Trinayani Serial Today Episode అందరూ ఉండగానే దురంధర తమ గదికి తాళం వేస్తుంది. ఇక ఇళ్లు శుభ్రం చేయిస్తారు తాళం నయనికి ఇవ్వమని విశాల్ దురంధరకు చెప్తాడు. దానికి దురంధర షాక్ అయిపోయి తాళాలా అని నోరెళ్లబెడుతుంది. ఇక పావనా మూర్తి ఇస్తాంలే అని చెప్పి గదిలోకి వెళ్లిపోతారు. ఇక అందరూ ఎవరి గదిలోకి వాళ్లు వెళ్లిపోతారు. ఇక సుమన ఆలోచిస్తూ ఉంటే విక్రాంత్ వెళ్లి ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. దానికి సుమన గదిలో నుంచి రాగానే తాళం ఎందుకు వేశారని అడుగుతుంది.
విక్రాంత్ సుమనతో వాళ్ల ఇష్టం నీకెందుకు అని అడుగుతాడు. ఏమైనా తినాలి అనిపించి అలా సీక్రెట్‌గా తినొచ్చు లేదంటే ఆయనకు ఎవరికీ తెలీకుండా మందు తాగుతున్నారేమో అని అంటాడు. తన భర్తకి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉండదని సుమన అనుకుంటుంది. ఇక వల్లభ తిలోత్తమతో దురంధర పిన్ని వాళ్ల గది దగ్గర ఏవో గుసగుసలు వినిపిస్తున్నాయని అంటాడు. దాంతో తిలోత్తమ వేరే ఎవరైనా వచ్చేరేమో అని తిలోత్తమ అంటుంది. అప్పుడే నయని ఎంట్రీ ఇచ్చి ఈ టైంలో ఎవరైనా వచ్చారని అన్నారని వాళ్లకి తెలిస్తే ఉతికారేస్తారని అంటుంది.
తిలోత్తమ: నీ కూతురు గాయత్రీ నీ చీర పట్టుకొని వెళ్లి వాళ్ల తలుపు సందు నుంచి లోపలికి నెట్టే ప్రయత్నం చేసింది అంటే ఆ పని వెనక ఏదో ప్లాన్ ఉంటుందని నేను ఊహించుకోగలను నయని.
నయని: మనసులో దుర్భుద్ధి మాత్రమే లేదు అత్తయ్యకి చావు తెలివి తేటలు బాగానే ఉన్నాయి బాగానే ఆలోచిస్తుంది.
వల్లభ: ఆడౌట్‌తోనే నేను ఆ గది దగ్గర వెళ్లి చూసి వచ్చా
నయని: ఇంత ఆలోచించే బదులు వెళ్లి వాళ్ల గదిలోకే వెళ్చొచ్చు కదా. నేను మీకు రెండు పనులు చెప్పాలి అని వచ్చా. పొద్దున్న లేచి నేనేం పని చేస్తానా అని చూడకుండా నాకు సాయం చేస్తే మంచిది. కానీ నేనే ఏ చెక్కు మీద సంతకం పెట్టానో ఏ ఫైల్ పంపించానో చూసి టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకు ప్రయాస పడతారు. నేను నయని కాదని మీరు రుజువు చేసేలోపే నేను మళ్లీ నెల తప్పితే అప్పుడు మీరు ఏం చేయలేరు కదా.
వల్లభ: అర్థం కాలేదు.
నయని: మీ అమ్మకి బాగా అర్థమైయ్యుంటుంది. ఎందుకంటే తను లేడీ పైగా కిలేడీ.
తిలోత్తమ: నన్ను మించిన దానివి నువ్వు ఆ విషయం మిగతా వాళ్లకి తెలీదు అంటే చూస్తాను నీ తెలివి తేటలు ఎంతవరకు పని చేస్తాయో ఎక్కడో ఒక దగ్గర నువ్వు నాకు దొరక్కపోవా అప్పుడు చెప్తా
నయని: ఆల్‌ది బెస్ట్ గుడ్ నైట్.
వల్లభ: మమ్మీ ఆ నెల తప్పే పనేంటో చెప్పవా.
