Samantha Shared Health Podcast Video: స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటిస్‌ చికిత్స కోసమే ఈ నిర్ణయం తీసుకున్న సామ్‌ సిటాడెల్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌ షూటింగ్ పూర్తి కాగానే రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. ఏడాది పాటు ఎలాంటి ప్రాజెక్ట్‌ చేయనని చెప్పింది. ఆ వెంటనే విదేశాలకు వెళ్లిన సమంత ఎప్పటికప్పుడు తన దినచర్యను పంచుకుంది. లేచిన దగ్గరి నుంచి సాయంత్రం వరకు ప్రతి విషయాన్ని షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ముచ్చట్లాడింది.


అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా హాట్‌ హాట్‌గా ఫొటోలకు ఫోజులు ఇచ్చేది. వాటిని తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. ప్రస్తుతం రెస్ట్‌ మోడ్‌లో ఉన్న సామ్‌ నిన్న వాలంటైన్స్‌ డే సందర్భంగా ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. మయోసైటిస్‌తో ఇబ్బంది పడ్డ సామ్‌ తనలా ఎవరు ఇబ్బంది పడకుడదని ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యంపై అవగాన కల్పించేందుకు ఆమె పోడ్‌కాస్ట్‌ ప్రారంభించబోతున్నట్టు రీసెంట్‌గా సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా సామ్‌ ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసింది.


Also Read: సూపర్‌ స్టార్‌ కొడుకైనా.. నటీనటులకు టీ పెట్టడం, ప్రొడక్షన్‌ బాయ్‌గా కష్టాలు తప్పలేదు - ఈ హీరో ఎవరో తెలుసా?


ఇందులో తాను టేక్‌ 20 పేరుతో పాడ్‌క్యాస్ట్‌ను చానల్‌ ప్రారంభించినట్టు వెల్లడించింది. ఇక ఈ వీడియోలో సామ్‌ మాట్లాడుతూ.. ఇందులో కేవలం హెల్త్‌ గురించిన విషయాలన మాత్రమే షేర్‌ చేస్తానంది. ఇక ఈ మూడేళ్లుగా మయోసైటిస్‌ వల్ల తాను అనుభవించిన బాధ, దానిని ఆమె ఎలా అదిగమించింది, మయోసైటిస్‌ ఎలా పోరాడిందనే విషయాలను ఈ పాడ్‌కాస్ట్‌ ద్వారా పంచుకోనుంది. ఈ టేక్‌ 20లో హై క్వాలిటీ వెల్‌నెస్‌ కంటెంట్‌ ఉంటుందని, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్‌ చేసినవి, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు నుంచి తీసుకున్న సలహాలనే ఇందులో షేర్‌ చేయబోతున్నట్టు తెలిపింది.






ఇది ప్రతి ఒక్కరి జీవితాలను మార్చే విధంగా ఉండాలని తాను ఆశిస్తున్నానంది. తాజాగా ప్రోమో రిలీజ్‌ చేసిన సామ్‌ ఫుల్‌ వీడియోను త్వరలోనే మీ ముందు ఉంచుతానని పేర్కొంది. కాగా ఈ మధ్య కాలంలో పాడ్‌ కాస్ట్‌ ప్రోగ్రామ్స్‌ ఆదరణ పెరిగింది. ఈ పాడ్‌కాస్ట్‌లు రెడియో ప్రసారాల మాదిరిగానే ఉంటాయి. ఇది మీ ఫోన్‌, కంప్యూటర్లో వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా ఆడియో, వీడియోను డౌన్‌లోడ్‌ చేసుకోవచచు కేవలం దాన్ని సబ్‌స్కైబ్‌ చేసుకుంటే చాలు ఎప్పటికప్పుడ అప్‌డేట్స్‌ మీ ఫోన్‌ లేదా కంప్యూటర్‌కు వచ్చేస్తాయి. కాగా సమంత ప్రస్తుతం సిటాడెల్‌ ఇండియా వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసిన ఆమె పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో బిజీగా ఉంది. త్వరలో వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ కానున్న నేపథ్యంలో టీంతో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది.