Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode : జయదేవ్‌ తనలో తాను మాట్లాడుకుంటూ... భగవంతుడా.. ఏమీ కానీ లక్కీని మిత్రకు కూతురుని చేశావు. సొంత కొడుకును అసలు కొడుకు అని తెలియకుండా చేశావు. చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న బంధాలను ఎప్పుడు ఒక గూటికి చేరుస్తావో ఏంటో అంటూ బాధపడుతూ వెళ్లిపోతాడు. 


కట్ చేస్తే... కూరగాయలు కొంటున్న భాస్కర్‌ను మనీషా మనుషులు గుర్తిస్తారు. వెంటనే ఫొటోలు తీసి మనీషాకు పంపిస్తారు. ఫొటోలు చూసిన మనీషా వివరాలు అడిగి తెలుసుకుంటుంది. ఫాలో అవుతూ లొకేషన్ షేర్ చేయాలని చెప్పి అక్కడి నుంచి బయల్దేరబోతోంది మనీషా. 


ఇంతలో అక్కడకు వచ్చిన దేవయాని, ఎక్కడికో బయల్దేరుతున్నావని ఆరా తీస్తుంది. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలకు వెతకడానికి, కొన్ని రహస్యాలు అందరికీ చూపించడానికి అని మొహం చిట్లిస్తుంది.  


దేవయాని: ఏదో గట్టి ప్లాన్ మీద వెళ్తున్నావే...
మనీషా: అవును అంటీ... నాకు ఉన్న నమ్మకాలు అుమానాలు నాలో ఉండిపోతే ఎలా ఫలితాలు నా చుట్టూ ఉన్న వాళ్లకీ తెలయాలి కదా.. అందరికీ కనిపించని గుట్టు రట్టు చేసే వరకు నిద్రపట్టడం లేదు.  
దేవయాని: ఇంతకీ ఏ రహస్యం ఛేదించాలనుకుంటున్నావ్‌? 
మనీషా: చెబితే పనులు కావడం లేదు ఆంటీ, చేశాకే చెబుతాను 
దేవయాని: సరే అయితే 
మనీషా: నేనే వెళ్తాను 
దేవయాని:మనిషా ప్రతి పనికి నన్నే తీసుకెళ్తుంది.. ఇప్పుడు ఎందుకు ఒంటరిగా వెళ్తోంది. దేని గురించి ఇంత సీరియస్‌గా ఆలోచిస్తోంది. 


తన మనుషులు పంపించిన భాస్కర్‌ ఉండే లొకేషన్‌కు మనీషా బయల్దేరుతూ తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది.
ఇంతలో రౌడీలు తనను ఫాలో అవుతున్నారని గ్రహించి భాస్కర్ పరిగెత్తబోతాడు. కానీ ఎదురుగా కారులో వస్తున్న మనీషా ఢీ కొట్టి అతన్ని కందపడేసి కిడ్నాప్ చేసి కట్టి పడేస్తుంది. 


భాస్కర్‌: ఎందుకు కట్టేశారు, మీకు ఏం కావాలి
మనీషా: నీకు తెలిసిన రహస్యాలు చెప్పాలి. అది బయటపెట్టేస్తే బతికిపోతావ్‌. కొంత కాలం చెల్లిలిగా ఉంది ఎవరు?, బస్ యాక్సిడెంట్‌లో నీ భార్యను కాపాడింది ఎవరు?, మిత్ర చేతిలో బిడ్డను పెట్టి పారిపోయింది ఎవరు? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం లక్ష్మి. అవునా కాదా?. 


భాస్కర్‌: మేడం మీరు ఏమన్నా అనుకోండి నేను చెప్పను. 
మనీషా: నాకు ఉన్న అనుమానాలు మిత్రతోనే తేల్చుకుంటా. వర్షాలు పడుతున్న టైంలో చెమటలు పడుతున్నాయంటే నేను చెప్పింది నిజమే కదా. ఇవన్నీ మిత్రకు చెప్పమంటావా ?
వద్దని వారించిన భాస్కర్‌... బస్ యాక్సిడెంట్‌లో తనకు దొరికింది లక్ష్మీయే అని ఒప్పుకుంటాడు. కొంతకాలం చెల్లిలిగా ఉంది కూడా ఆమె అంటాడు. ఇప్పుడు మిత్ర కూతురులా పెరుగుతున్న లక్కీ కూడా సొంత కూతురే అని బాంబు పేలుస్తాడు. 


మనీషా: అనాథలా మిత్ర చేతికి వచ్చిన లక్కీ మిత్ర కూతురే అన్నమాట. 
భాస్కర్: అవును 
మనీషా: ఇప్పుడు లక్ష్మీ ఎక్కడ ఉంది?
భాస్కర్: ఆరోజు ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పాపెట్టకుండా లక్ష్మీ ఎటూ వెళ్లిపోయింది మేడం


అసలు విషయం తెలుసుకొని ఇంటికి కోపంగా వస్తుంది మనీషా. ఇంతలో దేవయానికి ఎదురు పడి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంది. 


