Naga Panchami Today Episode కరాళి మహాంకాళిని దర్శనం చేసుకుంటుంది. ప్రయత్నాలు ఫలించనప్పుడు పక్కకి తప్పుకోమని కరాళికి మహాంకాళి సూచిస్తే సాధించడానికే పుట్టాను కచ్చితంగా సాధించి తీరుతానని కరాళి అంటుంది. మోక్షని ఆహుతి ఇచ్చి త్వరలోనే మీ కోరిక తీరుస్తాను అని అప్పుడే నా శక్తులు నాకు తిరిగి ప్రసాదించు అని కరాళి మహాంకాళికి చెప్తుంది.
మహాంకాళి: మోక్ష ఒంటరిగా ఉన్నప్పుడే సాధించలేకపోయావ్. ఇప్పుడు పక్కన పంచమి ఉంది. వృథా ప్రయాస తప్ప ప్రయోజనం లేదు కరాళి. శక్తుల కోసం మరో మార్గం అన్వేషించు. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న మార్గంలో నువ్వు అనుకున్న గమ్యం చేరుకోవడం కష్టం.
మేఘన: నిరాశ పరిస్తే నేను వెనక్కి తగ్గుతాను ఏమో అని పరీక్షిస్తున్నావా మహాంకాళి.
మహాంకాళి: లేదు కరాళి పంచమి కనిపించని ఓ శక్తి మోక్షని వలయంలా కాపాడుకుంటుంది. ఆ శక్తిని చేధించి మోక్షని వరపరచుకోవడం అసాధ్యం.
మేఘన: ఎవర్ని అయితే గొప్ప శక్తిగా పొగుడుతున్నావో ఆ పంచమినే ఇప్పుడు నా గుప్పెట్లో పెట్టుకున్నాను మాతా. స్వయంగా పంచమినే మా ఇద్దరికి పెళ్లి చేసి కఠిన బ్రహ్మాచారి అయిన మోక్షను నాకు అప్పగించబోతుంది. ఆ రోజే మోక్ష బలిపీఠం మీద ఉంటాడు మహాంకాళి.
మహాంకాళి: దేనికైనా ఆరంభం ముగింపు అని ఉంటాయి. నీకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాను. నీ గడువు ముగిసిపోయింది. ఇక నువ్వు మోక్షకి బలి ఇచ్చినా ఫలితం శూన్యం.
మేఘన: అన్యాయం మహాంకాళి చాలా ఘోరమైన నిర్ణయం. వెంటనే మీ మాటల్ని ఉపసంహరించండి. మళ్లీ నాకు కొత్త పరీక్ష పెట్టకండి.
మహాంకాళి: ఇక నీకు ఆ అవకాశం లేదు కరాళి. ఇక నీకు శక్తులు తెరిగి ఇవ్వను. స్వతహాగా నీకు ఉన్న మాయాజాల శక్తుల తప్ప మహాత్తర శక్తులు నీకు రావు.
మేఘన: అమ్మా సంవత్సరాలుగా నిన్ను నమ్ముకున్నందుకు నీ భక్తురాలిని నట్టేట ముంచడం సరికాదు.
పంచమి సీక్రెట్‌గా బయటకు వెళ్లి ఫణేంద్ర కోసం వెతుకుతుంది. ఇక ఓ చోట ఫణేంద్ర పాము పంచమి దగ్గరకు వస్తుంది. పంచమి నీ కోసమే వెతుకుతున్నాను అని వెంటనే నాతో వచ్చి మోక్షని బతికించమని పంచమి ఫణేంద్రని వేడుకుంటుంది.
పంచమి: అనుకోకుండా చిన్న అపశ్రుతి జరిగింది ఫణేంద్ర నా ఎంగిలి తగిలి మోక్షాబాబు పెదాలు విషపూరితం అయ్యాయి. శరీరం అంతా విషం అవుతుంది. మోక్షాబాబుని నువ్వే కాపాడాలి ఫణేంద్ర.
ఫణేంద్ర: నేనెందుకు కాపాడాలి పంచమి. మోక్ష ఏమైపోతే నాకేంటి. నేను కాపాడను పంచమి.
