Karthika Deepam 2 Serial Today Episode దీప సౌర్యని పడుకోపెట్టి తలుపు వేసి వస్తాను అని చెప్పి వెళ్తుంది. ఇంతలో అక్కడి పారిజాతం వస్తుంది. దీప కూర్చొమని అంటే నా ఇంట్లో నాకు మర్యాదలు ఎందుకు అని పారిజాతం అడుగుతుంది. ఇక దీపకు తన గాయం గురించి అడుగుతుంది. దీప కొంచెం నొప్పి ఉంది అని అంటే మధ్యలో ఉన్నవాళ్లకే నొప్పి ఉంటుంది. అందుకే మధ్యలో ఉండకూడదు అంటూ దీపకు క్లాస్ ఇస్తుంది. ఇక దీపను మీలాంటి వారు పని చేయడానికి మాలాంటి గొప్పళ్లుకు వస్తారు, తేరగా తిని కూర్చొంటారు అంటూ అవమానిస్తుంది. 


దీప: అమ్మగారు నేను ఏ పరిస్థితుల్లో ఇక్కడ ఉంటున్నానో మీకు కూడా తెలుసుకదమ్మా.
పారిజాతం: తెలుసు అంటే ఎవరికి తెలుసు. నువ్వేమైనా మా చుట్టానివా బంధువువా.. ఆత్మాభిమానం ఉన్న ఆడది పరాయి పంచలో ఉండటానికి ఇష్టపడదు. అలా ఉంది అంటే అది తింగరి అయినా అయిండాలి లేదంటే మొగుడు వదిలేసింది అయినా అయిండాలి. నువ్వు అయితే తింగరి కాదు మరి అయితే  మొగుడు వదిలేశాడా..
దీప: అమ్మగారు లోపల నా కూతురు ఉంది. వింటే తప్పుగా అనుకుంటుంది. కొంచెం మర్యాదగా మాట్లాడండి.
పారిజాతం: ఏంటి దీప నా మాటలకు కోపం వచ్చింది ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయే ఆడదాన్ని ఇలాగే అంటారు. ఉండాలో ఏం చేయాలో నీకు తెలుసు అనుకో. ఒకరితో చెప్పించుకునే దానివి అయితే ఇలా చెప్పించుకోవు. సరి అది పక్కన పెట్టు. ఆ గుడిలో సుమిత్రను కొట్టిన వాడిని నువ్వు చూశావు అన్నారు. వాడేనా ఇంకా ఎవరైనా ఉన్నారు అంటావా..
దీప: ఇలాంటి వెధవ పనులు చేసిన వాడి వెనక ఎవరో ఉండే ఉంటారు. చూస్తే గుర్తు పడతాను.  


మరోవైపు కార్తీక్ బయటకు వెళ్తుంటే సుమిత్ర ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. మా ఇంటికి వెళ్తున్నా కొంచెం వర్క్ ఉంది అని చెప్తాడు. దీంతో సుమిత్ర తొందరగా వెళ్లి వచ్చేయ్ మని చెప్తుంది. ఇక దీప బిడ్డను తీసుకొని బయటకు వెళ్లిపోవాలని వెళ్తుంటే కార్తీక్ చూస్తాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నిస్తాడు. 


