Naga Panchami Today Episode మోక్షని గదిలో బంధించి వైదేహి పంచమికి అబార్షన్‌ చేయించడానికి హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. అందరూ ఇంట్లో దిగులుగా కూర్చొని ఉంటారు. మోక్ష తన తండ్రి, శబరి వాళ్లకి తలుపు తీయమని ఏడుస్తూ వేడుకుంటాడు. అన్నల్ని కూడా పిలుస్తాడు. అందరూ ఏమీ చేయలేం అన్నట్లు కూర్చొంటారు.


మోక్ష: శబరి నువ్వు కూడా నా మాట వినవా.. డోర్ తీయ్ శబరి.. ఇప్పుడు పంచమికి గర్భం తీసేస్తే మేం శాశ్వతంగా పిల్లులు లేనివాళ్లలా మిగిలిపోవాల్సి వస్తుంది. పంచమికి మరో సారి గర్భం దాల్చే అవకాశం లేదు. ప్లీజ్ శబరి డోర్ ఓపెన్ చేయ్..
మీనాక్షి: శబరి డోర్ తీయడానికి వెళ్లే.. అమ్మ డోర్ తీస్తే వదిన ఏమైనా అంటుందేమో.
రఘురాం: అమ్మ లోపల నుంచి మోక్ష అరుస్తుంటే నాకు కూడా చాలా బాధగా ఉందమ్మ.
శబరి: పరవాలేదు రఘురాం. నా కోడలితో మాటలు నేను పడతాను. కానీ నా మనవడి ఆవేదన నేను వినలేకపోతున్నాను. 
జ్వాల: ఆగు బామ్మ.. డోర్ తీస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. మోక్ష బయటకు వస్తే పంచమి గర్భం తీయకుండా ఆపుతాడు. అప్పుడు మోక్ష ప్రాణాలు పోతాయి. 
చిత్ర: మోక్ష ప్రాణాలు పోయినా పర్లేదని అనుకుంటే వెళ్లి డోర్ తీయండి. మేమేం అడ్డు తగలము.
మోక్ష: శబరి నీ మనసు కూడా కరగలేదా. ఎందుకు మీరు ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. నాన్న డోర్ తీయండి. 
శబరి: పంచమినే నా మనవడిని కాపాడింది. ఇక ముందు కూడా కాపాడుకుంటుంది. అని శబరి తలుపు తీయడానికి వెళ్తుంది. 
మోక్ష: తలుపు తీయకపోతే మీ ఎవరితోనూ నేను మాట్లాడను. మీ అందరూ కావాలనే నా బిడ్డను చంపేస్తున్నారు. మీకు మనసులు లేవు మానవత్వం లేదు. నాకు ఏం కాదు అని చెప్పినా వినకుండా మూఢనమ్మాల కోసం మా బిడ్డను బలి చేస్తున్నారు. 
రఘురాం: అమ్మ ఆగమ్మా.. తాను చచ్చినంత ఒట్టు అని వైదేహి అంది కదమ్మా..
శబరి: పర్వాలేదు రఘురాం ఆ ఒట్టునామీద వేసుకుంటాను. నా ప్రాణం పోయినా పర్లేదు. 
రఘురాం: అమ్మా ఆగమ్మా గురువుగారు మాటలు మేం నమ్మకపోయినా నువ్వు నమ్ముతావు కదమ్మా.. మోక్షకు ఏమైనా జరిగితే.. అని అడగటంలో శబరి ఆగిపోతుంది. 


మరోవైపు పంచమిని వైదేహి హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. ఇక పంచమి మోక్ష, తాను బిడ్డ కోసం మాట్లాడుకున్న మాటలు తలచుకొని ఏడుస్తుంటుంది. వైదేహి పంచమికి థ్యాంక్స్ చెప్తుంది. పంచమి చేయబోతున్న ఈ త్యాగాన్ని మర్చిపోను అని వైదేహి అంటుంది. 


మరోవైపు నాగేశ్వరి పాము పంచమి కారు వెనక ఫాలో అవుతుంది. ఇంతలో ఫణేంద్ర నాగేశ్వరి పామును అడ్డుకుంటాడు. నాగేశ్వరి అడ్డులేగమన్నా ఫణేంద్ర మాట వినడు. ఇక నాగేశ్వరి కాటేస్తాను అంటే.. ఫణేంద్ర పాముగా మారగానే తల మీద బండ రాయి వేసి చంపేసి మంటల్లో వేసేస్తా అంటాడు. దీంతో నాగేశ్వరి మంటల్లోకి వెళ్లి ఫణేంద్రని చుట్టేస్తుంది. దీంతో ఫణేంద్ర స్ఫృహ కోల్పోతాడు. మరోవైపు పంచమి మాటల్ని తలచుకొని మోక్ష కుమిలిపోతాడు. 


మోక్ష: నో గర్భం తీయడానికి వీల్లేదు. పంచమి నీ గురించి నాకు తెలుసు. నా గుండెలు ఇక్కడ బద్దలైపోతున్నాయి. ఓ తల్లిగా బిడ్డను పోగొట్టడానికి నువ్వు ఎంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు. పంచమి మనకు మరో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం లేదు. వద్దు పంచమి నువ్వు బిడ్డను చంపుకోవద్దు. మనసు మార్చుకొని వచ్చేయ్.. పంచమి.. వచ్చేయ్.. అని ఏడుస్తాడు.


 డాక్టర్ మాటలు గుర్తు చేసుకొని మోక్షఏడుస్తాడు. ఇక ఆలోచించి కిటికీని స్క్రూలు తీసి బయటకు వస్తాడు. మరోవైపు పంచమి హాస్పిటల్‌కి చేరుకుంటుంది. వైదేహి పంచమిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తుంది. ఇక నాగేశ్వరి పాము కూడా హాస్పిటల్‌కు చేరుకుంటుంది. మరోవైపు మోక్ష బైక్‌పై హాస్పిటల్‌కు దగ్గరకు వస్తుంటాడు. ఇక కరాళి మోక్షను గమనిస్తూ ఉంటుంది. తన  మంత్ర శక్తితో ఓ ముసలిలా మారి మోక్షకు అడ్డు వస్తుంది. మోక్ష బైక్‌కు అడ్డుగా రావడంతో మోక్ష తప్పించలేక పడిపోతాడు. తర్వాత బైక్ స్టార్ట్ అవ్వదు. దీంతో మోక్ష పరుగులు తీస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతిని యాక్సిడెంట్ చేసిన రౌడీ రంగకి మహా డబ్బులు ఇస్తుండగా చూసేసిన సీత!