Trinayani Serial Today August 16th Episode:ఈ లెటర్ ఎవరు పంపారో తనకు తెలుసని నయనీ అనడంతో ఇంట్లో వాళ్లందరూ షాక్‌కు గురవుతారు. ఖచ్చితంగా ఇది మన ఇంట్లో ఆడవాళ్లు పంపిన లెటరేనని చెబుతుంది. దీంతో అందరూ వైజాగ్‌ నుంచి లెటర్ వస్తే ఇంట్లో వాళ్లు ఎలా పంపుతారని ప్రశ్నిస్తారు. ఎవరో ఇక్కడ నుంచి అక్కడి వాళ్లకు ఫోన్‌లో మేటర్‌ చెప్పడమో లేక మెయిల్ చేయడం ద్వారా పంపించి అక్కడి నుంచి లెటర్ వచ్చేలా చేశారని ఆమె చెబుతుంది. దీంతో ఇంట్లో ఉన్న ఆడవాళ్లందరూ మాకు తెలియదంటే మాకు తెలియదంటారు...తొందరలోనే ఈ లెటర్ ఎవరు పంపారో తెలుసుకుంటానని నయనీ అంటుంది. ఈ ఐదుగురిలో గాయత్రీఅమ్మగారు పునర్జన్మ ఎత్తి పాపరూంలో ఉందన్న సంగతి ఇద్దరికి మాత్రమే తెలుసని నయనీ అనడంతో....వెంటనే అందుకున్న హాసిని ఒక్కరికే కదా తెలుసు అంటుంది. దీంతో వెంటనే అందుకున్న ఆమె అత్తగారు... నయనీ ఇద్దరూ అంటుంటే నువ్వు ఒక్కదానికే తెలుసని ఎలాం అంటావు అని నిలదీస్తుంది

హాసిని: ఆడవాళ్లలో ఒక్కరికి తెలిస్తేనే ప్రపంచానికి పాకిపోతుంది. అలాంటిది ఇద్దరికి తెలిస్తే ఇంకా ఎవరికి తెలియకుండా ఉంటుందా అత్తయ్య.

 

విక్రాంత్‌: నయనీ వదినకి గాయత్రి పెద్దమ్మ ఆచూకీ తెలిసిపోతుందని నా సిక్స్‌సెన్స్‌ చెబుతోంది.

నయనీ: అవున్ విక్రమ్‌బాబు... సమయం వచ్చేసింది

సుమనా: బాగుంది అక్కా...కొంచెం టెన్షన్‌గానే ఉన్నా..ఏదో జరగబోతోంది అని మాత్రం అనిపిస్తోంది.

 

నయానీని విశాల్‌ వెనక నుంచి వచ్చి గట్టిగా హత్తుకుంటాడు. ఎందుకంత ఆనందగా ఉన్నారని నయనీ ప్రశ్నించడంతో...మనకు దూరమైన మనబిడ్డ ఎక్కడ ఉందో తెలుసని ఉత్తరం వచ్చింది కదా అందుకే సంతోషంగా ఉందంటాడు.  

నయనీ: ఎవరికో తెలిస్తే ప్రయోజనం ఏముంటుంది బాబుగారూ...మనకు తెలియాలి కదా

 

విశాల్‌: ఆ తెలిసినవాళ్లు ఎవరో తెలుసుకుంటే మనం తెలుసుకోవడం ఎంతసేపు నయనీ

 

అంతలోనే నయనీకి మూడోకన్నులో జరగబోతుందని తెలుస్తుంది. విశాల్‌కు ఓ చేయిలేకుండా ఉండటం కనిపిస్తుంది. వెంటనే కంగారుపడిపోతున్న నయనీ చూసి విశాల్‌ ఏమైందని ప్రశ్నిస్తాడు. కానీ ఏం లేదంటూనే  విశాల్‌ చేయిని తన దగ్గరకు తీసుకుని ఏడుస్తుంది నయనీ. ఏదో మాటమార్చి భర్తను అక్కడి నుంచి పంపించేస్తుంది. భర్త వెళ్లిపోయిన తర్వాత తనకు కాలజ్ఞానం కనిపించిన సంకేతాలకు అర్థం ఏంటోనని బాధపడిపోతుంది.

