Melbourne Mayor Selfie with Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఆస్ట్రేలియాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అక్కడ నిర్వహించిన 'ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్'కు(IFFM) చరణ్ గౌరవ అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా చరణ్‌ను చూస్తేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అలాగే అక్కడ నిర్వహించిన భారత స్వాతంత్ర్య వేడుకలో పాల్గొని భారతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి మెల్‌బోర్న్ మేయర్, డిప్యూటీ మేయర్లు కూడా పాల్గొని రామ్ చరణ్‌తో సెల్ఫీ దిగారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను మెల్‌బోర్న్ మేయర్ నిక్ రీస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్‌తో దిగిన సెల్ఫీని పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన "మెల్‌బోర్న్ నగరాన్ని గొప్పగా మార్చడంలో ఇక్కడ ఉంటున్న భారతీయలు పెద్ద పాత్ర పోషిస్తున్నారు. డిప్యూటీ మేయర్ రోషెనాతో కలిసి స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యాను. అక్కడ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సెల్పీ తీసుకున్నా. నా కోరిక తీరింది. నాకున్న కోరికల లిస్ట్‌లో ఇది ఒకటి. చాలా సంతోషంగా ఉంది" అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
అలాగే అక్టోబర్‌లో మెల్‌బోర్న్ డిప్యూటీ మేయర్‌గా రోషేనా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 182 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయ సంతంతికి చెందిన మహిళ తను. ఆమెతో కలిసి స్వాతంత్ర్య వేడుకలకు హాజరవడం చాలా సంతోషంగా" అని మేయర్ నిక్ రీస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఆయన పోస్ట్‌పై నెటిజన్లు, ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా రామ్ చరణ్ ఇటీవల తన భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి ఈ IFFM వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇండియా తరపున ఆయన ప్రాతినిథ్యం వహించారు.
అంతేకాదు ఈ సందర్భంగా ఆయన అవార్డు కూడా అందుకున్నారు. ఈ వేడుకలకు హాజరైన చరణ్ మాట్లాడుతూ.. మెల్‌బోర్న్‌తో తనకు 14 ఏళ్ల అనుబంధం ఉందని, తన ఆరేంజ్ మూవీ షూటింగ్ ఇక్కడే జరిగందన్నారు. అప్పుడు దాదాపు నెల రోజులు ఇక్కడే, ఉన్నానన్నారు. ఆ సమయంలో ఇక్కడ వారు చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనని అన్నాడు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈస ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉంది. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా సెప్టెంబర్‌లో రిలీజ్ చేస్తామని నిర్మాత 'దిల్' రాజు పేర్కొన్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో చరణ్ ప్రభుత్వం అధికారిక కనిపించనున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. అంజలి, శ్రీకాంత్,సముద్రఖని వంటి ఇతర నటీనటులు కీకల పాత్రపోషిస్తున్నారు.
Also Read: తెరపైకి సిక్సుల వీరుడు యువరాజ్ జీవితం... బయోపిక్‌లో క్రికెట్ నుంచి క్యాన్సర్ పోరాటం వరకు!