Guppedanta Manasu  Serial Today Episode:  శైలేంద్రను అనుమానించిన దేవయాని, ఫణీంద్రకు ఫోన్‌ చేసి శైలేంద్ర గురించి అడుగుతుంది. దీంతో ఫణీంద్ర కాలేజీకి  రాలేదని బోర్డు  మీటింగ్‌ కూడా కంప్లీట్‌  అవ్వబోతుందని చెప్తాడు. దీంతో దేవయాని భయంతో మరి శైలేంద్ర ఎక్కడికి వెళ్లాడు. లెటర్‌ ఎందుకు పెట్టమన్నాడు అని అనుమానిస్తుంది. తన కొడుకు ఏదో ప్రమాదంలో ఉన్నాడని వెంటనే లెటర్‌ ఫోటో తీసి శైలేంద్రకు సెండ్‌ చేస్తుంది. మ‌రోవైపు బోర్డు మీటింగ్‌ నుంచి వెళ్లిపోయిన రిషిని కన్వీన్స్‌ చేసి మీటింగ్‌ కు తీసుకొస్తుంది వ‌సుధార. అక్కడ ఫ‌ణీంద్ర‌, మ‌హేంద్రతో పాటు మిగిలిన బోర్డ్ మెంబ‌ర్స్‌ కూడా రిషినే ఎండీ కావాల‌ని కోరుకుంటారు. కాలేజీని ఉన్న‌త స్థాయికి తీసుకెళ్లింది మీరే అంటూ రిషిని  పొగ‌డ్త‌లతో ముంచెత్తుతారు.


మహేంద్ర: అవును నాన్నా రిషి.. నువ్వు ఎండీ అయితే స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా ఫీలవుతారు. ఆ సీట్‌లో నువ్వు కూర్చోవ‌డ‌మే క‌రెక్ట్. 


అని అంద‌రూ బ‌తిమిలాడ‌టంతో  రిషి ఓకే అంటాడు. తాను ఎండీగా బాధ్యతలు తీసుకుంటానని ఒప్పుకుంటాడు. దీంతో అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు మహేంద్రే తన తండ్రి అని నిజం తెలుసుకున్న మను ఆవేశ పడుతుంటాడు.


శైలేంద్ర: వసుధార ఎండీ ప‌ద‌వికి రిజైన్ చేసి వెళ్లే ముందు రాసిన లెట‌ర్ ఇదే. నీ క్యాబిన్ నుంచి నేనే ఆ లెట‌ర్‌ను దొంగిలించాను.


    ఇంతలో దేవయాని, మ‌నుకు ఫోన్ చేస్తుంది.


దేవయాని: శైలేంద్ర‌ను నువ్వే కిడ్నాప్ చేశావని నాకు అర్థంమైంది. ప్లీజ్‌ మను నా కొడుకును వదిలేయ్‌. మహేంద్ర నీ తండ్రి అన్న విషయం మాకు వసుధార రాసిన లెట‌ర్ చ‌దివిన త‌ర్వాతే అర్థ‌మైంది.


మను: నాకు ఎప్పుడో తెలియాల్సిన నిజాన్ని మీరు అడ్డుకున్నారు. మీ వల్లే నేను ఎక్కువ మానసిక క్షోభను అనుభవించాను మేడం.


దేవయాని: మాకు తెలిసిన విష‌యం చెప్పాము. నువ్వు తేల్చుకోవాల్సింది మాతో కాదు...మ‌హేంద్ర‌తో...మీ అమ్మ‌తో..  మ‌హేంద్ర చేసిన ద్రోహానికి మేము ఏం చేయ‌గ‌లం.


మను: అయితే ఈ నిజం నాకు తెలిసిపోయిన సంగ‌తి ఎవ‌రికి చెప్పొదు. మ‌న ముగ్గురు మ‌ధ్య‌లోనే ఈ ర‌హ‌స్యం ఉండాలి. లేదంటే శైలేంద్ర‌ను వ‌దిలిపెట్ట‌ను.


 అని మను వార్నింగ్‌ ఇవ్వగానే సరేనని మేమిద్దరం నువ్వు ఏం చెబితే అదే చేస్తామని మాటిస్తారు. వెంటనే మను శైలేంద్రను విడిచిపెడతాడు. అయితే శైలేంద్ర వెళ్లిపోతూ.. ఈ సారి డీబీఎస్‌టీ కాలేజీ ఎండీగానే నిన్ను క‌లుస్తానంటూ ప్రగల్బాలు పలికి వెళ్లిపోతాడు. మరోవైపు కాలేజీ ఎండీగా బాధ్య‌త‌ల‌ను చేపట్టిన రిషి డాక్యుమెంట్స్‌ పై సంత‌కాలు పెడ‌తాడు. అప్పుడే శైలేంద్ర బోర్డ్ మీటింగ్ రూమ్ లోప‌లికి ఎంట్రీ ఇస్తాడు.


శైలేంద్ర: సారీ కొంచెం ఆల‌స్యంగా మీటింగ్‌కు వ‌చ్చాను. ఇప్పుడు కాలేజీ ఎండీని అనౌన్స్‌ చేయండి.


ఫణీంద్ర: అదేంటి శైలేంద్ర కాలేజీ ఎండీగా రిషిని వ‌సుధార ప్రకటించింది. మళ్లీ అనౌన్స్‌ చేయమని చెప్తున్నావేంటి?


శైలేంద్ర: వ‌సుధార ఎండీని ఎలా ప్ర‌క‌టిస్తుంది. డాడ్‌. అయినా వాడేంటి? ఎండీ ఏంటి? అస‌లు వాడు..


   అంటూ నిజం చెప్పబోతూ ఆగిపోయిన శైలేంద్ర మళ్లీ బోర్డు మీటింగ్‌ జరగాలని పట్టుబడతాడు. దీంతో ఫణీంద్ర, శైలేంద్రను తిట్టి రిషి ఈ కాలేజీ ఎండీ అని చెప్పి అందరూ వెళ్లిపోతారు. తర్వాత శైలేంద్ర కోపంతో ఓరేయ్‌ రంగా ఎంత పని చేశావురా అని తిట్టబోతుంటే.. రిషి రివర్స్‌ లో శైలేంద్రను తిడతాడు. అందరూ కలిసి నన్నేం చేయాలని చూస్తున్నారు అంటూ ప్రశ్నిస్తాడు. ఒక నెల నటిస్తే చాలు అన్నారు. ఇప్పుడేమో కాలేజీ ఎండీని చేశారు. కొంపదీసి నన్ను చంపేయాలని ప్లాన్‌ చేయలేదు కదా అంటూ అనుమానించినట్లు మాట్లాడతాడు రిషి. దీంతో శైలేంద్ర షాక్‌ అవుతాడు.   


   అయినా వ‌సుధార నిన్ను ఎండీగా ప్ర‌క‌టిస్టే  ఎలా ఊరుకున్నావ‌ని రిషిని అడుగుతాడు శైలేంద్ర‌. నాకు ఎండీ ప‌ద‌వి చేప‌ట్ట‌డం ఇష్టం లేద‌ని చెప్పి మీటింగ్ రూమ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని, కావాలంటే ఏం జ‌రిగిందో మీ నాన్న‌ను అడిగి తెలుసుకొండని చెప్తాడు రిషి. వసుధార వచ్చి తనను బెదిరించి ఎండీ పదవి ఇచ్చిందని రిషి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.