 

నాలుగురోజుల్లో ఉలిచిపాప పుట్టినరోజు ఉంటే ఏం పట్టనట్లు ఎవరి పనుల్లో వారు ఉన్నారంటూ భర్త విక్రమ్‌పై మండిపడుతుంది భార్య. ఇంట్లో ఇంత టెన్షన్‌గా ఉంటే సంబరాలు అవసరమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. టెన్షన్ దేనికంటా అంటూ సాగదీస‌్తుంది భార్య. 

 

విక్రాంత్: నలుగురు పిల్లల చుట్టూ మృత్యు దోషం తిరుగుతోందని గురువుగారు చెప్పారు కదా...ఈ సమయంలో బర్త్‌డే పార్టీలు అవసరమా

 

సుమన: ఎప్పుడో ఏదో అవుతుందని అందరూ....పార్టీలు, పండగలు చేసుకోకుండా ఉండాలా అంటుంది. రాశిఫలాల్లో వాహనగండం ఉందని ఉంటే ఎవరూ వాహనాలు ఎక్కకుండా ఉంటారా...?

 

విక్రాంత్: నీకు ఎలాంటి చీకూ, చింత లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావ్. పాపం నయనీ వదిన ఎంత బాధపడుతుందో తెలుసా..? ఎవరో లెటర్ రాసి మీ నుంచి ఎత్తుకుపోయిన తొలిబిడ్డ ఎక్కడ ఉందో తెలుసు అని రాశారు..? ఎవరు రాశారు.? గాయత్రి పెద్దమ్మ పసిబిడ్డగా పుట్టి ఎక్కడ ఉందోనని ఎంత టెన్షన్‌ పడుతుందో కదా.?

సుమన:  ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా.. ఒకటి కన్నది, రెండోది దత్తత తీసుకుంది. కోట్లు మూలుగుతున్నాయి. ఇంకా కొత్త కంపెనీలు పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉన్నవాళ్లతో ఉన్నంతలో తృప్తిపడి..కాస్తో కూస్తో ఉలిచికి ఇచ్చి కృష్ణా, రామా అని గడిపేయకుండా తప్పిపోయి రెండేళ్లవుతున్న బిడ్డ కోసం ఆరాటపడటం అవసరమా.?

 

విక్రాంత్: తల్లిపేగు ఎంత తల్లిడిల్లిపోతుందో నీకేం తెలుసే

 

సుమనా:  నేను కూడా అమ్మనే

 

విక్రాంత్: బిడ్డ నమ్మకాన్ని అమ్ముకునే అమ్మవి నువ్వు

సుమనా:  నన్ను అవమానిస్తున్నారు గానీ..నాలా సూటిగా మాట్లాడే వారు మీకు దొరకరని తెలుసుకోండి

విక్రాంత్: నీతోనే విసిగిపోయినా...ఇంకో ఆడదాని సావాసం కూడానా నా కొద్దమ్మా..?

 

సుమనా:  సర్లేగానీ మనలోమనమాట...తొందరపడే వారి పిల్లలకే దోషం ఉంటుందని గురువుగారు చెప్పారు కదా..తొందరపడటం అంటే ఏంటి

విక్రాంత్: ఎక్కువ ఊహించుకోకు..అంతకన్నా తొందరగా విసుకు వస్తుంది.

సుమన: అబ్బై...అది కాదండి మనకు కరెక్ట్‌గా తెలిస్తే...ఆచితూచి మాట్లాడి అడుగులు వేస్తాం కదా. ఎందుకంటే నాకు హాసిని అక్కకు ఉంది చెరో బిడ్డే కదా..? అదే నయనీ అక్కకు ఒకరు కాకపోతే ఇంకొకరు ఉన్నారు.

