Brahmamudi Serial Today Episode:   ఒక ప్లాన్‌ ప్రకారం స్వప్న సీమంతం చేయాలనుకుంటుంది రుద్రాణి. సీమంతం విషయంలో కావ్యను రెచ్చగొట్టి అక్కా చెల్లెల్ల మధ్యే కాకుండా ఇంట్లో వాళ్ల ముందు కూడా కావ్యను బాడ్ చేయాలనుకుంటుంది. అందుకోసం అందరి ముందు కూర్చుని ఏవేవో ప్లాన్స్‌ వేస్తుంది. అంతా విన్న స్వప్న నా సీమంతం అంత గ్రాండ్‌ గా జరుగుతుందా..? అంటుంది. నేను చేస్తాను స్వప్న నువ్వేం వర్రీ కాకు.. మీ చెల్లి ఏమైనా అడ్డుపడుతుందని డౌటుగా ఉందా..? అని అడుగుతుంది. ఏం కావ్య నువ్వేం పలకవేంటి అంటుంది రుద్రాణి. మీ ఇష్టం ఎలాగైనా జరిపించండి అని కావ్య వెళ్లిపోతుంది. కావ్య వెనకాలే వెళ్లిన రాజ్‌ రూంలోకి వెళ్లగానే డోర్‌ వేస్తాడు.


కావ్య: మూడో కంటికి తెలియకుండా ఉండటానికి తలుపు మూస్తున్నారా..?  


రాజ్‌: కాదు మూడో చెవికి వినబడకుండా వేస్తున్నాను కానీ రా.. నీకేమైనా పిచ్చా.. మా అత్తయ్య అడిగిన దానికి తలూపావు ఏంటి.. మన శక్తికి మించిన ఖర్చు ఎలా పెట్టగలం..


కావ్య: మీ అత్తయ్యా ప్లాన్‌ మీకు అర్థం కాలేదా..? అందరి ముందు నన్ను బ్యాడ్‌ చేయాలని ప్లాన్‌ చేసింది.


రాజ్‌: అందుకని..  20 లక్షలు అవ్వొచ్చు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావు.  అలాగని ఏదో ఒకటి చేసి అంత డబ్బు ఇస్తే మా పిన్ని ఫీలవుతుంది.


కావ్య:  ఆవిడకు అంత చాన్స్‌ ఇవ్వనులేండి.. కానీ సీమంతం గ్రాండ్‌గా కాదు సింపుల్‌గా జరుగుతుంది.


రాజ్:  ఏంటో నీ ప్లాన్‌ రివర్స్‌ అయ్యి అందరూ నీ మీద దండెత్తితే నేను మాత్రం ఏమీ మాట్లాడలేను.. నన్ను మాత్రం అర్థం చేసుకో ఈ విషయంలో


అంటూ రాజ్ వెళ్లిపోతాడు.  రుద్రాణి హ్యాపీగా ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది.


రుద్రాణి: చూశావా ధాన్యలక్ష్మీ దానికి ఎంత షాక్‌ ఇచ్చానో..


ధాన్యలక్ష్మీ: షాక్ దానికే కాదు.. మాకు ఇచ్చావు. ఇంత సడెన్‌ గా నీ కోడలి మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో.. ?


రుద్రాణి:  ధాన్యలక్ష్మీ ఒకసారి నువ్వే ఆలోచించు.. నేను ఇదంతా చేస్తుంది. నా కోడలి మీద ప్రేమతోనో.. ఈ ఇంట్లో పండగ వాతావరణం కోసమో కాదు. ఆ కావ్య ఇంట్లో అందరికీ ఒక న్యాయం తన అక్కకు ఒక న్యాయం చేస్తుందా..? అంటూ మనం రివర్స్‌ లో మాట్లాడాలి.


ధాన్యలక్ష్మీ: నువ్వన్నది కరెక్టే.. కానీ కావ్య నీకన్నా తెలివైనది. సీమంతం సింపుల్‌ గా చేయాలని అంటే..


రుద్రాణి: అవును అప్పుడు కూడా సొంత అక్క సీమంతం చేయడానికి డబ్బులు పెట్టని షెల్పీస్‌ కావ్య అంటూ అబాండాలు వేసి వీలైనంత త్వరగా కావ్య చేతిలో పగ్గాలు లాగేసుకుందాం.


అంటూ తన మాటలతో మళ్లీ ధాన్యలక్ష్మీ  బ్రెయిన్‌ వాష్‌ చేస్తుంది రుద్రాణి. రుద్రాణి మాటలకు గొర్రెలా తలూపుతుంది ధాన్యలక్ష్మీ. మరోవైపు హాస్పిటల్‌ లోఉన్న కళ్యాణ్‌కు రైటర్‌ ఫోన్‌ చేసి తిడతాడు. పాట రాయమని చెప్పి ఎన్ని రోజులు అయింది. ఇంకా రాయలేదేంటి అంటూ తిట్టడంతో సారీ సార్‌ మా తాతయ్య కోమలో ఉన్నారు ఆయన దగ్గరే నేను హాస్పిటల్‌లో ఉన్నాను ఈరోజు కంప్లీట్‌ చేస్తాను అని చెప్తాడు. సరే అంటాడు లక్ష్మీకాంత్‌. తన పాట రాయడానికి అప్పుపు ఊహించుకోవాలి అనుకుంటాడు కళ్యాణ్‌.


  కనకం ఇంటికి వెళ్లిన కావ్య ఎలాగైన స్వప్న సీమంతం మన ఇంట్లో జరిగేలా నువ్వు రేపు మా ఇంటికి వచ్చి అందరినీ ఒప్పించాలని చెప్తుంది సరే అంటుంది కనకం. దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని ఉండగా రుద్రాణి, రాహుల్‌ సీమంతానికి అయ్యే ఖర్చు గురించి లెక్కలు వేస్తుంటారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.



ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!