Jagadhatri  Serial Today Episode: ధాత్రి, కేదార్‌ పార్టీలో తాగి పడిపోయినట్లు నటిస్తారు. నిషిక, వైజయంతి వాళ్లన చూసి ఉదయం వరకు మీరు ఇలాగే పడుకుని ఉండండి. ఈలోపు మేము దుబాయ్‌ చెక్కేస్తాం అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అంతా విన్న  ధాత్రి, కేదార్‌ను నిద్రలేపి వారిని ఫాలో అవుతుంది. మరోవైపు కౌషికి, సురేష్‌ కూడా వాళ్ల రూంలోకి వెళ్లి ఇద్దరూ మాట్లాడుకుంటారు.


కౌషికి: కాలేజీలో ఎప్పుడూ కలిసి ఉండేవాళ్లం. ఇంటికి వెళ్తే మళ్లీ ఎప్పుడు కలుస్తామో అని ఎదురుచూస్తుండేవాళ్లం కదా? అసలు ఇంతదూరం మన మధ్య ఎప్పుడొచ్చింది సురేష్‌.


సురేష్‌: బాధ్యతలు వచ్చినప్పుడు కౌషికి. మనం కలిసి ఉండటానికి కాకుండా విడిపోవడానికి గొడవలు పడ్డప్పుడు. నువ్వు.. నేను ఎప్పటికీ వదులుకోలేని ఒక చెడ్డ అలవాటు కౌషికి నువ్వు. నీకు దూరంగా ఉండలేను అలా అని దగ్గరగా కూడా బతకలేను.


కౌషికి: మనం కలవాలని రాసిన ఆ దేవుడు. కలిసుండాలని రాయలేదనుకుంటా? అందుకే లైఫ్‌ లాంగ్‌ సంతోషంగా కలిసుండాల్సిన మనం ఇలా ఒకర్ని ఒకరం సాధిస్తూ దూరంగా ఉంటున్నాం.


  అంటూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఏడుస్తుంటారు. మరోవైపు ధాత్రి, ఒడిలో నిద్రపోతున్న కేదార్‌ను ప్రేమగా చూస్తుంది. ఇంతలో టైం తెల్లవారుజామున 3 గంటలు అవుతుంది. కమలాకర్‌ జూస్‌లో మందు కలిపిన విషయం గుర్తు చేసుకుంటుంది. నేను ఉండగా అలా జరగనిస్తానా? అనుకుంటుంది. కేదార్‌ను నిద్ర లేపుతుంది.


ధాత్రి: ఎవరైనా డ్రింక్‌ ఇస్తే తాగేస్తావా? అందులో ఏముంది? ఏమౌతుంది అని కూడా ఆలోచించవా? నేను చెప్పే లోపే ఆఫ్‌ గ్లాస్‌ తాగేశావు.


కేదార్‌: ఏమైనా అయితే చూసుకోవడానికి నువ్వు ఉన్నావన్న ధైర్యం ధాత్రి.


ధాత్రి: ఈ కబుర్లకేం తక్కువ లేదు… ఏమైనా చెప్పాలా?


కేదార్‌: అవును నువ్వు చాలా అందంగా ఉన్నావు.


ధాత్రి: ఎవరైనా చూస్తారన్నా భయం లేదు. అయినా నీకు మత్తు వదులాలని చేస్తున్నాను చూడు నాది బుద్ది తక్కు వ.


 కేదార్‌: నన్ను వదిలి వెళ్లకు ధాత్రి. నేను ఉండలేను. నీవల్లే బతికున్నా.. నీకొసమే బతుకుతున్నా ధాత్రి. జగధాత్రి లేకుంటే కేదార్‌ నాలుగు గోడల మధ్య ఎప్పుడో చచ్చి ఉండే వాణ్ని.


ధాత్రి: ఇలా మాట్లాడితేనే నాకు కోపం వచ్చేది.


కేదార్‌: నువ్వు ఉండగా నాకేం అవుతుంది ధాత్రి. ఈ ట్విన్‌ సిటీస్‌లో జేడీ హస్బెండ్‌ను టచ్‌ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా.


ధాత్రి: చుప్‌ ఎవరైనా వింటారు…


 అనగానే ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ధాత్రి కూడా రొమాంటిక్‌గా కేదార్‌కు ప్రపోజ్‌ చేస్తుంది. మరోవైపు దుబాయ్‌ పారిపోవడానికి యువరాజ్‌ ముస్లిం గెటప్‌లో ఇంటికి వస్తాడు. ఇంట్లో నిషిక కూడా ముస్లిం గెటప్‌ లో ఉంటుంది.


వైజయంతి: అబ్బోడా నువ్వు రాకపోయేసరికి భయపడినాను నాయనా..?


యువరాజ్: ఎవరైనా ఫాలో అవుతున్నారేమోనని చూసుకుని వచ్చేసరికి లేట్‌ అయింది అమ్మా..సరేమ్మా మేము ఇక బయలుదేరుతాం. నిషి నీకు కావాల్సిన వన్నీ సర్దుకున్నావు కదా?


నిషిక: అదిగో అక్కడ అన్నీ సర్ధి పెట్టాను.


వైజయంతి: జాగ్రత్త అమ్మీ..


 అని చెప్పగానే యువరాజ్‌, నిషిక కలిసి వెళ్లిపోతారు. కమలాకర్‌ మధ్యలో ఎక్కడా ఆగకుండా ఎయిర్‌ఫోర్టు వరకు వెళ్లమని జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. మరోవైపు బయట ధాత్రి, కేదార్‌ వెయిట్‌ చేస్తుంటారు. యువరాజ్‌, నిషిక కారులో వెళ్తుంటారు. ధాత్రి, కేదార్‌ వాళ్లను ఫాలో అవుతుంటారు. ఇంతలో పాస్‌ఫోర్ట్‌ ఉన్న బ్యాగు ఇంట్లోనే మర్చిపోయారని బ్యాగ్‌ ఇవ్వడానికి బయటకు వచ్చిన కమలాకర్‌ ధాత్రి వాళ్లను చూసి యువరాజ్‌కు ఫోన్‌ చేస్తాడు. యువరాజ్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేయడు. దీంతో కమలాకర్‌ కూడా వాళ్లను కారులో ఫాలో అవుతుంటాడు. ఇంతలో ధాత్రి, కేదార్‌ వెళ్లి యువరాజ్‌ ను పట్టుకుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: జాన్వీ కపూర్‌ స్టన్నింగ్‌ లుక్‌ - మల్టీకలర్‌ లెహెంగాలో మెరిసిపోతున్న 'దేవర' బ్యూటీ