 

విక్రాంత్: సుమనా..పిచ్చి మాటలు మాట్లాడకు 

సుమనా: నేను చెప్పాను కదా నా మాటలు నిష్టురంగా ఉన్నా నిజాలేఉంటాయని...ఉన్న ఇద్దరిలో ఒకరికి రోగం తగిలినా మళ్లీ రేపోమాపో మీ పెద్దమ్మను పసిబిడ్డగా తీసుకొస్తారు. అప్పుడు మా అక్క వాళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టే

 

విక్రాంత్: ఏం నోరే నీది...దానికి తాళం వేసుకునే ప్రయత్నం చేయ్‌..ఉలిచి పుట్టినరోజు అయిపోయిన తర్వాత మిగిలిన పిల్లల పుట్టిన రోజులు ఒకేరోజు వస్తాయి...ఆ ఆనందం మిగల్చకుండా శాపనార్థాలు పెట్టేలా మాట్లాడకు

 

సుమనా: అయ్యోరామా.. నా అభిప్రాయం కూడా చెప్పడం తప్పే అంటే నేను ఇంకే చెప్పను...మా అక్క పిల్లలకుఆపద వచ్చినా తాను తెలుసుకోలేదు కాబట్టి ముందు నుంచీ అందరూ దైర్యంగా ఉండాలని చెబుతున్నాను

 

వైజాగ్‌ నుంచి వచ్చిన లెటర్ ఎవరు రాశారో తెలిసిపోయిందని భర్త నయనీతో అంటాడు. దీంతో కంగారుపడిపోయిన నయనీ ఎవరంటా అంటూ అడుగుతుంది. జీవం ఆ లెటర్ రాశాడని చెబుతాడు. తనే కదా మన బిడ్డను ఎత్తుకుపోయిందని అంటాడు. కాబట్టి తనకే తెలుసని లెటర్ రాశాడని చెబుతాడు. జీవం అన్నతో మీరు మాట్లాడారా అని నయనీ భర్తను అడుగుతుంది. మాట్లాడలేదు కానీ....ఎంక్వయిరీ చేయిస్తే జీవమే ఆ లెటర్ రాశాడని తెలిసిందంటాడు. జీవంను పట్టుకుంటే మా అమ్మ ఆచూకీ లభించినట్లేనంటాడు.

 

నయనీ: బిడ్డను ఎత్తుకెళ్లిపోయినరోజే వదిలేశానని పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత పాప ఆచూకీ తెలియదన్నాడు.

విశాల్‌: ఇప్పుడు తెలుసుకోచ్చు కదా

 

Also Read: కార్తీక్ ను తిట్టిన శ్రీధర్ – దీపను వెళ్లగొట్టేందుకు శ్రీధర్ ప్లాన్


 

నయనీ: ఖచ్చితంగా తెలియదు

విశాల్‌: ఎందుకని

నయనీ: ఎందుకంటే ఆ లెటర్‌ రాసింది నేను కాబట్టి...ఎందుకని మీరు అడగొద్దు. ఇందుకేనని నేను కూడా చెప్పను అనుమానాలే సమాధానాలు బాబుగారు.

 

హాసినీ, విశాల్‌, పవన్‌మూర్తి అంతా కలిసి చర్చించుకుంటారు. నయనీకి అనుమానం వచ్చిందని...మా అమ్మ పునర్జన్మ ఎత్తి ఎక్కడో ఒకచోట ఉందన్న విషయం మనలో ఒకరికి తెలిసి ఉంటుందన్న డౌట్‌ తనకు వచ్చిందంటాడు. ఆ లెటర్‌ రాసింది కూడా నయనీనే అని చెబుతాడు. దీంతో పవన్‌మూర్తి కళ్లుతిరిగి కిందపడిపోవడంతో అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు. నీళ్లు కొట్టి పైకి లేపి అడిగినా అతను ఏం చెప్పడు...ఇంతలోనే విక్రమ్‌ ఇవాళ ఇంట్లో వరలక్ష్మీ అమ్మవారి పూజ చేస్తానని చెప్పారు...ఎవరూ పట్టించుకోవడంలేదని గుర్తుచేస్తాడు. ఇవాళే పూజ చేద్దామని నయనీ అనడంతో పూజా సామాగ్రి ఏం తీసుకురాలేదని ఇంట్లోవాళ్లు చెబుతారు. ఇంతలోనే విశాల్ కల్పించుకుని ఆ ఏర్పాట్లు మేం చూస్తామంటూ విక్రాంత్ ను పిలవడంతో ఈరోజు ఏపిసోడ్‌ ముగుస్తుంది.

Also Read: ఎండీగా బాధ్యతలు తీసుకున్న రిషి – రంగాను బెదిరించిన శైలేంద్ర