Rashmika Mandanna: గతేడాది నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు బాగా కలిసోచ్చిందనే చెప్పాలి. పుష్ఫ 1 తర్వాత కాస్తా డీలా పడ్డ ఆమె కెరీర్ యానిమల్‌తో మళ్లీ పుంజుకుంది. యానిమల్ బ్లాక్‌బస్టర్‌తో వరుస ఆఫర్స్ అందుకుంది. గతేడాది యానిమల్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఈ సక్సెస్‌ని ఆస్వాదిస్తున్న రష్మికకు దాన్ని మరింత రెట్టింపు చేసే న్యూస్ అందింది. ఇప్పటికే నేషనల్ క్రష్‌గా రికార్డు ఎక్కిన ఆమె తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ఫోర్బ్స్ అండర్ 30 జాబితాను విడుదల చేసింది.
ఇందులో రష్మికకు స్థానం దక్కడం విశేషం. కాగా 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 30 మంది “ట్రయల్ బ్లేజర్స్ అండ్ డిస్ట్రప్టర్స్”ను ఎంపిక చేసింది. ఈ ఏడాది ఎంటర్‌టైన్‌మెంట్ స్పేస్ నుంచి ముగ్గురు నటీమణులు రాధికా మదన్, రష్మిక మందన్న, అదితి సైగల్ అలియాస్ డాట్‌లు ఉన్నారు. కాగా ప్రతి సంవత్సరం పలు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ముగ్గురు వ్యక్తుల జాబితాను ఫోర్భ్స్ విడుదల చేస్తుంది. ఇందులో ౩౦ ఏళ్లలోపు వారిని మాత్రమే తీసుకుంటారు. ఇక ఈ ఏడాది గానూ 27 ఏళ్ల రష్మికకు ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. రష్మిక మందన్నా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాదిలోనే ఆమె మూడు సినిమాలు విడుదల కాగా అవన్ని మంచి విజయం సాధించడం విశేషం.
Also Read: 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఇంట త్రీవ విషాదం - అనారోగ్యంతో ఆయన భార్య మృతి
మొదట, ఆమె తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కలిసి వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచిన యాక్షన్ చిత్రం వారిసులో నటించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.300 కోట్లు వసూలు చేసింది. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా సరసన స్పై థ్రిల్లర్ మిషన్ మజ్నులో నటించింది. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే విడుదలైంది. మూడోది, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ దర్శకత్వంలో రణ్‌బిర్ కపూర్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ అండ్ ఫ్యామిలీ డ్రామా యానిమల్‌లో హీరోయిన్ నటించింది. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో గీతాంజలిగా ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇక 2024లోనూ రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె 'పుష్ప ది రూల్', 'రెయిన్‌బో', 'ది గర్ల్‌ఫ్రెండ్', 'చావా' వంటి చిత్రాలతో బిజీగా ఉంది.
రాధికా మదన్
రాధికా మదన్ 28 ఏళ్ల నటి. హిందీ చిత్రాలలో నటిస్తోంది. గత ఏడాది ఆమె మూడు సినిమాల్లో నటించింది. ఆమె ఆస్మాన్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన క్రైమ్ డ్రామా కుట్టేలో సహాయక పాత్రతో 2023 ఏడాదిని ప్రారంభించింది. ఆ తర్వాత శుభం యోగి దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా కచ్చే లింబూని నేరుగా జియోసినిమాలో విడుదల చేశారు.
అదితి సైగల్ అలియాస్ డాట్
25 ఏళ్ల అదితి ఈ ముగ్గురిలో చిన్న వయసున్న ఆర్టిస్ట్. ఆమె ఒక గాయని, సంగీతకారిణి. ఆమె స్టేజ్ పేరు డాట్. ఆర్చీ కామిక్స్ మొదటి ఫీచర్ అనుసరణ అయిన జోయా అక్తర్ డైరెక్ట్ చేసిన పీరియడ్ కమింగ్-ఆఫ్ ఏజ్ మ్యూజికల్ ది ఆర్చీస్ లో ఆమె ఎథెల్ పాత్రలో నటించింది. ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో విడుదలైంది.