితే ఇప్పటి వరకు ఈ కాగితంలో నేను ఏం రాశానో చూడలేదన్నమాట.
నయని: నువ్వు చదవలేదా సుమన.
సుమన: పిన్ని రాశాక చదవడం ఎందుకు అనుకున్నాను. ఏముంది అందులో.
దురంధర: సారీ సుమ్మి మోసం అన్యాయం అక్రమం అని నువ్వు అనుకోవచ్చు కానీ నాకు స్వార్థం ఉంటుంది. అవకాశం వస్తే వాడుకోవాలి అన్న తెలివితేటలు నాకు కూడా ఉంటాయి కదా. తిలోత్తమ వదిన చెప్పినట్లు కాకుండా కాస్త మార్చి రాశాను. 70 కోట్లు ఈ దురంధరకు ఇస్తున్నట్లు సంతకం చేయించుకున్నాను. అందరూ షాక్ అయిపోతారు.
వల్లభ: అంటే ఇప్పుడు మా మమ్మీ ఆస్తిలో వాటా నీకు వచ్చిందన్నమాట.
ఎంత మోసం చేశావని తిలోత్తమ కొట్టడానికి వెళ్తే నయని తిలోత్తమ చేయి పట్టుకుంటుంది. మీ నిర్లక్ష్యం వల్ల మా చెల్లికి ఆస్తి పోయిందని అంటుంది. ఇక సుమన దురంధరను తిడుతుంది. గొడ్రాలికి ఆస్తి ఎందుకని తిడుతుంది. నయని సుమనను నోర్ముయ్ అని అంటుంది. పొద్దున్నుంచి పిన్నికి నలతగా ఉందని అంటుంది కాదా తాను నెలతప్పిందని నీకు తెలుసా అని అడుగుతుంది. పావనామూర్తికి అందరూ శుభాకాంక్షలు చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.