పంచమి: అలా అనకు ఫణేంద్ర. కాపాడే శక్తి నీకే ఉంది. నా కోసం అయినా మోక్షాబాబుని కాపాడు.
ఫణేంద్ర: మోక్షా ప్రాణాలతో ఉంటే నాకేం వస్తుంది. మోక్ష చనిపోవడమే నాకు మంచిది.
పంచమి: ఫణేంద్ర..
ఫణేంద్ర: నీ స్వార్థం నువ్వు చూసుకున్నప్పుడు నా స్వార్థం కూడా నేను చూసుకోవాలి కదా పంచమి. మోక్షప్రాణాలతో ఉన్నంత వరకు నాతో నువ్వు రావు. అదే తను లేకపోతే..
పంచమి: మాట్లాడకు ఫణేంద్ర. నీ విషపు బుద్ధి చూపిస్తున్నావ్.. నీ బుద్ధి చూశాక నాకు నాగలోకం మీద అసహ్యం వేస్తుంది. నీ లాంటి నీచులు ఉన్న నాగలోకంలో పాదం మోపడం కూడా మహాపాపం.
ఫణేంద్ర: నా మాటలను నాగలోకాని ఆపాదించకు. నువ్వు నాతో రావడానికి పెడుతున్న ఆంక్షలు భరించలేక కోపంతో అలా మాట్లాడాను. పంచమి, ఫణేంద్రలను చిత్ర చూస్తుంది.
పంచమి: మోక్షచనిపోతే నేను తనతో పాటు చనిపోతా కానీ నీతో రాను ఫణేంద్ర. మోక్ష క్షేమంగా ఉంటే నీతో నేను వస్తా అని చెప్పాను. నా మాట మీద నీకు నమ్మకం ఉంటేనే వచ్చి మోక్షాబాబుని కాపాడు. నీకు దండం పెడతా కాపాడు ఫణేంద్ర.
ఫణేంద్ర పాములా మారి పంచమి గదికి వస్తాడు. ఇక చిత్ర అందర్ని పిలిచి ఫణేంద్రని చూపిస్తాను అని అంటుంది. మరోవైపు పంచమి మోక్షని కాపాడమని ఫణేంద్రని వేడుకుంటుంది దీంతో ఫణేంద్ర కళ్లతో మోక్ష విషం లాగేస్తాడు. మోక్ష ప్రాణాపాయం నుంచి బయట పడతాడు. మరోవైపు అందరూ మోక్ష గది దగ్గరకు వస్తారు. చిత్ర డోర్ కొడుతుంది. పంచమి డోర్ తీస్తుంది.
పంచమి: ఏయ్ ఏం చేస్తున్నారు మీరు. అయినా మీ అందరికి ఇక్కడేం పని.
చిత్ర: ఏయ్.
పంచమి: ఏయ్ అరవకు మోక్షాబాబు నిద్రపోతున్నారు.
చిత్ర: ఏయ్ నిజం చెప్పు నువ్వు బయట నీ బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడావ్ కదా..
పంచమి: నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్లలేదే.. నువ్వు నిజంగా నన్ను చూస్తే అప్పుడే అడగాలి కదా..
జ్వాల: పంచమి చిత్రను అమాయకురాలిని చేయకు. నీ ఫ్రెండ్ ఇక్కడే పాము రూపంలో ఉంటున్నాడు. మీరిద్దరూ రోజు కలుసుకుంటున్నారు.
శబరి: మీకేం పోయేకాలం వచ్చిందే అంత పెద్ద నింద మోపుతున్నారు.
చిత్ర: బామ్మ మీకు తెలీదు. అంటూ ఇళ్లంతా వెతుకుతుంది. ఇక మోక్ష ఎందుకు పడుకున్నాడు అని జ్వాల అడుగుతుంది. దీంతో బాయ్‌ప్రెండ్‌ని కలవడానికి అని చిత్ర అంటుంది. దీంతో పంచమి చంపేస్తా అంటుంది. మరోవైపు మోక్ష లేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.