Trinayani Serial Today Episode సుమన విశాల్‌కి తేలు కుట్టిన చోట తవ్వకాలు చేయాలని చెప్తే అందరూ ఆశ్చర్యపోతారు. తిలోత్తమ వల్లభతో మనం చేయాలి అనుకున్న పని సుమన చేస్తానంటోందని చెప్తుంది. అందరూ ఇప్పుడొద్దని అంటే సుమన కచ్చితంగా తవ్వాలని చాలా విలువైనదేదో ఉందని చెప్తుంది. ఎవరూ తన మాట వినడం లేదని పెద్దబొట్టమ్మ వచ్చి చెప్తా అంది ఇంకా రాలేదని సుమన అనుకుంటుంది.
హాసిని: విశాల్‌కి మంచి చెడు జరిగిన చోట మళ్లీ వెళ్లి తవ్వుకోవడం అవసరమా
తిలోత్తమ: ఒకరికి చెడు జరిగిందని అందరికీ అలా జరుగుతుందని అనుకోవడం కరెక్టేనా.
దురంధర: ఇప్పుడు తవ్వకుండా ఉంటే నష్టం ఏం లేదు కదా.
వల్లభ: లాభం పోతుంది కదా. అక్కడేమైనా నిధి, నిక్షేపాలు ఉన్నాయేమో.
పెద్దబొట్టమ్మ: నిధి ఉందో అక్కడికి వెళ్లి తవ్వాలని విధిలో రాసుందేమో ఎవరికీ తెలుసు. మీ మాటలు అక్కడి వరకు వినిపిస్తున్నాయి.
సుమన: ఇంకీ ఏమంటారు తవ్వుతారా లేదా
విక్రాంత్: అక్కడేం లేకపోతే ఆ గోతిలోనే నిన్ను పాతేస్తాం.
వల్లభ: పెద్ద బొట్టమ్మ కూడా సుమనకు వత్తాసు పలుకుతుంది అంటే ఏదో విషయం ఉంటుంది.
సుమన: అక్క ఇంకేం ఆలోచించకు బావ గారికి తేలు కుట్టిన చోటు తవ్వితే నిధి దొరక్కపోయినా బావగారి గాయానికి మందు దొరుకుతుందేమో.
నయని: తవ్వుదాం. నా భర్తకి చెడు జరిగిన చోటే మంచి జరుగుతుందని నమ్ముతున్నా.
తిలోత్తమ: మనసులో నీ నమ్మకమే మాకు ముఖ్యం నయని.
పెద్దబొట్టమ్మ: మనసులో అది బయట పడితే మాకు మణి మార్గం బోధపడుతుంది నయని.
సుమన: మనసులో నన్ను శ్రీమంతురాలిని నువ్వే చేయబోతున్నావ్ అక్క. చూద్దాం ఏం జరుగుతుందో
అందరూ విశాల్‌కి తేలు కుట్టిన చోటుకి వెళ్తారు. ఇక సుమనకు నువ్వే చెప్పావ్ కదా అని పెద్దబొట్టమ్మని తిలోత్తమ అడుగుతుంది. ఇక పెద్దబొట్టమ్మ ఆ నిధి కోసం ఆరుగురు వెయిట్ చేస్తున్నారని చెప్తుంది. తిలోత్తమ పెద్దబొట్టమ్మతో ఇప్పుడు కిక్ వస్తుందని అంటుంది. అందరూ ఆ చోటుకి వెళ్లి తవ్వడం ప్రారంభిస్తారు. సుమన పెద్ద బొట్టమ్మ ఒకే చోటు చూపించి అక్కడే తవ్వమంటారు. విశాల్ సాయం చేస్తాను అంటే వద్దని నయని అంటుంది. విక్రాంత్, వల్లభలకు పని చేయమని తిలోత్తమ చెప్తుంది. విక్రాంత్ తవ్వితే వల్లభ మట్టి తీస్తుంటాడు. మరోవైపు సుమన, తిలోత్తమ, పెద్దబొట్టమ్మ సంతోషపడతారు. ఇక పెద్దబొట్టమ్మ అనుకున్నట్లే జరుగుతుందని ఇప్పటికి మోక్షం దక్కుతుందని అనుకుంటుంది.
ఇంతలో విక్రాంత్‌కి షాక్ కొడుతుంది. అందరూ కంగారు పడతారు. పెద్దబొట్టమ్మ పోటు దానికి తగులుంటుదని అంటుంది. దేనికి అని విశాల్ అని అడిగితే పెద్ద బొట్టమ్మ కవర్ చేస్తుంది. ఈసారి విశాల్ తవ్వుతాడు. విశాల్‌కి కూడా షాక్ కొట్టినట్లు అవుతుంది. అందరూ కంగారు పడతారు. నయని వదిలేయ్ మని వెళ్లి పోదామని అంటే తిలోత్తమ, పెద్దబొట్టమ్మ తవ్వాల్సిందే అని పట్టుపడతారు. తవ్వుతుంటే అలా అవుతుంటే ఏదో ఉంది అనే కదా అని అంటారు. అందరూ వెళ్లిపోతుంటే నయని తవ్వడం ప్రారంభిస్తుంది. విశాల్ మట్టి తీస్తాడు. అందరూ వెనక్కి వస్తారు. నయని, విశాల్‌తో పాటు అందరూ ఓ పెట్టేను చూస్తారు. దాన్ని వెలిక్కి తీస్తారు.. సుమన, వల్లభలు ఆ పెట్టే పట్టుకోవాలని చూస్తే షాక్ కొడుతుంది. నయనికి మాత్రం ఏం కాదు. అందరూ షాక్ అవుతారు. నయనికి ఏం కావడం లేదు అంటే నయని మాత్రమే దాన్ని ఇంటికి తీసుకురాగలదని పెద్దబొట్టమ్మ అంటుంది. అందరూ పెట్టెను తీసుకొని ఇంటికి వెళ్తారు. తిలోత్తమ, వల్లభలు గజగండ దగ్గరకు వెళ్లి విషయం చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతికి అక్రమ సంబంధం ఉందన్న మహాలక్ష్మీ.. శివకృష్ణకు హార్ట్ ఎటాక్!