లక్కీయే మిత్ర కూతురని దేవయానికి మనీషా చెప్పేస్తుంది. 


ఆమె కూడా నమ్మలేకపోతుంది... ఇంతపెద్ద ట్విస్ట్‌ను అసలు ఊహించలేదని అంటుంది దేవయాని. 


లక్ష్మీకి తనకు కూతురు పుట్టిందని కూడా తెలియదని మరో షాక్ ఇస్తుంది మనీషా. {ఒకే కాన్పులో ఇద్దరు బిడ్డలు పుట్టారని మొదటి పుట్టిన మగబిడ్డను తీసుకొని వెళ్లిపోయినట్టు నర్సు చెప్పిన విషయం గురుచేస్తారిక్కడ} 


కుమార్తె పుట్టినట్టు తెలియని లక్ష్మీ... ఇప్పుడు సంయుక్త రూపంలో ఎందుకు వచ్చిందని అనుమానం పడుతుంది. లక్కీ తయారు చేసుకున్న ఫ్యామిలీ ట్రీలో తన ఫొటో ఎందుకు పెట్టిందని సందేహిస్తుంది. 


ఎవరు అవునన్నా కాదాన్నా లక్ష్మీ, సంయుక్త ఒకరే అని నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తుంది మనీషా...


అన్నీ పక్కన పెడితే లక్కీ తన సొంత కూతురని మిత్రకు తెలిస్తే వారిని ఎవరూ విడదీయలేరని అంటుందని దేవయాని... 


మనీషా: అవును ఆంటీ... అందుకే అది తెలిసేలోపే లక్కీని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తాను 


ఆ మాట విన్న దేవయాని షాక్‌లో ఉంటుంది. ఇంతలో సంయుక్త వారిద్దరి డిస్కషన్స్‌ చూసి వస్తుంది. 


ఏంటి అంత వితంగా చూస్తున్నావని మనీషాను సంయుక్త ప్రశ్నిస్తుంది. కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు ఇలా కొత్తగానే ఉంటారని అంటుంది. 


సంయుక్త: అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు. 


ముందు ముందు నీకే తెలుస్తుంది సంయుక్త అని నొక్కి చెబుతుంది. 


మనిషా ప్రవర్తనలో ఏదో తేడా ఉందని అనుకుంటుంది. మరింత జాగ్రత్తగా ఉండాలని... ఆమె వద్ద ఉన్న వీడియో కూడా దక్కించుకోవాలని అనుకుంటుంది. మారువేషంలోనే ఆమెతో పారాడాలని భావిస్తుంది. 


సీన్ ఇప్పుడు దీక్షితుల ఆశ్రమానికి చేరుతుంది. 


దీక్షితుల వద్దకు వచ్చిన జయదేవ్‌... అరవింద గురించి ఆరా తీస్తాడు. అక్కడ పరిస్థితులకు దూరంగా వచ్చినా ఇక్కడ ప్రశాంతతకు దగ్గర కావడం లేదని ఆయన చెబుతాడు. 


ఆమె వద్దకు వెళ్లిన జయదేవ్‌... రెండు జీవితాలకు అన్యాయం జరుగుతుంటే చూడలేక వచ్చేశావు... అలా వచ్చేస్తే వాళ్లకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నిస్తాడు. 


తన పెద్దరికంతో ఏం చేయలేనప్పుడు వచ్చేయడమే మంచిదని భావించి వచ్చేశాను అనుకుంటుంది. 


వివేక్ పెళ్లి ఆగిపోయందని చెబుతాడు. లక్ష్మీ వచ్చి పెళ్లి ఆపేసిందని ఫ్లోలో చెప్పేస్తాడు. దీనికి అరవింద షాక్ అవుతుంది. లక్ష్మీ తిరిగి వచ్చేసిందా అని అడుగుతుంది. 


ఓహో అనుకున్న తర్వాత మాట మార్చి పెళ్లి ఆపింది సంయుక్త అని... ఇద్దరూ ఒకేలా ఉంటారు కాబట్టి ఫ్లోలో లక్ష్మీ అని వచ్చిందని కవర్ చేస్తాడు. 


లక్ష్మీ పేరు వినగానే చాలా ఆనందంగా ఉందని... పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉందని అంటుంది. 


సరేగానీ బయల్దేరదామని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. 


ఏదో చెడు జరుగబోతోందని దీక్షితులు అనుకుంటాడు. మిత్రను కిడ్నాప్ చేసే విజువల్స్ ఆయన కళ్ల ముందు కదలాడుతాయి. ఈ విషయాన్ని జయదేవ్, అరవిందను పిలిచి వివరిస్తాడు. వెంటనే ఇంటికి వెళ్లిపోమంటాడు. మిత్రపైకి మరో గండం దండెత్తి రాబోతోందని షాక్ ఇస్తాడు.  


Also Read: విజ‌య్ ‘ది గోట్’ మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్, ట్రైలర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన మేకర్స్


Also Read: ఆయ్ రివ్యూ: ఎన్టీఆర్ బావమరిది సినిమా - ఈ వీకెండ్ విన్నర్ ఇదేనా?