Karthika deepam 2 Serial Today Episode:


సుమిత్ర కోపంగా జ్యోష్న ను కొట్టుబోతుంది. ఇంతలో దీప అక్కడకి రావడంతో ఆగిపోతుంది. ఎందుకు అనవసరంగా గొడవ చేస్తావని పారిజాతం అంటే ఇది ఇలా తయారు అవడానికి కారణం మీరేనని సుమిత్ర అంటుంది.


గ్రాని: అవును నీ కూతురు విషయంలో నేను తప్పు చేశాను.


జ్యోష్ట్న: గ్రానీ నువ్వు ఎందుకు తప్పు ఒప్పుకుంటున్నావు.


పారిజాతం: నువ్వు ఇక మాట్లాడకు నువ్వు  ఇంటికి తాళం వేయడంతో దీప ఎంత బాధపడిందో తెలుసా?


సుమిత్ర: నువ్వు తాళం వేయకుండా వెళ్లిపోయావని నేనే వేయమన్నాను.


దీప: నేను అంతా చూశాను. విడాకులు వచ్చిన తర్వాత నా తల మీద ఉన్న బరువు మొత్తం దిగిపోయింది.


సుమిత్ర: కానీ జ్యోత్స్న ఇంకా మోస్తూనే ఉంది. తొందర్లోనే తను అర్థం చేసుకుంటుంది. అవును ఇంతకీ  శౌర్య ఏది?


దీప: తను అడిగింది కొనివ్వలేదని అలిగి బయట కూర్చుంది.


అని చెప్తుంది. తర్వాత కార్తీక్ ఫోటోను జ్యోత్స్న, శ్రీధర్ కు పంపిస్తుంది. శ్రీధర్ ఆవేశంగా కొడుకును తిడతాడు. ఫోటో చూపించి దీనికి ఏం సమాధానం చెప్తావని అడుగుతాడు. ఫోటో జ్యోత్స్న పంపించిందని తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత కూడా ఇంత అనుమానం ఉండకూడదని అంటాడు.


శ్రీధర్‌:  జ్యోష్ట్న చిన్న పిల్ల అన్ని తెలిసి.. నేనే నిన్ను అనుమానిస్తున్నాను. ఇంతకీ ఆ పాపకు నువ్వెందుకు తిపించావు.  


కార్తీక్‌: పాపకు ఆకలేస్తుందని సుమిత్ర అత్త తీసుకెళ్లమంటేనే తీసుకెళ్ళాను.


శ్రీధర్‌: అయినా ఆ పాప మీద జాలి చూపించడానికి నువ్వు ఎవరు?


కార్తీక్‌: మనిషిని నేను..  గుడిలో జరిగిన ప్రమాదంలో అత్త చనిపోయి ఉంటే ఇప్పుడు మన కుటుంబం ఇలా ఉండేదా? అత్తను కాపాడేందుకు దీపలో ఏ మానవత్వం ఉందో శౌర్యను  నరసింహ నుంచి కాపాడేందుకు నాలోనూ అదే మానవత్వం ఉంది.


 అని కార్తీక్‌ చెప్పగానే శ్రీధర్‌ చూస్తుండిపోతాడు. ఫోటో పంపించిన వాళ్ళకు చెప్పు మనసుతో ఆలోచించమని అని కార్తీక్‌ చెప్పగానే దీపతో ముందు అవుట్ హౌస్ ఖాళీ చేయిస్తే కానీ దరిద్రం వదిలిపోదని శ్రీధర్ మనసులో అనుకుంటాడు. తర్వాత దీప తండ్రి ఫోటో ముందు దీపం వెలిగించి తన బాధను చెప్పుకుంటుంది. నీ అక్క కొడుకు అని నాకు ఇచ్చి పెళ్లి చేశావు కానీ వాడు చేసిన పనులు చూస్తే నువ్వే వాడిని  చంపేసేవాడివి నాన్న అంటూ ఎమోషనల్‌ గా ఫీలవుతుంది.  


  మరోవైపు పారిజాతం కొడుకుని తలుచుకుని బాధపడుతుంది. దాసు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు నన్ను కలవకుండా ఎందుకు ఉన్నాడని అనుకుంటుంది. గతంలో చేసిన తప్పును గుర్తు చేసుకుంటుంది. అప్పుడే దాసు తల్లి దగ్గరకు వస్తాడు. కొడుకును చూసి చాలా ఎమోషనల్ అవుతుంది.


పారిజాతం: ఉన్నట్టుండి ఫోన్ కూడా చేయకుండా ఎందుకు వచ్చావు.


దాసు: నా కూతురు కోసం వచ్చాను అమ్మా..


పారిజాతం: నీ కూతురా?


దాసు: అవును నా కూతురు కోసమే వచ్చాను.


పారిజాతం: నిజాలన్నీ నేను సమాధి చేసిన తర్వాత ఎలా తెలిసింది


( అని మనసులో అనుకుంటుంది పారిజాతం)


 అయితే నువ్వు బిడ్డలని మార్చిన విషయం నాకు తెలుసని.. నాకు తెలుసనే విషయం నీకు తెలియదు. అని మనసులో అనుకుని ..  దశరథ కూతురు బతికే ఉంది. ఇప్పుడు నేను వచ్చింది నా కూతురు కోసమే అని పారజాతంతో అంటుడు దాసు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రోడ్డు మీద బొమ్మలు అమ్మిన కళ్యాణ్ – ఇల్లు తగులబెట్టేందుకు రెడీ అయిన ధాన్యలక్ష్మీ