Trinayani Today Episode ఉలూచిని ధురందర సుమనకు ఇచ్చేస్తుంది. ఇక హాసిని సుమనతో చిట్టీ నువ్వు కషాయం తాగినా అది పనిచేయదులే ఎందుకుంటే నీ ఒళ్లంతా చేదు కదా అని అంటుంది. అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. తిలోత్తమ, వల్లభలు సుమనకు బోర్డ్ మెంబర్ పదవి పోయిందని ఓదార్చుతారు. బాధపడొద్దు అని అంటారు.


సుమన: రెండు చోట్ల నా కూతురు ఎలా ఉంటుంది.
తిలోత్తమ: చాలా సింపుల్ నేను చెప్పినట్లే ఆ గారడీ పిల్లే ఇదంతా చేసి ఉంటుంది. నువ్వు ఎదగకూడదని నయనినే ఇలా చేయమని చెప్పి ఉంటుంది. ఆలోచించు..


మరోవైపు విశాలాక్షి ముఖం మీద క్లాత్ చుట్టుకొని ధ్యానం చేస్తుంటుంది. ఎద్దులయ్య, డమ్మక్కలు విసనకర్రతో విసురుతూ ఉంటారు. ధురందర అది చూసి తనని పడుకోపెట్టొచ్చు కదా ఎందుకు అలా కూర్చొపెట్టారు అంటుంది. దానికి డమ్మక్క అమ్మ ధ్యానంలో ఉంది మీరు ఇబ్బంది పెట్టుకుండా మీ పని చేసుకోండి అంటుంది. దీంతో ధురందర తనకు చిరాకు వచ్చిందని అంటుంది. ఇంతలో గురువుగారు వస్తారు. 


