Trinayani Today Episode గర్భిణీ స్త్రీ చెప్పినట్లు శిరస్సు లేని దేవతకు పూజ చేసేందుకు నయని సిద్ధమవుతుంది. పూజ కోసం ఇంట్లో అందరూ రెడీ అవుతారు. సుమన తిలోత్తమ దగ్గరకు వస్తుంది. వల్లభ, సుమన, తిలోత్తమలు నయని చేయనున్న పూజ గురించి మాట్లాడుకుంటారు. పూజ సక్సెస్ అయితే నయనికి మంచి పేరు వస్తుందని అనుకుంటారు. ఇక తిలోత్తమ సుమనతో నువ్వు తప్పా అందరూ ధనవంతులే సుమన అని అంటుంది.


సుమన: నాకు టైం రాదా నేను రిచ్ అయిపోనా అత్తయ్య.


వల్లభ: రిచ్ వాళ్లమయ్యేలా ఉన్నాం మీ అక్క చేసే పనులకు.


సుమన: బావగారు మీకు గాయత్రీ అత్తయ్య జాడ తెలుసుకోవాలి అని ఉందా లేదా ముందు అది చెప్పండి.


తిలోత్తమ: ఇప్పుడు శిరస్సు లేని అమ్మవారి పూజలో గాయత్రీ అక్క జాడ తెలుస్తుందా.


సుమన: హాల్‌లో పూజ తలపెట్టిన మా అక్కని అవమానించి మనం నవ్వుకోవాలి.


తిలోత్తమ: చాలా కోపంగా ఉన్నట్లున్నావే..


సుమన: కోపం చిన్నమాట అత్తయ్య కసి.. ఆ మాత్రం ఉండబట్టే ఆస్తి లేకపోయినా ఇంకా బతికే ఉన్నాను. 


వల్లభ: బంగారం లాంటి ఉలూచి పాప ఉంది కదా దాన్నే ఆస్తి అనుకో సరిపోతుంది.


సుమన: అలాంటి రోజులు నా చిన్నప్పుడే పోయావి బావగారు. నేనేమో పగలు ఆడపిల్లలా కనిపించే పిల్లని చూసి అదే ఆస్తి అనుకోవాలా.. మా అక్కేమో కన్న బిడ్డ కనిపించకపోయినా శాస్త్రిగారి మనవరాలిని దత్తత తీసుకొని లలితాదేవి అత్తయ్యగారు కూడా వందల కోట్ల ఆస్తి మళ్లీ తనకు ఇస్తారా. 


తిలోత్తమ: ఆ విషయంలో నీకు అన్యాయం జరిగింది సుమన. సొంత చెల్లికి పావలా వాటా ఇచ్చినా జీవితాంతం రుణపడి ఉండేదానివి కదా..


సుమన: మా అక్కకి పాద సేవ చేసేదాన్ని.. కానీ అలా జరగలేదు అత్తయ్య. అందుకే ఈ పూజ తను చేసినా ఫలితం నాకు వచ్చేలా చేసుకుంటాను. 


వల్లభ: ఎలా చిన్న మరదలా.


సుమన: చూస్తారు కదా బావగారు.


మరోవైపు గాయత్రీ జాడ తెలిసిపోతుందేమో అని హాసిని తెగ కంగారు పడుతుంది. ఇంతలో విక్రాంత్, నయని, పావనా, డమ్మక్కలు అక్కడికి వస్తారు. పూజ గురించి మాట్లాడుకుంటారు. ఇక హాల్‌లో విశాల్ పూజ ఏర్పాట్లు చేస్తుంటాడు. అందరూ పూజ దగ్గరకు చేరుకుంటాడు. ఇక విశాల్ కర్టెన్లను ఏర్పాటు చేసి దాని వెనక అమ్మవారు ఉంది అని చెప్తాడు. తిలోత్తమ అమ్మవారు ఉందా అని అడిగితే అవతల ఉందని చెప్తాడు. దానికి సుమన వీళ్ల హడావుడి చూస్తుంటే ఏదో మాయ చేస్తున్నారు అనిపిస్తుంది అని అంటుంది. 


డమ్మక్క: అమ్మ కృప ఉంటే అన్నీ ఉన్నట్లే.


