Trinayani Today April 9th Episode విశాలాక్షిని అవమానించేలా మాట్లాడినందుకు వల్లభ రక్త విరేచనాలతో తీవ్రంగా ఇబ్బందిపడి నీరసించిపోతాడు. ఉన్న ప్లేస్ నుంచి లేవలేకపోతాడు. ఇక విశాలాక్షి వల్లభతో పెద్ద మనిషి అయ్యావా అని ఎగతాళిగా అడిగావు ఆడదాన్ని అర్థం చేసుకొని ఉంటే ఈ మాట ఎప్పుడూ అడగవని అంటుంది. 


విశాలాక్షి: నిన్ను కన్న తల్లి నెత్తురు నవమాసాలు ఆగితే నువ్వు ఈ భూమ్మీదకు వచ్చావు. మళ్లీ రక్తంలోనే నీ జనన కలుపు క్షణం మొదలు.. రుధిరంలోనే చివరి అంత్యక్రియలు పూర్తవుతాయి. అర్థమైందా..
నయని: నీ మాటల్లోని అర్థం తెలుసుకుంటే బాధ కన్న తప్పు చేశానన్న భయంతో బతికేలా లేరమ్మా.. అక్క పట్టుకో తీసుకెళ్లక్క..
హాసిని: ఇంకోసారి బుద్ధి ఉంటే ఇలాంటి పిచ్చి ప్రశ్న వేయరు. పదండి..


పావనామూర్తి వల్లభను తీసుకెళ్తాడు. విశాల్ ఎదురుగా వచ్చి ఏమైందని అడుగుతాడు. చెప్పుకుంటే సిగ్గు చేటు అని పావనా అంటాడు. ఇక వల్లభ విశాల్ ఫైల్‌ నుంచి ఓ పేపర్ కింద పడితే దాన్ని తీసుకుంటాడు. అందులో బ్యాంక్ నుంచి 12 కోట్లు డబ్బులు విత్ డ్రా చేసిన విషయం వల్లభ చెప్తాడు. ఆ పేపర్ అంత సేపు చూస్తున్నావ్ అందులో ఏముందని వల్లభను అందరూ అడుగుతారు. దానికి వల్లభ గాయత్రీ పెద్దమ్మ గురించి ఉందని చెప్తాడు. అందరూ షాక్ అవుతారు. పేరు  ఉందని అందుకే అన్నయ్య అలా చెప్తున్నాడు అని విశాల్ కవర్ చేస్తాడు. వల్లభ ఇవ్వడు. ఇంట్రస్టింగ్ విషయాన్ని అందరికీ చెప్తాలి అంటాడు. 


వల్లభ: 12 కోట్లు ఫిబ్రవరి నెలలో విత్‌డ్రా చేసినట్లు ఉంది ఇందులో. 
విశాల్: అన్నయ్య బిజినెస్ అన్నాక డిపాజిట్, విత్‌డ్రా అన్నీ ఉంటాయి కదా..
నయని: ఆ పేపర్ ఇచ్చేయండి బావగారు టైం వేస్ట్ ఎందుకు.
వల్లభ: పెద్ద మరదలా నేను టైం కోసం వెయిట్ చేస్తున్నా.. నువ్వు నీ మొదటి కూతురు కోసం ఎదురు చూస్తున్నదానివి. 12 కోట్లను బ్యాంక్‌ నుంచి విత్‌డ్రా చేసింది ఎవరో కాదు హాసిని గాయత్రీ పెద్దమ్మ. 
నయని: అమ్మగారు ఎలా విత్‌డ్రా చేస్తారు.
వల్లభ: ప్రూఫ్ చేతిలో ఉంటే నిర్లక్ష్యం చేస్తారేంటి. 
హాసిని: మిస్టర్ రాజా ఇందులో వింతేముంది. గాయత్రీ పాప మైనర్ కాబట్టి విశాల్ గార్డియన్‌గా సంతకం చేసుంటాడు.  అంతే కదా..
వల్లభ: గాయత్రీ పాపకు దేవి అని చివర చేర్చింది ఎప్పుడు మార్చిలో విత్‌డ్రా చేసింది ఎప్పుడు ఫిబ్రవరిలో.. ఇదేలా సాధ్యమవుతుంది. 
నయని: అవును కదా. అప్పుడు ఇంకా పేరు మార్చలేదు కదా బాబుగారు.
డమ్మక్క: పేరులు మనం మార్చుకుంటాం మారని రాతలు కొన్ని ఉంటాయి.
పావనా: అంటే నెల ముందే నువ్వు పాప పేరులో దేవి చేర్చావా అల్లుడు.
హాసిని: గాయత్రీ అనే పేరుతో మంచి జరగదు అని దేవి అని చేర్చి ఆస్ట్రాలజీ ప్రకారం ముందుకు వెళ్లాడు. అప్పుడు నుంచే మనకు లాభాలు వచ్చాయి కదా.. అది ఆ పేరుకున్న పవర్ తీసుకో విశాల్. 


ఇక విశాల్ ఒంటరిగా ఉంటే నయని వచ్చి మళ్లీ ప్రశ్నిస్తుంది. విశాల్ రొమాంటిక్‌గా మాట్లాడి కవర్ చేస్తాడు. నయని విశాల్ చేతిలో ఓ పేపర్ పెడుతుంది. అందులో గాయత్రీ పాప పుట్టిన తేదీ మార్చి గాయత్రీ దేవి పుట్టిన తేదీ మార్చారు. పుట్టిన తేదీ కూడా ఎందుకు మార్చాల్సి వస్తుందో చెప్తారా అని నయని అడుగుతుంది. దీంతో విశాల్ కలిసి వస్తుందని అలా చేశానని కవర్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నయని మదిలో చాలా ప్రశ్నలు తలెత్తుతాయి. 


విశాల్ ఇంట్లో ఉగాది పూజ నిర్వహిస్తారు. లలితా దేవి, గురువుగారు అందరూ కూడా పూజకు వస్తారు. లలితదేవి, గురువుగారు ఉగాది పర్వదిన విశిష్టత చెప్తారు. నయనికి లలిత దేవి ఇచ్చిన నగలు వేసుకోమంటే నయని వేసుకోకుండా వస్తుంది. ఏమైందని అందరూ అడుగుతారు. దీంతో నయని తడబడుతూ నగలు కనిపించడం లేదు అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. విక్రాంత్ తన భార్య సుమనను అనుమానంగా చూస్తాడు. దీంతో సుమన అవసరం అయితే నా గదిలో చెక్ చేసుకోండి అని అంటుంది.  లలిత దేవి ముందు ఉగాది పూజ చేయమని నగలు ఎక్కడికీ వెళ్లవని నగలు దాచినా దొరకబడతాను అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: అల్లు అర్జున్ బ‌ర్త్ డే: బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ర‌ష్మిక