Prema Entha Madhuram Serial Today Episode: రాకేష్ పంపించిన మేనేజర్‌ను వాడి మనుషులను ఫంక్షన్ హాల్ నుంచి తరిమేసి తర్వాత జెండే, యాదగిరి, ఆయన భార్య అకి దగ్గరకు వస్తారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్లావు ఫ్రెండ్ అని అకి అడుగుతుంది. ఒక ఫ్రెండ్ కలిస్తే మాట్లాడి వస్తున్నాను అని చెప్తాడు జెండే. ఇంతవరకు నీకు నచ్చిన వాళ్లు ఎవరైనా వచ్చారా అకి అని అడగ్గానే లేదని నీరసంగా చెప్తుంది అకి. అయితే మేము ఈ క్షణం కోసమే ఎదురుచూస్తున్నాము అని యాదగిరి చెప్తాడు. ఇంతలో స్టేజి మీదకు గౌరి, శంకర్ వస్తారు. వాళ్లను చూసిన అకి ఎమోషనల్‌గా ఫీలవుతుంది. ఆనందంతో ఏడుస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతూ వాళ్లను కలవడానికి స్టేజీ దగ్గరకు వెళ్లబోతుంటే జెండే అపుతాడు.
జెండే: అకి నో నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోవగలను తల్లి. కానీ నువ్వు అసలు రియాక్ట్ అవ్వకు.
అకి: ఎంటి ఫ్రెండ్ ఎదురుగా అమ్మానాన్నలను చూసి కూడా
జెండే: అకి ఫ్లీజ్
యాదగిరి: సార్ చెప్పిన మాట వినమ్మా.. నీకు వివరాలన్నీ తర్వాత చెప్తాం.. ఇప్పుడు మాత్రం కాస్త మౌనంగా ఉండు.
జెండే: కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంటిన్యూ ద ఫ్రోగ్రాం..
అనగానే అకి ఎమోషనల్ గా ఫీలవుతూనే ఫ్రోగ్రాం కంటిన్యూ చేస్తుంది.
అకి అడిగిన భార్యాభర్తల మధ్య ప్రేమ గురించి అడుగుతుంది. దానికి శంకర్ మొదటి తడబడతాడు. ఏదేదో చెబుతుంటే అందరూ ఆశ్యర్యంగా చూస్తుంటారు. ఇంతలో శంకర్ కు పోయిన జన్మలో అనును ప్రేమించిన విషయం గుర్తుకు వచ్చి గత జన్మలో తాను గౌరిని ఎలా ప్రేమించింది చెప్తాడు. దీంతో జెండే, అకి, యాదగిరి షాక్ అవుతారు. శంకర్ మాటలకు గౌరి ఆశ్యర్యంగా చూస్తుంది.
అకి: గౌరి గారు ఈ ప్రశ్న మీకు మీది ప్రేమ వివాహం కదా పెద్దలు అంత ఈజీగా పెళ్లికి ఒప్పుకొని ఉండరు. మీరెలా ఒప్పించారు. మీ ప్రేమకు కారణం ఏంటి?
శంకర్: ఈవిడ బడ్జెట్ గురించి అడిగితే చెప్తుంది కానీ ప్రేమ గురించి ఏం చెప్తుంది. గౌరి గారు ఏదో విధంగా గట్టెకించండి.
గౌరి: ప్రేమ అంటే పెళ్లి, పెళ్లి అంటే ప్రేమ
అంటూ గౌరి కూడా ఏదేదో చెప్తుంటే అప్పుడే గౌరికి కూడా గత జన్మలో జరిగిన విషయాలు గుర్తుకు వచ్చి పెళ్లి గురించి చాలా బాగా మాట్లాడుతుంది. దీంతో అకి, జెండే, యాదగిరి చాలా ఎమోషన్ అవుతారు. శంకర్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. గౌరి మాటలకు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టగానే గౌరి షాక్ అవుతుంది.
శంకర్: ఈవిడ అసలు గౌరిగారేనా..? ఏదో పుస్తకంలో కాపీ కొట్టి ఉంటుంది.
జెండే: చూశావా యాదగిరి వాళ్ల ప్రేమకు చావు లేదు.
అకి: కంగ్రాచ్చులేషన్స్ మిస్టర్ అండ్ మిస్ గౌరి, శంకర్.. మీరే విన్నర్స్..
అని అకి స్టేజి మీదకు వెళ్లి చెప్పగానే శంకర్, గౌరి హ్యాపీగా ఫీలవుతారు. జెండే కూడా కంగ్రాట్స్ చెప్తాడు. అకి… గౌరి, శంకర్ లను తదేకంగా చూస్తుంటే
శంకర్: ఏంటమ్మా అలా చూస్తున్నావు. మమ్మల్ని గుర్తు పట్టలేదా? ఆరోజు నిన్ను రౌడీల నుంచి కాపాడింది మేమే
గౌరి: తనకి మన పిండి ముఖాలు ఎక్కడ గుర్తు ఉంటాయి.
జెండే: నీకు ఆరోజు చెబుదామనుకున్నాను అకి కానీ ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్.
అని చెప్పగానే అకి ఎమోషన్‌గా గౌరి, శంకర్ లను చూస్తుంది. ఇంతలో విన్నర్స్ ఇచ్చే కప్ అకి చేతుల మీదుగా ఇస్తుంది. తర్వాత రాకేష్ టెన్షన్ పడుతుంటే మేనేజర్ ఫోన్ చేసి అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు. మీ గురించి ఏం చెప్పలేదని చెప్తాడు. తర్వాత అభయ్ దగ్గరకు వెళ్లిన రాకేష్ ఫేక్ కపుల్స్ ను విన్నర్స్ గా ప్రకటించారని అది గ్రేట్ ఆర్యవర్థన్ పేరు చెడగొట్టిన వాళ్లు అవుతున్నారు అంటూ అభయ్‌ని రెచ్చగొడతాడు రాకేష్. మరోవైపు విన్నర్స్ ఫ్రైజ్, మనీ చూసుకుని గౌరి, శంకర్ చాలా హ్యాపీగా ఫీలవుతుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిస్టర్ బచ్చన్ రివ్యూ: రవితేజతో హరీష్ శంకర్ మార్క్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?