Satyabhama Today Episode విశ్వనాథం కాళీని కలిసి డబ్బు ఇవ్వనని చెప్పాలని వెళ్తాడు. అక్కడ కాళీ విశ్వనాథాన్ని బెదిరిస్తాడు. 20 లక్షలు ఇవ్వకపోతే సత్య ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తాడు. ఇంతలో హర్ష వచ్చి కాళీ ఫొన్‌ని విసిరేస్తాడు. కాళీకి, హర్షకి గొడవ జరుగుతుంది. ఆ గొడవలో హర్ష కాళీని తోసేస్తే కాళీ బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోతాడు. ఇంటికి వచ్చిన విశ్వనాథం  భయంతో వింత వింతగా ప్రవర్తిస్తాడు. రాత్రి పడుకున్నప్పుడు కూడా విశ్వనాథానికి ఆ సీనే గుర్తొచ్చి తుళ్లిపడి లేస్తాడు. చాలా భయపడతాడు. నిద్ర పట్టక బయట వచ్చి కూర్చొంటాడు. అది చూసిన హర్ష తండ్రి దగ్గరకు వస్తాడు. 


విశ్వనాథం: నిద్ర పట్టడం లేదురా. చనిపోయిన ఆ కాళీనే గుర్తొస్తున్నాడు. నా వల్ల కావడం లేదురా.
హర్ష: నాన్న మీ కంగారుతో మీరే దొరికిపోయేలా ఉన్నారు. 
విశ్వనాథం: పొరపాటు జరిగినా సరే మన వల్ల ఓ మనిషి చనిపోయాడు హర్ష. ప్లీజ్ నా మాట వినురా. నేను వెళ్లి పోలీసులకు లొంగిపోతాను.
హర్ష: నాన్న మీరు అరెస్ట్ అయితే సమస్యలు పెద్దవైపోతాయి. సత్యకు ఈ మధ్యే పెళ్లి అయింది సత్య ఎన్ని మాటలు పడాలో అర్థమవుతుందా. సంధ్యని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా. 
విశ్వనాథం: నువ్వు చెప్పింది నిజమే కానీ నేను ఇలా ఉండలేకపోతున్నారా. వీళ్లందరిని చూసుకోవడానికి నువ్వు ఉన్నావ్ కదా. నేను లొంగిపోతానురా. 
హర్ష: సరే నాన్న మీరు ఇంత ఆలోచిస్తారు కాబట్టి నేను వెళ్లి లొంగిపోతాను.
విశ్వనాథం: అయ్యో హర్ష నీకు చాలా భవిష్యత్ ఉందిరా. అలా అస్సలు జరగడానికి వీల్లేదు.
నందిని: ఈ టైంలో హర్ష ఎక్కడికి వెళ్లాడు.
హర్ష: నాన్న అలా జరగకుండా ఉండాలి అంటే మీరు ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోవాలి. చచ్చింది ఓ దుర్మార్గుడు. ఆడ పిల్ల జీవితంతో ఆడుకోవాలి అనుకున్నాడు. అలాంటి వాడి గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు వెళ్లండి వెళ్లి పడుకోండి.  
నందిని: ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా మీ ఇద్దరూ చాలా కంగారు పడుతున్నారు. మా దగ్గర ఏదో దాస్తున్నారు. 
హర్ష: అవును నిన్న ఉదయమే బ్యాంక్‌కు వెళ్లి రెండు కోట్లు కొట్టేశాం. వాటిని ఎక్కడ దాయాలా అని మంతనాలు జరుపుతున్నాం. తండ్రీ కొడుకులం చాలా మాట్లాడుకుంటాం అన్నీ నీతో చెప్పాలి అంటే కుదరదు. పద వెళ్లి పడుకుందాం.


