KK Senthil Kumar Wife Roohi Died: టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి ‘రూహీ’ కన్నుమూశారు. యోగా టీచర్‌గా పని చేస్తున్న ఆమె అనారోగ్యంతో నేడు తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో సెంథిల్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మరణవార్త చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. రూహీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సెంథిల్‌ కుటుంబానికి సానుభూతిని తెలుపుతున్నారు. రూహి మరణవార్త తెలిసి ఇండస్ట్రీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.


మరికొందరు నేరుగా ఇంటికి వెళ్లి సెంథిల్‌ను పరామర్శిస్తున్నారు. కాగా రేపు( శుక్రవారం) ఉదయం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారని తెలుస్తోంది.కాగా ఆయన భార్య రూహి ఆరోగ్యంలో కరోనా కారణంగా దెబ్బతింది. ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో ఇటీవల సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చెర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ఈ రోజు మధ్యాహ్నం మరణించారు. కాగా మల్టీపుల్ ఆర్గాన్స్ పనిచేయకపోవడం వల్లే రూహీ మృతి చెందినట్టు వైద్యులు ధ్రవికరించారు.


Also Read: సూపర్‌ స్టార్‌ కొడుకైనా.. నటీనటులకు టీ పెట్టడం, ప్రొడక్షన్‌ బాయ్‌గా కష్టాలు తప్పలేదు - ఈ హీరో ఎవరో తెలుసా?


వృత్తిరీత్యా యోగా శిక్షకురాలైన ఆమె హీరోయిన్ అనుష్క శెట్టి దగ్గర చాలా కాలం పాటు పని చేశారు. సినిమాటోగ్రాఫర్‌గా సెంథిల్‌ల్‌కు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు సెంథిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో ఆయన కుటుంబానికి సెంథిల్‌ చాలా దగ్గర అయ్యారు. దాదాపు రాజమౌళి అన్ని చిత్రాలకు సినిమాటో గ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ పని చేశారు.