Trinayani Serial Today Episode పోలీస్ చంద్రశేఖర్ విశాల్ ఇంటికి వచ్చి త్రినేత్రి వేరు నయని వేరు అని చెప్తాడు. విశాల్, హాసిని తప్ప మిగతా అందరూ తమకు అలానే అనుమానం ఉందని అంటారు. ఇక విక్రాంత్ అయితే ఇన్‌స్పెక్టర్ చెప్తే కచ్చితంగా నమ్మాలని అంటాడు. తను నా భార్య నయనినే అని విశాల్ అంటే దానికి త్రినేత్రి మనకు ఇంకా పెళ్లి కాలేదు కదా బాబుగారు అని అంటుంది.  


విశాల్: నయని నువ్వు ఊరుకో.
వల్లభ: ఏంటి బ్రదర్ నువ్వు కవర్ చేస్తున్నావ్ నీ భార్యలా ఉంది ఎవరైతే ఏంటి నీ పిల్లలకు తల్లిని చేయొచ్చని అనుకుంటున్నావా.
విశాల్: జస్ట్ షట్అప్ బ్రదర్. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతుంది మీరు. నయని తలకు గాయం అయి 3 రోజుల నుంచి అలా మాట్లాడుతుందని మీకు తెలుసు తెలుసు కదా. తను నయని అని గుర్తొచ్చినప్పుడు మీ అనుమానాలు అన్నీ పటాపంచెలు చేసింది కదా. 
హాసిని: విశాల్ ఫోన్ అన్ లాక్ చేసింది. పిల్లల డేట్ ఆఫ్ భర్త్ చెప్పింది. ఇంకా ఎందుకు చెల్లిని అనుమానిస్తారు. 
దురంధర: ఓ పోలీసాయన ఈ సమస్య పరిష్కరించి వెళ్లండి.
చంద్రశేఖర్: నేను ఒక్కడినే వెళ్లడం కాదు త్రినేత్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్తా. నేను తనని గెస్ చేసి ఎంక్వైరీ కోసం తనని తీసుకెళ్లడం లేదు నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అని త్రినేత్రి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో చూపిస్తాడు.
త్రినేత్రి: అది జాతరప్పుడు దిగిన ఫొటో. దేవీపురంలో అమ్మవారికి ఆషాడంలో జాతర జరుగుతుంది అప్పుడు బామ్మ కోరికతో దిగాను.
విక్రాంత్: బామ్మ అనింది విన్నారా.
చంద్రశేఖర్: త్రినేత్రి బామ్మ రత్నాంబ.
త్రినేత్రి: మనసులో ఇన్ని రోజులు లేనిది నాకు ఇప్పుడు బామ్మ గుర్తొస్తుందేంటి. బామ్మని వదిలి ఇక్కడికెందుకు వచ్చాను ఎలా వచ్చాను. ఏమైంది నాకు. బాబుగారు ఎందుకు అంత విచారంగా చూస్తున్నారు. 
చంద్రశేఖర్: నేత్రి నువ్వు మాట్లాడాలి లేదంటే నా పద్ధతిలో విచారించాలి.
విక్రాంత్: తన బామ్మ రత్నాంబ అని పోలీస్ చెప్పినా ఇంకా ఆలోచిస్తావేంటి బ్రో. 
చంద్రశేఖర్: మేనమామ పేరు ముక్కోటి ఇప్పుడైనా గుర్తొచ్చిందా త్రినేత్రి.
త్రినేత్రి: మనసులో ముక్కోటి మామ గుర్తొస్తుంది. వైకుంఠం అత్త కూడా గుర్తొస్తుంది. నేను ఎందుకు వాళ్లని మర్చిపోయాను. ప్రసాదం తిన్న తర్వాత ఇంకేదో జరిగింది. విశాల్ బాబుగారు బాధగా ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. బామ్మ వాళ్లు గుర్తొచ్చారని చెప్పాలా వద్దా.
విశాల్: నేను నమ్మలేకపోతున్నా.
తిలోత్తమ: సారీ విశాల్ నీ నమ్మకాలు ఒమ్ముచేసుకో. త్రినేత్రిని తీసుకెళ్లండి.


పోలీస్ త్రినేత్రిని తనతో రమ్మని చెప్తాడు. హాసిని తోడుగా వస్తానని అంటుంది. త్రినేత్రితో పాటు హాసిని వెళ్తుంది. ఇంతలో గాయత్రీ పాప వచ్చి తన చేతిని త్రినేత్రి చేతికి తాకిస్తుంది. దాంతో త్రినేత్రికి తాను నయని అని గుర్తొస్తుంది. దాంతో ఒక్కసారిగా నయని పోలీసన్న అని మాట్లాడుతుంది. చంద్రశేఖర్‌తో పాటు అందరూ షాక్ అయిపోతారు. నయని తాను త్రినేత్రి కాదని రత్నాంబ మనవరాలిని కాదని శంకరశాస్త్రి గారి మనవరాలిని అంటుంది. విశాల్, హాసినిలు తాను నయని అని అంటుంది. నయని ఆ బామ్మకి పిచ్చి అని నయని చెప్తుంది.


గతంలో బామ్మ ముక్కోటి, వైకుంఠం బామ్మకి పిచ్చి అని చెప్పడం పోలీస్ గుర్తు చేసుకుంటాడు. ఇక ఆ బామ్మ మనవరాలి పేరు త్రినేత్రి అని నయని అంటుంది. ఇక పోలీస్ కూడా త్రినేత్రి వేరు నయని వేరని నమ్ముతున్నానని అంటాడు. కొత్త అక్కే పాత అక్క అని మేం నమ్మాలి అంటే సాక్ష్యాలు చూపించాలి అని సుమన అంటుంది. నయని తాను నయని అని నిరూపించుకుంటానని అంటుంది. అందుకు నయని తిలోత్తమని కళ్లు మూసుకోమని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచమని అంటుంది. ఇక గాయత్రీ పాపతో షేక్ హ్యాండ్ ఇప్పిస్తుంది. దాంతో తిలోత్తమ చేయి మండిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నకి యాక్సిడెంట్.. కండీషన్ సీరియస్.. శౌర్య పరిస్థితి అంతే!