తిలోత్తమ: ఆ మాటలోనే ఉందిరా తను నయని కాదని. మనం తను నయని కాదని నిరూపించేలోపే తను విశాల్‌లో కలిసిపోయి అధికారకంగా ఆస్తుల్లో కూడా భాగస్వామి అవుతుంది.
ఉదయం పావనా మూర్తి పిల్లల్ని ఆడిపిస్తాడు. ఇక దురంధర ఫోన్ చూస్తుంటే నయని ఫోన్ చూడొద్దని చెప్తుంది. ఇక అందరూ హాల్‌లో మాట్లాడుతూ ఉండగా సుమన డబ్బు ఇవ్వడం లేదని అక్క నన్ను సొంత చెల్లిలా చూడటం లేదని అంటుంది. ఇంతలో సుమన పేరు మీద పోస్ట్ వస్తుంది. కేర్ ఆఫ్ విశాల్ అని వస్తుంది. అది తిలోత్తమ తీసుకొని చదువుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిందని చెప్తంది. ఎవరి పోతారని ఇన్సూరెన్స్ చేయించారని అందరూ అడిగితే నయని పోతుందని వచ్చిందని అంటుంది. ఏదైనా ప్రమాదంలో గాయాల పాలైతే 5 కోట్లు, చనిపోతే 25 కోట్లు ఇన్సూరెన్స్ చేయించి ఆ డబ్బు ఉలూచి పేరు మీద వచ్చేలా నామినీ పెడుతుంది. దానికి సుమన మా అక్క నామినీ పెట్టింది కానీ ఇంకా చనిపోలేదు కదా మా అక్క పోతే కదా ఆ డబ్బు వస్తుందని అంటుంది. అందరూ సుమన మాటలకు నోరెళ్ల బెడతారు. విక్రాంత్ సుమనను తిడతాడు. పర్లేదులే అని నయని అంటే దానికి విక్రాంత్ మీరు చనిపోకుండానే మాటలతో చంపేస్తుందని అంటాడు. దానికి తిలోత్తమ నయని ఎక్కడ బతికుందిరా అని అడుగుతుంది.అందరూ షాక్ అయిపోతారు.
తిలోత్తమ: నయని ఇన్సూరెన్స్ చేసింది నాన్న కానీ తన పరిస్థితి ఇలా ఉందని అప్లై చేసింది ఎవరు. నయనితో సహా అందరూ ఆలోచనలో పడతారు.
విక్రాంత్: ఎవరమ్మా అని అడగగానే తిలోత్తమ లాగి పెట్టి కొడుతుంది.
తిలోత్తమ: వీడే అప్లై చేసి మళ్లీ ఎవరు అని అడిగితే నాకు చెత్తగా అనిపించింది వల్లభ. వీడికి విషయం బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ లెటర్ రావడానికి కారణం వీడే కాబట్టి.
నయని: నాకు ఏమైనా జరిగితే ఉలూచి నామనీ అని విక్రాంత్ బాబు గుర్తు చేసుంటారు. అందులో తప్పేముంది.
తిలోత్తమ: నయనికి యాక్సిడెంట్ అయిన వెంటనే నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీకి నువ్వు అప్లై చేశావ్ అందులో మా వదిన కోమాలో ఉందని రాశావు. రెండు రోజుల్లోనే నయని ఇంటికి వచ్చింది అప్పుడే అంతకు ముందే అప్లై చేశాడంటే సరే అనుకోవచ్చు కానీ వీడు నిన్ను ఉదయం అప్లై చేశాడు.
పావనా: నిన్న ఎందుకు పంపావ్ అల్లుడు.
దురంధర: అలా ఎలా చేస్తావ్ విక్కీ
తిలోత్తమ: మా వదిన ఇంకా కోమాలో ఉందని మీరు 5 కోట్లు అయినా ఉలూచికి ఇవ్వాలని కోరాడు.
విశాల్: విక్రాంత్ నయని బాగుంటే తనకి బాలేదని ఎలా రాస్తావురా.
విక్రాంత్: సారీ బ్రో.
వల్లభ: సారీ చెప్తే క్షమిస్తారా బతికుండగానే నయని మరదల్ని చంపేశావ్ కదరా. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: భార్య, మామల్ని దారుణంగా అపార్థం చేసుకున్న రాజు.. తండ్రిని చేరిన పసికందు!