Trinayani Serial Today Episode నయని ఇంట్లో లేదు అని గట్టి నమ్మకమని తిలోత్తమ వల్లభతో చెప్తుంది. నిజం తెలిసే వరకు అఖండ స్వామిని ఇంటి నుంచి పంపేదే లేదని అంటుంది. విక్రాంత్ ల్యాప్‌టాప్‌ కోసం హడావుడిగా వెతుకుతుంటాడు. సుమన విక్రాంత్‌తో ముక్కోటి లోకి ఏదో ఆత్మ దూరిందని అందుకే వల్లభ బావగారు కొట్టారని అంటుంది. ముక్కోటిని ఇంటి నుంచి పంపేయమని సుమన అంటుంది. దానికి విక్రాంత్ వాళ్ల మేనకోడలు త్రినేత్రి వచ్చే వరకు వెళ్లరని చెప్తుంది.


నయని హాల్‌లో పడుకొని ఉంటే తిలోత్తమ, అఖండ, వల్లభలు  అక్కడికి వస్తారు. తిలోత్తమ నయనికి శ్రమ పెట్టడానికి ఇంట్లో పేపర్లు చిందర వందర పడేస్తుంది. గాయత్రీ పాప అక్కడికి రాగానే వీటిని నయని సర్దేటప్పుడు స్ఫ్రృహా కోల్పోయేలా చేస్తానని అంటుంది. గాయత్రీ పాప విని నయని కిందకి వచ్చే అమ్మ అమ్మా అని పిలుస్తుంది. అక్కడికి వెళ్లొద్దని సైగ చేస్తుంది. నయని సర్దుతున్నప్పుడు తిలోత్తమ నయని ముఖం మీద స్ప్రే వేసి కళ్లు తిరిగి పడిపోయేలా చేస్తుంది. దాంతో నయని మూర్ఛపోతుంది. అందుకే నయనిని హాల్‌లోనే పడుకోపెట్టేస్తుంది తిలోత్తమ. ఐడియా అదిరిపోయిందని వల్లభ అంటాడు. 


పడుకున్నది త్రినేత్రి అయితే స్వామి వారి పనికి అడ్డు చెప్పదని తిలోత్తమ అంటుంది. ఆత్మని రప్పించడానికి అఖండ స్వామి ఆ పడుకొని ఉన్న నయనిపై మంత్రం చెప్తుంటారు. ఇంతలో గాయత్రీ పాప అమ్మ అమ్మ అని పిలిస్తే వల్లభ వెనక్కి తిరిగి చూస్తాడు. తిలోత్తమ కూడా వెనక్కి తిరిగి చూసే సరికి అక్కడ నయని నిల్చొని ఉంటుంది. వల్లభకు కనిపించదు. తిలోత్తమ బెంబేలెత్తిపోతుంది. పిల్లని ఏందుకు అలా చూస్తున్నావ్ అని వల్లభ అడిగితే తిలోత్తమ భయపడుతూ నయని ఆత్మ వచ్చిందని తిలోత్తమ కంగారు పడుతుంది. అఖండ స్వామి కూడా చూసి నిల్చొండిపోతాడు. 


అఖండ: నేను చెప్పినట్లే మీ అనుమానాలు తీరినట్లే తను త్రినేత్రి ఇక్కడున్నది నయని. ఇది దేహం అది ఆత్మ. 
ఆత్మ: శభాష్ అఖండ స్వామి బాగానే కనిపెట్టారు. మా అత్త నన్ను చూసి చాలా రోజులు అయిందే. 
తిలోత్తమ: ఏం చేయాలి అని నా దగ్గరకు వస్తున్నావ్. రావొద్దు
నయనిఆత్మ: మీరు ఏం చేస్తే నేను ఇలా ఆత్మలా మారానో చెప్పండి. చెప్పండి అత్తయ్య నా ప్రాణం పోవడానికి మీరు ఏం చేశారు చెప్పండి.
అఖండ: నయని ఆత్మతో పాటు గాయత్రీ దేవి ఆత్మ కలిస్తే మన ఇద్దరం ఇక్కడికిక్కడే చచ్చిపోతాం. వల్లభ నయని శరీరం మీద నీళ్లు చల్లు మెలకువ వచ్చేలా చేయ్.


వెళ్లరా అని వల్లభని తిలోత్తమ నెట్టుతుంది. వల్లభ వెళ్లి గాయత్రీ పాప కాళ్ల దగ్గర పడితే పాప తన్నేస్తుంది. వల్లభ తుల్లిపోతాడు. ఇక తిలోత్తమ లేపి నీరు తీసుకురమ్మని చెప్తుంది. దాంతో నయని మీద నీరు చిలకరించగానే నయని లేస్తుంది. ఆత్మ నయనిలోకి చేరుకుంటుంది. అందరూ హాల్‌లోకి వస్తారు. నాకేమైంది అని నయని అంటే వల్లభ ఏడుస్తాడు. నయని యాక్టింగ్ చేసిందని వల్లభ అంటే నేనేం చేశాను అని అంటే నీ యాక్టింగ్ ఆపు అని తిలోత్తమ అంటుంది. నయనిని కావాలనే తాను పడుకోపట్టానని తిలోత్తమ అంటుంది. నయని ఆత్మని చూశానని చెప్తుంది.  అందరూ షాక్‌ అయిపోతారు. త్రినేత్రి కూడా చనిపోయిందని తిలోత్తమ చెప్తుంది.. బామ్మ కోప్పడుతుంది. త్రినేత్రి నిండు నూరేళ్లు ఆయష్షుతో ఉంటుందని అంటుంది. నిజమే చెప్తున్నా అని తిలోత్తమ అంటే పిచ్చా అని నయని కోప్పడుతుంది. ఇక అఖండ స్వామి నయని ఆత్మని చూశాం కదా ఇక ఏం చేయాలో చూద్దామని చెప్పి వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: అమ్మాయి గారు సీరియల్: అదిరిపోయిన ట్విస్ట్.. బంటీతోనే రాజు, రూపలు.. మందారం, రాఘవని చూసేసిన తల్లీకొడుకులు!