Godzilla x Kong: The New Empire Trailer: హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అది కూడా ఫిక్షనల్ క్యారెక్టర్లతో తెరకెక్కించే యాక్షన్ థ్రిల్లర్స్ అంటే ఇష్టపడే తెలుగు ప్రేక్షకులు కూడా చాలామంది ఉన్నారు. అలా విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న మాన్‌స్టర్ సినిమాల్లో ‘గాడ్జిల్లా x కాంగ్’ కూడా ఒకటి. ఇప్పటికే ఈ మాన్‌స్టర్ యూనివర్స్ నుండి నాలుగు సినిమాలు రాగా.. తరువాతి చిత్రం ఎప్పుడా అని ప్రేక్షకులను ఎదురుచూశారు. తాజాగా ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’కు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. మాన్‌స్టర్ యూనివర్స్ నుండి ఫ్యాన్స్ ఏం ఆశిస్తారో.. ఈ ట్రైలర్ అచ్చం అలాగే ఉందని పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.
సీక్వెల్ వచ్చేస్తోంది..
తాజాగా 3 నిమిషాల నిడివి గల ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021లో విడుదలయిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. మూడేళ్ల నుండి ఈ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొదటి భాగంతో పోలిస్తే.. ఈ సీక్వెల్‌కు దర్శకుడు ఆడమ్ విన్‌గార్డ్ మరికొన్ని కొత్త మెరుగులు దిద్దాడు. ఇక ఈ ట్రైలర్‌లో గడ్జిల్లా, కాంగ్‌లతో పాటు కొందరు నటీనటులు కూడా కనిపించారు. ముఖ్యంగా ఇందులో డీవ్ స్టీవెన్స్ హైలెట్ అయ్యాడు. తనతో పాటు రెబెక్కా హాల్, బ్రయన్ టైరీ హెన్రీ, కెయిలీ హాటిల్ కూడా ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ట్రైలర్‌లో కనిపించారు.
ప్రతీ భాషలో హిట్..
వార్నర్ బ్రోస్ నిర్మిస్తున్న ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం మార్చిలో విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే గాడ్జిల్లా, కాంగ్ అనే రెండు ఫిక్షనల్ పాత్రలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. హీరో ఎవరు, విలన్ ఎవరు అనే చర్చను మొదలుపెడితే కొందరు గాడ్జిల్లాకు సపోర్ట్ చేస్తే.. కొందరు కాంగ్‌కు సపోర్ట్‌గా నిలబడతారు. అందుకే సోషల్ మీడియాలో టీమ్ గాడ్జిల్లా వర్సెస్ టీమ్ కాంగ్ అంటూ డిస్కషన్స్ కూడా నడుస్తుంటాయి. ఈ ఫ్రాంచైజ్‌లోని మొదటి భాగం అయిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ కేవలం ఇంగ్లీష్‌లోనే కాదు.. విడుదలయిన ప్రతీ భాషలో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ మూవీ కూడా అదే రేంజ్‌లో విజయం సాధిస్తుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు.
మరో మాన్‌స్టర్..
ఇప్పటికే ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ నుండి ఒక ట్రైలర్ విడుదలయ్యింది. కానీ అందులో రివీల్ చేయని కొన్ని విషయాలను తాజాగా విడుదలయిన ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ రెండో ట్రైలర్‌లో రివీల్ చేశారు మేకర్స్. మార్చి 29న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’లో గార్జిల్లాకు, కాంగ్‌కు మధ్య యుద్ధం జరగగా.. ఈసారి ఈ రెండు మాన్‌స్టర్స్ కలిసి మరో మాన్‌స్టర్‌పై యుద్ధం చేయనున్నట్టుగా ట్రైలర్‌లో చూపించారు. దాదాపు ప్రతీ హాలీవుడ్ సినిమాలాగానే ఈ మూవీ విజువల్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. గాడ్జిల్లా, కాంగ్ మధ్య జరిగే ఫైట్ సీన్స్ విజువల్‌గా మాత్రమే కాకుండా ఫన్నీగా కూడా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనున్నాయని అర్థమవుతోంది.
Also Read: ‘పోచర్’ ట్రైలర్ - ఇండియాలో జరిగిన అతిపెద్ద క్రైమ్ కథ ఇది