టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ నుంచి మొదలు పెడితే స్మాల్ స్క్రీన్ వరకు రష్మీ గౌతమ్ తెలియని ఆడియన్స్ వుండరు. ఆవిడ సినిమాల్లో యాక్ట్ చేసింది. టీవీ షోస్ కూడా చేసింది. 'జబర్దస్త్', 'ఢీ' రియాలిటీ షోలతో ఆవిడ మరింత పాపులర్ అయ్యింది. ఈ షోస్ చూసిన జనాలు ఎవరికైనా సరే సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ మధ్య లవ్ వుందని అనుకోవడం సహజం. టీవీల్లో వాళ్లిద్దరిది సూపర్ హిట్ పెయిర్. ఆ జోడీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రష్మీ మనసులో మాత్రం తనకు జోడీగా సుధీర్ కంటే వేరొకరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అతను ఎవరో కాదు... ప్రదీప్ మాచిరాజు.
ప్రదీప్ జోడీగా నటించడం ఇష్టం!
టీవీల్లో కాదు, సినిమాల్లోనూ సుడిగాలి సుధీర్, రష్మీని జంటగా చూడాలని కొందరు ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. కానీ, రష్మీ మనసులో వేరే ప్లాన్ ఉంది. ఒకవేళ ఆమెకు అవకాశం వస్తే... సుధీర్ కంటే ప్రదీప్ సరసన నటించడానికి ఇష్టపడుతుంది. ఈ అందాల భామ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
'ఈ ముగ్గురిలో ఎవరికి జోడిగా నటించడం ఇష్టం?' అని రష్మీని అడిగారు. సుడిగాలి సుధీర్, ప్రదీప్ మాచిరాజు, శేఖర్ మాస్టర్... ఆవిడకు ముగ్గురి పేర్లు చెప్పారు. రష్మీ గౌతమ్ తడుముకోకుండా ప్రదీప్ మాచిరాజు పేరు చెప్పింది. ''నాకు ప్రదీప్‌తో ఫ్రెండ్లీ బాండింగ్ ఎక్కువ ఉంది. శేఖర్ మాస్టర్ అంటే నాకు రెస్పెక్ట్ ఉంటుంది. సుధీర్ నాకు మల్లెమాల టీవీ షోల్లో పరిచయం. ప్రదీప్ అయితే నేను 'యువ' సీరియల్ చేసినప్పటి నుంచి తెలుసు. అందుకని, ప్రదీప్ మాచిరాజుతో కలిసి నటించేటప్పుడు వేరేలా ఉంటుంది'' అని రష్మీ చెప్పింది.
సుధీర్ కంటే ప్రదీప్ బెస్ట్ ఎంటర్టైనర్!
ఆన్ స్క్రీన్ పెయిర్ విషయంలో మాత్రమే కాదు... బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు? అని అడిగినప్పుడు కూడా సుధీర్ కంటే ప్రదీప్ మాచిరాజుకు ఓటు వేసింది రష్మీ గౌతమ్. 'ఆది, సుధీర్, ప్రదీప్... ముగ్గురిలో బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు?' అని అడిగితే ప్రదీప్ అని చెప్పింది. ఆరేళ్ళ నుంచి అరవైయేళ్ల వ్యక్తుల వరకు అందరినీ ప్రదీప్ ఎంటర్టైన్ చేస్తాడని పేర్కొంది. అందులో మరో సందేహం లేదని, అతడు ఆల్ రౌండర్ అని చెప్పింది.
ముద్దు ఇచ్చేది కూడా ప్రదీప్ మాచిరాజుకే!
కిస్ (ముద్దు), స్లాప్ (చెంపదెబ్బ), వార్నింగ్ (హెచ్చరిక) - ఒక్కొక్కటీ ఒక్కొక్కరికి ఇవ్వాలని చెప్పగా... ''ఆది గారు ఎక్కువ విసిగిస్తారు. అందుకని, ఆయనకు స్లాప్ ఇస్తా. ప్రదీప్ మాచిరాజుకు కిస్ ఇస్తా. సుధీర్ కి వార్నింగ్ ఇస్తా'' అని రష్మీ గౌతమ్ ఆన్సర్ ఇచ్చింది.
Also Read: దర్శకుడి పబ్లిసిటీ పిచ్చి... కటౌట్లు, కోరికలు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయా?
అవకాశం వచ్చిన ప్రతిసారీ ప్రదీప్ మాచిరాజుకు ఓటు వేసింది రష్మీ గౌతమ్. ఆమె ఆన్సర్స్ సుధీర్ అభిమానులను డిజప్పాయింట్ చేశాయి. షాపింగ్ చేయడానికి అయితే సుధీర్ తో వెళతానని చెప్పడం మాత్రమే అతడి అభిమానులకు ఊరట కలిగించే అంశం. టైమ్ ట్రావెల్ చేసే అవకాశం వస్తే సుధీర్ తో లవ్ ట్రాక్ మానేస్తా అని చెప్పడం మరింత నిరాశకు గురి చేసే అంశం.
Also Read: ఒకే వేదికపైకి అల్లు అర్జున్ - సుకుమార్... మారుతి నగర్ ఈవెంట్‌లో 'పుష్ప 2' పుకార్లకు చెక్!?