కార్తీక్: మిమల్ని చూస్తుంటే తిరిగి వచ్చేలా లేరు ఎక్కడికి వెళ్తున్నారు.
దీప: ఇక్కడికి దూరంగా..
కార్తీక్: మీరు వెళ్లడానికి వీళ్లేదు. 
దీప: అది చెప్పడానికి మీరు ఎవరు.
కార్తీక్: అసలు మీరు హైదరాబాద్ ఎందుకు వచ్చారు అదైనా చెప్పండి.
సౌర్య: మా నాన్న కోసం.. 
దీప: వెళ్లేవాళ్లని ఆపడమే మీ పని అనుకుంటా.. మనుషుల్ని కాకుండా కార్‌ని ఆపుంటే బాగుండేది మనుషులైనా మిగిలేవారు. మమల్ని వెళ్లనివ్వండి. 
కార్తీక్: ఆగండి.. కొన్ని సార్లు చెప్పుకునే అవకాశం వచ్చినా చెప్పే అవకాశం ఉండదు. కళ్లు చూసే ప్రతీ కథ వెనక ఒక నిజం ఉంటుంది దీప.
దీప: బాబు మీరు నాకు చాలా మంచి చేశారు. ఇంకా మా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. ప్రాణాలు తప్ప.
కార్తీక్: అత్తకు చెప్పి వెళ్లండి.. అత్తను పిలుస్తాను..
దీప: మీరు ఇప్పుడు ఎవరికీ చెప్పనవసరం లేదు బాబు..అసలు మీరు ఎందుకు నా విషయంలో కలుగజేసుకుంటున్నారు. అడ్డు తప్పుకోండి.
కార్తీక్: ఇంత రాత్రి వేళ మీరు వెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ మీరు వెళ్లాలి అనుకుంటే అత్తతో చెప్పి వెళ్లండి. ఇంట్లోకి వెళ్తారో అత్తతో చెప్పి బయటకు వెళ్తారో రెండింటిలో ఏదో ఒకటి జరిగే వరకు నేను ఇక్కడి నుంచి కదలను.
దీప: ఎదుటి వారి బలహీనతతో ఆడుకోవడం మీకు అలవాటా.. పదమ్మ సౌర్య లోపలికి పడుకుందాం.


ఉదయం సౌర్య ఆడుకుంటుంది. అది చూసిన పారిజాతం వీళ్లకి ఇంత క్లాస్ పీకినా వెళ్లలేదు అని ఇప్పుడు వెళ్లగొడతా అని అక్కడ పువ్వులు చూస్తున్న సౌర్యని తిడుతుంది. సౌర్య మాటకు మాట సమాధానం ఇవ్వడంతో కొట్టడానికి చేయి ఎత్తుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి పారిజాతాన్ని కోప్పడతాడు. సౌర్యకు నచ్చిన పువ్వులు కోసుకో అని చెప్తాడు. పారిజాతం బుంగమూతి పెడుతుంది. సౌర్య బయపడి ఈ ఊరిలో పూలు కోస్తే తిడతారు అనుకుంటే చూసినా తప్పేనా ఇక్కడ ఉండమని ఊరు వెళ్లిపోతాను అమ్మమ్మకు చెప్తాను అని పరుగులు తీస్తుంది. సౌర్య సుమిత్రకు చెప్తుంది. పారిజాతం కవర్ చేసినా సుమిత్ర వార్నింగ్ ఇస్తుంది.


మరోవైపు ఇంక్వైరీ కోసం పోలీసులు ఇంటికి వస్తారు. పారిజాతానికి ఈ విషయం బంటు చెప్పడంతో పారు కంగారు పడుతుంది. ఇక దీప ఎదురుగా రౌడీలను పెట్టి అటాక్ చేసిన వాళ్లని గుర్తు పట్టమని అంటారు. దీప అందర్నీ పరిశీలిస్తూనే బంటుని అనుమానంగా చూస్తుంది. బంటు, పారిజాతం కంగారు పడతాడు. పోలీసులు తీసుకొచ్చిన వాళ్లు ఎవరూ కారు అని దీప అంటుంది. 


ఇక పోలీసులకు దీప కార్తీక్ వాళ్ల ఇంటి నుంచి వెళ్లిపోతా అని చెప్తుంది. దీంతో సుమిత్ర నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లాలి అనుకుంటున్నావా అని అంటుంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తావు దీప అని ప్రశ్నిస్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: అల్లు అర్జున్ బ‌ర్త్ డే: బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ర‌ష్మిక