మహదేవయ్య ఇంట్లో అందరూ పార్టీ ప్రెసిడెంట్‌ని కలవడానికి బయల్దేరుతారు. మహదేవయ్య పెళ్లాం మీద సెటైర్లు వేస్తాడు. పెళ్లయి 35 ఏళ్లు అవుతుందని ఇప్పుడు బాధ పడి ఏం లాభం అని సెటైర్లు వేస్తున్నాడు. ఇక సత్య గురించి అడుగుతారు. సత్య ముస్తాబవుతుంది అని భైరవి సెటైర్లు వేస్తుంది. క్రిష్‌ ఇచ్చిన చీర కట్టుకొని సత్య రెడీ అవుతుంది. క్రిష్ సత్యని ఆ చీరలో అలా చూస్తూ ఉండిపోతాడు. ఎందుకు అలా చూస్తున్నావ్ అని సత్య అడిగితే చాలా అందంగా ఉన్నావ్ అని అంటాడు. ఇంత అందం చూడకపోతే ఊపిరి ఆగిపోయాపోయేలా ఉందని క్రిష్ అంటాడు. ఊపిరి ఆగపోయినా పర్లేదని ఊపిరి అందించడానికి నువ్వున్నావని క్రిష్ అంటాడు. సత్య మీద సెటైర్లు వేస్తాడు. అందరూ వెయిట్ చేస్తున్నారని రెడీ అవ్వమని సత్య అంటుంది. నీ అందం ముందు చీర అందం కూడా వెలవెల బోతుందని అంటాడు. ఇంతలో భైరవి వస్తుంది. ఇంకా రెడీ అవ్వలేదని అడిగితే సత్య సోచాయిస్తుందని అంటాడు. వెళ్లి రెడీ అయి వస్తానని క్రిష్ కదలడు. మళ్లీ ఏమైందని సత్య అడిగితే క్రిష్ సత్య దగ్గరకు వచ్చి వెళ్లబుద్ధి కావడం లేదని అంటాడు. అయితే నేను తోస్తా అని సత్య తోసేస్తుంది.


విశ్వనాథం పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఎస్‌ఐని కలుస్తాడు. ఏమైందని ఎస్ ఐ అడిగితే తన వల్ల ఓ తప్పు జరిగిందని ఓ మనిషి ప్రాణం పోయిందని విశ్వనాథం చెప్తాడు. ఎస్‌ఐ షాక్ అయిపోతాడు. జోక్ చేస్తున్నారా అని అడుగుతాడు. వెంట పడి తనని వేధించిన రౌడీకి తనకు మధ్య గొడవ జరుగుతుండగా అనుకోకుండా కాళీ బిల్డింగ్ మీద నుంచి పడిపోయాడని విశ్వానథం పోలీసుకు చెప్తాడు. సత్య వాళ్లు ఎంపీ ఇంటికి బయల్దేరుతారు. అంతా నువ్వే చూసుకోవాలమ్మా అని మహదేవయ్య సత్యకి చెప్తాడు.


క్రిష్: ఎమ్మెల్యే అయిన తర్వాత సత్యని నీ పీఏగా పెట్టుకుంటావా ఏంటి.
మహదేవయ్య: ఏమైనా డౌటా.. తన తెలివి తేటలతో నన్ను మినిస్టర్‌ని చేస్తుంది. 


ఇక పీఏ మహదేవయ్య వాళ్ల దగ్గరకు వచ్చి ప్రెసిడెంట్ గారు మీటింగ్ పని మీద వెళ్లారని వచ్చేస్తారని మహాదేవయ్య ఫ్యామిలీని లోపలికి పిలుస్తాడు. మనల్ని పిలిచి బయటకు వెళ్లడం ఏంటని రుద్ర కోప్పడితే.. ఆయనో పెద్ద పార్టీ ప్రెసిడెంట్ అని సత్య, క్రిష్ మాట్లాడుతారు. దానికి మహదేవయ్య ఆ మాత్రం తెలివి ఉండాలని తన రాజకీయ వారసుడు చిన్నానే అని అంటాడు. రుద్ర రగిలిపోతాడు. మరోవైపు హర్షకు పోలీసులు కాల్ చేసి విశ్వనాథం లొంగిపోయాడని ఆరెస్ట్ చేశామని చెప్తాడు. హర్ష కుప్పకూలిపోతాడు. ఇంట్లో వాళ్లు అడగటంతో విషయం చెప్తాడు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్: సుమనకు ఆస్తి రాసిచ్చిన తిలోత్తమ.. ఏం ట్విస్ట్ ఇవ్వబోతుందో!