Guppedanta Manasu  Serial Today Episode: కాలేజీ బోర్డు మీటింగ్‌లో కొత్త ఎండీని నేనే అనౌన్స్‌ చేస్తాను అంటుంది. మరోవైపు తనను కిడ్నాప్‌ చేసిన మనును శైలేంద్ర బతిమాలుతాడు. ఎన్నో రోజులుగా కలలు  కంటున్న ఎండీ సీటు తనకు దక్కే టైంలో ఇలా తనను కిడ్నాప్‌ చేయడం బావ్యం కాదని రిక్వెస్ట్‌  చేస్తాడు. గతంలో నేను చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించి వదిలిపెట్టమని ప్రాధేయపడతాడు. దయచేసి నీ కాళ్లు మొక్కుతాను నన్ను వదిలిపెట్టు అంటూ దీనంగా అడుగుతాడు శైలేంద్ర. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్‌ చేశావు. నీకేం కావాలి అని అడుగుతాడు శైలేంద్ర.


మను: నా ప్ర‌శ్న‌కు స‌మాధానం కావాలి. నా క‌న్న తండ్రి ఎవ‌రు? అత‌డి పేరేంటి?


శైలేంద్ర: నీ తండ్రి గురించి, అత‌డి బ‌యోడేటా గురించి పూర్తిగా తెలుసు నాకు. కానీ నేను చెప్పను. ఏం చేసుకుంటావో చేసుకో...న‌న్ను వ‌దిలిపెట్టక‌పోయినా ప్రాబ్లం లేదు.


మను: నువ్వు బోర్డ్ మీటింగ్‌లో ఉంటేనే క‌దా నిన్ను ఎండీగా ప్రకటించేది.


శైలేంద్ర: ఈ శైలేంద్ర విల‌నిజాన్ని అంద‌రూ త‌క్కువ‌ అంచ‌నా వేస్తున్నారు. నేను అక్క‌డ ఉన్నా లేక‌పోయినా ఎండీగా ప్ర‌క‌టించేది నా పేరే


మను: అవునా...అదే విష‌యం ఇప్పుడే మీ డాడీకి ఫోన్ చేసి క‌నుక్కుందాం.


 అని మను, శైలేంద్ర ఫోన్‌ తీసుకుని ఫణీంద్రకు కాల్ చేస్తాడు. దీంతో శైలేంద్ర కంగారుగా ఎండీగా రిషి తన పేరు ప్రకటించాడా అని అడుగుతాడు. అయితే రిషి నీ పేరు చెప్పలేదని వసుధారే స్వయంగా ఎండీని తానే ప్రకటిస్తానని చెప్పిందని ఫణీంద్ర చెప్పి కాల్‌ కట్‌ చేస్తాడు. ఇక ఇక్కడే ఉంటే తన కల ఎప్పటికీ నెరవేరదని శైలేంద్ర బాధపడుతూ మను తండ్రి ఎవరనే నిజాన్ని బ‌య‌ట‌పెడ‌తాడు. మా బాబాయ్‌ మహేంద్రే నీ తండ్రి అని ఫణీంద్ర చెప్పినా మను నమ్మడు. ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి శైలేంద్ర నాటకం ఆడుతున్నాడని గన్‌  తీసి శైలేంద్రకు ఎయిమ్‌  చేస్తాడు. మరోవైపు బోర్డు మీటింగ్‌లో వసుధార కాలేజీ ఎండీగా రిషిని ప్రకటిస్తుంది. రిషి మాత్రం అందుకు ఒప్పుకోకుండా మీటింగ్‌ నుంచి వెళ్లిపోతాడు. అందరు షాక్‌ అవుతారు. అయితే రిషిని నేను కన్వీన్స్‌ చేస్తానని వసుధార అందరికి చెప్తుంది. మరోవైపు మనుకు నీ కన్న తండ్రి మహేంద్ర అని దానికి సాక్ష్యం ఉందంటూ దేవయాని ఫోన్‌ చేస్తాడు.


దేవయాని: ఎండీ అయిపోయినందుకు కంగ్రాట్స్‌ నాన్నా.. నువ్వు ఎండీ అయితే కళ్లారా చూడాలనుకున్నాను. అందుకోసం బోర్డు మీటింగ్‌ కు వస్తానంటే మీ నాన్నే ఒప్పుకోలేదు.


శైలేంద్ర: మామ్‌ అది సరే కానీ వసుధార, మనుకు రాసిన లెటర్‌ ఫోటో తీసి నాకు సెండ్‌ చేయ్‌..


దేవయాని: ఆ లెటర్‌ ఇప్పుడెందుకు నాన్నా..?


 అని దేవయాని అడగడంతో శైలేంద్ర ఏం చెప్పాలో అర్థం కాక అలాగే  ఉండిపోతాడు. మరోవైపు బోర్డు మీటింగ్‌ నుంచి మధ్యలో వెళ్లిపోయిన రిషి దగ్గరకు వసుధార వెళ్లి కాలేజీ ఎండీ నువ్వు ఉంటేనే బాగుంటుందని చెప్తుంది. అయితే తనను అడగకుండా నిర్ణయం ఎలా తీసుకుంటావని రిషి ప్రశ్నిస్తాడు. అయినా వసుధార ఎలాగోలా రిషిని కన్వీన్స్‌ చేస్తుంది. మరోవైపు శైలేంద్రను అనుమానించిన దేవయాని, ఫణీంద్రకు ఫోన్‌ చేసి శైలేంద్ర గురించి అడుగుతుంది. దీంతో ఫణీంద్ర కాలేజీకి  రాలేదని బోర్డు  మీటింగ్‌ కూడా కంప్లీట్‌  అవ్వబోతుందని చెప్తాడు. దీంతో దేవయాని భయంతో మరి శైలేంద్ర ఎక్కడికి వెళ్లాడు. లెటర్‌ ఎందుకు పెట్టమన్నాడు అని అనుమానిస్తుంది.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.