Brahmamudi Serial Today Episode: రాజ్‌ ఒక్కడే ఇంటికి తిరిగి రావడంతో ఇంట్లో వాళ్లందరూ షాక్‌ అవుతారు. ఏమైందని అడుగుతారు. నువ్వు చెప్పినట్లే ఇద్దరిని రమ్మాన్నా కూడా వాడు రానన్నాడు పిన్ని. తన కోసమే నువ్వు అలా చెప్పి ఉంటావని అనుమానించాడు అని రాజ్‌ చెప్పగానే స్వప్న నిజమే కదా అంటుంది. రుద్రాణి ఏది నిజం అంటూ కోప్పడుతుంది. అసలు వాడికి ఏమైంది అని ప్రకాశం బాధపడతాడు.


ఇందిరాదేవి:  అనుభవం అయింది. ఇంట్లో అనామిక వల్ల జరిగిందంతా గుణపాఠం అయింది. ఇంకొకరి జోక్యం వల్ల భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు వస్తాయో తెలిసొచ్చింది. ఈ ధాన్యలక్ష్మీ, రుద్రాణి ఎలా కాల్చుకుతింటారో అర్థమైంది.


ధాన్యలక్ష్మీ: అనామిక సంగతి వదిలేయండి. ఆ పిల్ల తన ప్రవర్తనతోనే కాపురం నాశనం చేసుకుంది. కానీ, అప్పును కళ్యాణ్‌ ప్రేమిస్తున్నాడని అనామిక చెప్పిందే నిజం అయింది.


అపర్ణ: ఇప్పుడు ఆ దరిద్రం గురించి ఎందుకు. అనామిక ప్రవర్తనపై ధాన్యలక్ష్మీకి ఇంకా సానుభూతి ఉన్నట్లుంది.


ఇందిరాదేవి: అసలు వాడు ఏ కారణం చెప్పి రానన్నాడో అది చెప్పు రాజ్‌.


రాజ్‌: పిన్ని అప్పును కోడలిగా ఒప్పుకుని రమ్మందా? అని అడిగాడు. పిన్ని నాతో ఆ మాట చెప్పలేదు. అప్పును కోడలిగా ఒప్పుకుంటేనే వస్తానన్నాడు.


రుద్రాణి: అంటే ఏంటీ ఇప్పుడు ధాన్యలక్ష్మీ, అప్పు కాళ్లు పట్టుకుని రామ్మా మహాలక్ష్మీ అంటేనే వస్తారా?


ధాన్యలక్ష్మీ: ఏంటీ రాజ్ నేనిప్పుడు వెళ్లి అప్పు కాళ్లు పట్టుకోవాలా?


 అనగానే స్వప్న ధాన్యలక్ష్మీని తిడుతుంది. రాజ్‌ ఏం చెప్పాడు మీరే అంటున్నారు అంటుంది. రాజ్‌ చెప్పిన దాంట్లో అర్థం అదే వస్తుంది కదా అంటుంది రుద్రాణి. నేను అలా చెప్పలేదు కదా అంటాడు రాజ్‌. రుద్రాణిపై సీరియస్‌ అవుతాడు రాజ్‌. అప్పు ఒక్కమాట మాట్లాడలేదని అంతా కళ్యాణే చెప్పాడని రాజ్‌ చెప్పడంతో ధాన్యలక్ష్మీ ఇరిటేటింగ్‌ ఫీలవుతుంది. కనకం బిడ్డలు అనుభవించడానికే ఈ ఆస్థులు కూడబెట్టినట్లుంది అంటూ ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. మరోవైపు కల్యాణ్ జాబ్‌ కోసం వెతుకుతుంటాడు. తర్వాత కళ్యాణ్‌ తీసుకొచ్చేందుకు రుద్రాణి, ధాన్యలక్ష్మీ వెళ్తారు.


ధాన్యలక్ష్మీ: ఇప్పుడెళ్లి మనం రమ్మని  అడిగితే వాళ్లు వస్తారా?


రుద్రాణి: వస్తాడని కాదు. కానీ కల్యాణ్ పడే కష్టం చూసైన సరే నువ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటావని ఈ ప్రయత్నం.


  మరోవైపు ఓ ముసాలయన బొమ్మలు అమ్ముతుండటం చూసి కళ్యాణ్‌ ఆ ముసలాయనకు సాయం చేసేందుకు ఆ బొమ్మలు అమ్మిస్తానని తీసుకుని కళ్యాణ్  బొమ్మలు అమ్ముతుంటాడు. కళ్యాణ్‌ బొమ్మలు అమ్మడం చూసి రుద్రాణి, ధాన్యలక్ష్మీ షాక్‌ అవుతారు. ధాన్యలక్ష్మీ, కళ్యాణ్‌ దగ్గరకు వెళ్లబోతుంటే రుద్రాణి అపుతుంది.


రుద్రాణి: చూడు ధాన్యలక్ష్మీ ఈ సిచ్యుయేషన్‌లో నువ్వు వెళ్లి పిలిచినా వాడు రాడు. కోట్ల వారసుడు రోడ్డు మీద బొమ్మలు అమ్ముకునే స్థితికి దిగజారిపోయాడు. రాజ్ మాత్రం దర్జాగా ఆఫీసుకు వెళ్తున్నాడు. వెళ్లి ఇంట్లో వాళ్లను నిగ్గదీసి అడుగు.  


 అంటూ రుద్రాణి రెచ్చగొట్టేసరికి ధాన్యలక్ష్మీ కోపంగో రగిలిపోతుంది. నా కొడుకును రోడ్డు మీదకు తీసుకొచ్చిన ఆ కావ్య, రాజ్‌లను ఊరికే వదలను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత బొమ్మలన్నీ అమ్మిన కళ్యాణ్‌ డబ్బులు తీసుకెళ్లి ఆ ముసలాయనకు ఇస్తాడు. ఆయన కళ్యాణ్‌ను థాంక్స్‌ చెప్తాడు. తర్వాత రాజ్‌, కావ్య వాదులాడుకుంటారు.


కావ్య: రండి మీకోసం చూస్తున్నాను మొదలుపెట్టండి. నా వల్లే వాళ్లు రాలేదని..


రాజ్‌: వెటకారమా. అతి తెలివి చూపించకు. అన్నింటికి కారణం నువ్వే


కావ్య: మీరెందుకు ఒప్పించలేకపోయారు. మీ లక్ష్మణుడు మీ మాట ఎందుకు వినలేదు. మీ పిన్ని చెప్పగానే పెదరాయుడు స్టైల్‌లో వెళ్లారు. మరి ఎందుకు రాలేదు..?


రాజ్‌: ఏ నీకు తెలియదా.. నీలా నంగనాచి మాటలు నాకు మాట్లాడటం రాదే.


అంటూ ఇద్దరూ కళ్యాణ్‌, అప్పుల కోసం గొడవపడతారు. తర్వాత కళ్యాణ్‌ రోడ్డుమీద బుక్స్ అమ్మే వ్యక్తి దగ్గరకు వెళ్లి అక్కడ తన బుక్‌ ఉండటం చూసి హ్యాపీగా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.