chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: మిత్ర తన పెళ్లి ఫొటో చూసేలా అరవింద ఎదురుగా పెడుతుంది. అది చూసిన మిత్ర ఫొటో చేతిలో పట్టుకొని తాను లక్ష్మీ కలిసి సంతోషంగా గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటాడు. ఎమోషనల్ అవుతాడు. అది చూసి అరవింద తన భర్త హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలోనే మిత్రకు లక్ష్మీ చేసిన మోసం గుర్తొచ్చి ఒక్కసారిగా కోపంతో ఫొటోని కింది విసిరి కొడతాడు. నమ్మకద్రోహి అని గట్టిగా అరుస్తాడు. అందరూ అక్కడికి చేరుకుంటారు. అరవింద ఆ జ్ఞాపకాలు ఎందుకు తన ముందుకు తీసుకొస్తున్నారు అని ప్రశ్నిస్తాడు. 


మిత్ర: అవి నా కళ్ల ముందు కనిపించిన ప్రతీసారి నా గుండె వేయి ముక్కలు అవుతుంది. నా రక్తం వేగంగా ప్రవహిస్తుంది. ఇలాంటి చేది జ్ఞాపకాలు నేను మళ్లీ మళ్లీ చూడాలని అనుకోవడం లేదు.
అరవింద: ఇవి నీకు చేదు జ్ఞాపకాలు కావొచ్చు కానీ మాకు మధురమైన గుర్తులు. నువ్వు నీ భార్యని ద్వేషిస్తున్నావేమో కానీ మేం మా కోడలిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాం. 
మిత్ర: ఓ అలాగా.. అంటే మీరు మీకు కొడుకు కంటే కోడలు ముఖ్యమని చెప్పాలి అనుకుంటున్నారా. నేను ఎవరిని అయితే వెలివేశానో మీరు తననే వాటేసుకోవాలి అనుకుంటున్నారు. అది నాకు నచ్చడం లేదు. మీ కొడుకు అభిప్రాయాలు మీరు గౌరవించేలేనప్పుడు  మీ కోడలు బతికే ఉందని నమ్ముతున్నారు  కదా వెళ్లి తన దగ్గరే ఉండండి. బాయ్..
మనీషా: ఏంటి అంటీ ఇది మీరు మిత్ర జీవితాన్ని బాగుపడాలి అనుకుంటున్నారా. ఆడుకుంటున్నారా అర్థం కావడం లేదు. మిత్ర ద్వేషిస్తున్న మనుషుల్ని మీరు ప్రేమిస్తారు. అసలు మిత్ర మనస్శాంతిగా ఉండటం మీకు ఇష్టం లేదా. తల్లిదండ్రులు అంటే పిల్లల సంతోషం కోసం చూస్తారు.  మీరేంటి అంటా మిత్ర బాధ పడేలా చేస్తున్నారు.
అరవింద: కొంచెం నోరు మూస్తావా మనీషా. చూడు నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. తన జీవితాన్ని ఎలా నిలబెట్టాలో నాకు తెలుసు. నువ్వు మా విషయాల్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 


భాస్కర్ మిత్ర విసిరేసిన ఫొటో తీసుకొని చూస్తాడు. లక్ష్మీని మిత్ర పక్కన చూసి ఇన్ని అప్పట్లో తన దగ్గర ఉన్నది మిత్ర గారి భార్య లక్ష్మీనా అనుకుంటాడు. మిత్ర దత్తత తీసుకున్న లక్కీ తన సొంత కూతురని మిత్రకు తెలీదా అని ఆశ్చర్యపోతాడు. ఇక మనీషా భాస్కర్‌ని గమనిస్తుంది. మిత్రకు లక్ష్మీ తెలుసేమో అనుకుంటుంది. భాస్కర్ దగ్గరకు వెళ్లి లక్ష్మీ తెలుసా అని అడుగుతుంది. మిత్ర లక్ష్మీని అసహ్యించుకుంటున్నాడు అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటుందని ఇప్పుడు లక్ష్మీ తనకు తెలుసని చెప్తే లక్కీ మీద లక్ష్మీ మీద ఉన్న కోపం చూపిస్తే లక్కీ ఇబ్బంది పడుతుందని అనుకొని నిజం చెప్పకుండా దాచేస్తాడు. 


మరోవైపు అర్జున్ తన తల్లి వసుంధరతో లక్ష్మీ తన గురించి ఏమనుకుంటుందో ఎలాంటి అభిప్రాయంతో ఉందో తెలీడం లేదని చెప్తాడు. దాంతో వసుంధర స్పష్టత లేని ఏ రిలేషన్ అయినా ఎన్ని రోజులు నిలబడదని క్లారిటీ తెచ్చుకోవాలని అంటుంది. ఇంతలో లక్ష్మీ అక్కడికి వస్తుంది. లక్ష్మీ కూడా అర్జున్ వాళ్లతో తన గతం గురించి చెప్పాలని అనుకుంటున్నానని అంటుంది. ఇంతలో ఫోన్ రావడంతో మాట్లాడి వస్తానని అంటుంది. 


వివేక్: వదినా నేను అన్నయ్య గెస్ట్ హౌస్‌కి వచ్చాం. ఇక్కడ అన్నయ్య ఇంట్లో గొడవ వల్ల ఇక్కడ విపరీతంగా మందు తాగుతున్నాడని చెప్తాడు. 
లక్ష్మీ: అర్జున్ గారు మనం తర్వాత మాట్లాడుకుందాం. నేను అర్జెంట్‌గా వెళ్లాలి.
అర్జున్: చూశావమ్మా మనం ఏం మాట్లాడాలి అనుకున్నామో తనకి తెలుసు. అందుకే ఉన్నట్టుండి మళ్లీ అవైడ్ చేస్తుంది. 
వసుంధర: నువ్వు లక్ష్మీని తప్పుగా అర్థం చేసుకోకు అర్జున్. తను గతం గురించి చెప్తా అంది కదా వదిలేయ్.
అర్జున్: మనసులో.. లక్ష్మిని ఫాలో అయితేనే తెలుస్తుంది.


మిత్ర ఫుల్లుగా మందు తాగుతుంటాడు. వివేక్ వద్దన్నా వినడు. ఈ పరిస్థతి కంటే చావడమే మేలు అని తాగి చస్తానని విపరీతంగా తాగుతాడు. వివేక్ ఎంత చెప్పినా వినడు. లక్ష్మీ కంటే ఎక్కువ తానే ప్రేమించానని లక్ష్మీ మీద ప్రేమ ఉంది కాబట్టే మనీషాని పెళ్లి చేసుకోలేకపోతున్నానని అంటాడు. తన కుటుంబాన్ని రోడ్డున పడేసిందని అందుకే లక్ష్మీని క్షమించలేకపోతున్నానని మిత్ర అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: గురువారమే కార్తీక్, జ్యోత్స్నల నిశ్చితార్థం.. పెద్ద కూతుర్ని పిలిచిన సుమిత్ర!