విక్రాంత్: బ్రో నువ్వు అమ్మవారిని ఏర్పాటు చేసి ఉంటే ఈ రోజు పెద్దమ్మ జాడ తెలిసిపోతుంది. 


విశాల్: అవునురా..


హాసిని: ఇదేంటి బాబాయ్ విశాల్ నవ్వుతున్నాడు.


పావనా: ఏమోనమ్మ నాకు తెలీదు..


తిలోత్తమ: నయని పూజ అనగానే ఎలాగైనా చేస్తుందని రెడీ అయివచ్చాం.


సుమన: ఇంత వరకు వచ్చాక ముచ్చట్లు ఎందుకు అమ్మవారిని చూపించండి.


నయని: బాబుగారు పరదా తీయండి.


విశాల్: తప్పకుండా నయని.. విశాలాక్షి చెప్పినట్లు చేయగానే.. అమ్మవారే మన ఇంట్లో కొలువై ఉన్నారా అనిపించింది. ఏర్పాట్లు నేనే అయినా సహకరించింది సాక్ష్యాత్తు అమ్మవారే అనిపించింది. అమ్మ చూడండి.. విశాల్ తులసి కోటకు చీర చుట్టి అమ్మవారిగా అందంగా రెడీ చేస్తాడు. తల స్థానంలో తులసి చెట్టు ఉంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. మరోవైపు విశాలాక్షి నమఃశివాయ అంటూ ధ్యానం చేస్తుంటుంది. 


వల్లభ: ఇదేంటి అమ్మ ఇలా చేశారు.


తిలోత్తమ: అమ్మవారు అని చెప్పారు. 


సుమన: చెప్తున్నారు కూడా అత్తయ్య మనం నమ్మాలని..


నయని: ఇందులో మీకు అనుమానం ఉంది అంటే మీకు ఏమాత్రం భక్తి లేదు అని అర్థం.


వల్లభ: శిరస్సు లేని అమ్మవారు అని చెప్పి తల ఉండే చోట తులసి కోట పెట్టారు ఏంటి. 


విక్రాంత్: బ్రో పవిత్ర మైన తులసి చెట్టు.


పావనా: తులసి చెట్టును పూజిస్తే లక్ష్మీ దేవి వస్తుందమ్మ.


తిలోత్తమ: పావనా మూర్తి.. లక్ష్మీదేవి.. సరస్వతీ దేవి.. రావడం కన్నా మాకు మా అక్క గాయత్రి దేవి రావడం ముఖ్యం. 


డమ్మక్క: పూజ చేయనిస్తే కదమ్మా గాయత్రీ దేవి వస్తుంది. 


వల్లభ: ఏంటి ఇప్పుడు ఈ పూజ చేస్తే పెద్దమ్మ వచ్చేస్తుందా.


నయని: వస్తుందని నమ్ముతున్నాను కాబట్టే పూజ చేస్తున్నా..


సుమన: ఛాలెంజ్ చేస్తున్నా అక్క పూజ తర్వాత పెద్దత్తయ్య వస్తే నువ్వు ఏం చెప్తే అది వింటాను. 


తిలోత్తమ: ఇప్పుడు సుమనకు ఉన్న అనుమానం గెలుస్తుందో నయని నమ్మకం గెలుస్తుందో చూద్దాం నువ్వు పూజ చేయు..


ఇక హాసిని గాయత్రీ పాపను తీసుకెళ్లిపోతా అంటే అందరూ వద్దని చెప్తారు. ఇక విశాల్ కూడా వదిన ఉండనివ్వు పర్వాలేదు అంటాడు. ఇక నయని పూజ ప్రారంభిస్తుంది. ఇక విశాల్ అద్దం తీసుకొని రమ్మని చెప్తే పావనామూర్తి పట్టుకొని వస్తాడు. తిలోత్తమ నయనితో బాగా పూజ చేయు నయని నీ పూజకు మెచ్చి అమ్మవారు రాకపోయినా నువ్వు అమ్మగారు అని పిలిచే గాయత్రీ అక్క తిరిగిరావాలని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ఆస్తిలో కొసరు ఇచ్చి, అది కూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారా? - జగన్‌కు షర్మిల సూటిప్రశ్న