సుమన: పగలే కాదు రాత్రి పూట కూడా స్వాములు ఇంటికి వస్తున్నారే. 
నయని: చెల్లి ద్వంద్వ అర్థాలతో మాట్లాడి భంగపడొద్దు. 
తిలోత్తమ: ఈ టైంలో వచ్చుంటారు అంటే ముఖ్యమైన పనే అయి ఉంటుంది. 
గురువుగారు: మీరందరూ ఇంట్లో ఉండి కూడా ఇంటికి వచ్చిన అతిథిని పట్టించుకోనందువల్లే వచ్చాను. 
విక్రాంత్: గెస్ట్‌లు ఎవరు వచ్చారు స్వామి.
డమ్మక్క: ఇంకెవరు పుత్రా మేమే.
గురువుగారు: విశిష్ట అతిథిగా వచ్చి పోయేది విశాలాక్షినే కదా..
సుమన: ఏం తప్పు చేస్తుందో దొంగలా ముసుగు వేసుకుంది.  
ఎద్దులయ్య: గురువుగారు వచ్చిన పని కానీయండి.
గురువుగారు: అతిథిగా ఉన్న విశాలాక్షి బాగోగులు చూడరెందుకు అన్నాను. 
డమ్మక్క: ఈ వస్త్రం (ముఖంపై క్లాత్) తీసి చూస్తే కదా గురువుగారు వీళ్లకి తెలిసేది. 
నయని: ఏమైంది డమ్మక్క.. ఎద్దులయ్య విశాలాక్షి ముఖం మీద క్లాత్ తీస్తే పెదవులకు రక్తం అంటుకొని ఉంటుంది. అందరూ షాక్ అవుతారు. ఏమైంది అని అడుగుతారు. ఎక్కడైనా పడిపోయావా అని హాసిని అడుగుతుంది.
విశాలాక్షి: పడ్డాను. 
తిలోత్తమ: మధ్యాహ్నం ఎప్పుడో పడినట్లు ఉంది అందుకే రక్తం ఎండిపోయింది. 
హాసిని: ఎక్కడ పడ్డావో చెప్పు విశాలాక్షి..
విశాలాక్షి: కింద పడలేదు పెద్దమ్మ.. సుమన ఒడిలో పడ్డాను. 
తిలోత్తమ: నాకు అర్థమైంది.. కానీ ఇప్పుడు చెప్పను. 
గురువుగారు: పాల వల్ల వచ్చిన మరకల్ని పాలవల్లే కడగాలి.
విశాల్: పాలవల్ల మరకలు ఎలా అవుతాయి గురువుగారు.
తిలోత్తమ: అవుతాయి విశాల్.. ముందు గురువుగారు చెప్పినట్లు చేయండి.
విక్రాంత్: వదినా పాలు తీసుకురండి.
గురువుగారు: నీ భార్య తెచ్చింది కదా విక్రాంత్. 
సుమన: ఇవి ఉలూచి కోసం తెచ్చిన పాలు..
గురువుగారు: అందుకే చెప్పాను. 
విశాలాక్షి: ఆ పాలు నువ్వే అక్కడ పెట్టు సుమన ఉలూచినే వచ్చింది. 
సుమన: పాము రూపంలో ఉన్న ఉలూచి అక్కడికి వస్తుంది. వచ్చావా ఈ పాలు తాగు ఉలూచి లేదంటే ఈపాలు వేస్టే చేసేలా ఉన్నారు అని పాము ముందు పాలు పెడుతుంది.
విశాలాక్షి: రక్తపు మరకలు పోయేలా చేయు ఉలూచి.. అంటే పాము పాలను విశాలాక్షి పెదవుల మీదకు విసురుతుంది. అందరూ షాక్ అయిపోతారు.
పావనా: ఆహా దైవ సంకల్పం అంటే ఇదేన్నమాట.
గురువుగారు: అమ్మకి పాలభిషేకం అయినట్లే..
సుమన: ఉలూచి పాలు నువ్వు తాగకుండా ఎందుకు అలా వేస్తున్నావ్. 
విశాల్: విశాలాక్షి మన అతిథి అన్నారు మనం చేయాల్సిన పని ఉలూచి చేసింది సంతోషించు సుమన. 
హాసిని: విశాలాక్షి నువ్వు చిట్టీ ఒడిలో పడటం ఏంటి.
గురువుగారు: నిదానంగా మీకే అర్థమవుతుంది. రేపు జాగ్రత్తగా ఉండండి.
సుమన: వీళ్లకి చాకిరీ చేసినట్లు అయింది. 
తిలోత్తమ: సుమన విశాలాక్షి నీ ఒడిలో పడటం అంటే నీకు అర్థం కాలేదా.. ఆఫీస్‌కి ఉలూచి రూపంలో వచ్చి నీ పాలు తాగినట్లు నటించి నీ రక్తం పీల్చింది. అందుకే ఆ గారడీ పిల్ల నోటికి రక్తపు మరకలు అంటాయి. అర్థం చేసుకో.. నువ్వేం చేసుకుంటావో చేసుకో... 


సుమన ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడి పౌడర్‌కి పదివేలు ఎందుకు అంటుంది. ఇక విక్రాంత్ రావడం చూసి ఫోన్ పెట్టేస్తుంది. ఎవరితో మాట్లాడావ్ అని విక్రాంత్ అడిగితే మా అమ్మ అని చెప్తుంది. విక్రాంత్ ఫోన్ ఇవ్వమని అడిగితే ఇవ్వదు. ఇక తన అత్తయ్యకి ఫోన్ లేదు అని ఎలా మాట్లాడావని అడుగుతాడు. ఇక సుమన దగ్గర ఫోన్ లాగుకొని కాల్ చేస్తాడు. ఇక సుమన మనసులో.. పాయిజన్ పౌడర్ పంపించమన్నాను అని చెప్తే నా ప్రాణం తీసేస్తారు అని అనుకుంటుంది. విశాలాక్షి విషలాక్షి అవబోతుంది అని అనుకుంటుంది. విశాలాక్షి కోసం పాలు రెడీ చేసి అందులో విషం కలుపుతుంది. తన బిడ్డకు ఆ విషం పాలు పెట్టి ఆ నింద విశాలాక్షి మీద పెట్టేస్తానని అనుకుంటుంది. బయట విశాలాక్షి ఉంటే తనని సుమన పిలుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: రష్మిక మందన్న: రష్మికకు అరుదైన ఘనత - ఫోర్బ్స్‌ జాబితాకు ఎక్కిన 'శ్రీవల్లి'