Actress Pavithra Jayaram Daughter Comments Actor Chandu Death: సీరియల్‌ నటి పవిత్ర జయరాం ఇటీవల కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మత్రిని జీర్ణించుకోలేకపోయిన ప్రియడు, నటుడు చంద్రకాంత్‌ అలియాస్‌ చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియురాలి మరణంతో తీవ్ర దిగ్భ్రాంతిలోకి వెళ్లిన చందు ఆత్మహత్యకు ముందు ఆమె తలుచుకుంటూ సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ అయ్యాడు. ఆమె ఫోటోలు షేర్‌ చేస్తూ దిగ్భ్రాంతికి గురయ్యాడు. అయితే వీరిద్దరి మరణం తర్వాత వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్‌ విషయాలు బయటకు వచ్చాయి. అంతేకాదు పవిత్ర జయరాంపై చందు తల్లి, భార్య సంచలన ఆరోపణలు కూడా చేశారు.


ఇద్దరికి వేరు వేరుగా పెళ్లి అయినా త్రినయని సీరియల్‌తో కలిశారని, అప్పటి నుంచి ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరు ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నారని చందు భార్య మీడియాకు వెల్లడించింది. తమది ప్రేమ వివాహమని, పదకొండేళ్లు అన్యోన్యంగా ఉన్న తమ కాపురంలో పవిత్ర జయరాం చిచ్చు పెట్టిందని, తనవల్లేతమ వైవాహిక జీవితంలో కలతలు మొదలయ్యాయని చెప్పింది. దీంతో అప్పటి నుంచి పవిత్ర జయరాం, చందు రిలేషన్‌పై రకరకాలు పుకార్లు, కథనాలు వస్తున్నాయి. ఇక పవిత్ర జయరాం గురించి నెగిటివ్‌గా వస్తుండటంతో ఆమె కూతురు స్పందించింది. తన తల్లి గురించి ఏవేవో రాస్తున్నారని అవన్ని నిజం కాదని ఖండించింది. 


చందు అంకుల్ రోజూ ఫోన్ చేసేవారు


"మా అమ్మ,, చంద్రకాంత్‌ గురించి అందరు ఏవేవో రాస్తున్నారు. ఏమోమో మాట్లాడుకుంటున్నారు. అవన్ని నిజం కాదు. మా అమ్మ, చంద్రకాంత్‌ మంచి స్నేహితులు. తరచూ మా అమ్మకు ఫోన్‌ చేసేవారు. మా చదువుల గురించి కూడా మాట్లాడేవారు. మా చదుకోమని చెప్పేవారు. మా బాగోలు అడిగేవారు. మా అమ్మ చనిపోయినప్పుడు కూడా ఆయన పక్కనే ఉన్నారు. మా అమ్మ అంత్యక్రియలకు కూడా చందు హాజరయ్యారు" అంటూ పవిత్ర జయరాం కూతురు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఇక భర్త ఆత్మహత్య అనంతరం చందు భార్య శిల్ప.. పవిత్ర జయరాంపై సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేసింది.


Also Read: ప్రభాస్ 'కల్కి' ఈవెంట్‌కు అంతా రెడీ - 'బాహుబలి' సెంటిమెంట్, రికార్డు స్థాయిలో రానున్న ఫ్యాన్స్!


తన భర్త కంటే ముందు పవిత్రకు చాలా మందితో ఎఫైర్స్‌ ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసింది. చందు జీవితంలో పవిత్ర జయరాం వచ్చిన తర్వాత తన జీవితం నాశనమైందంటూ శిల్ప కన్నీరు పెట్టుకుంది. చందుతో తనది ప్రేమ వివాహం అయినప్పటికీ... పవిత్ర రాకతో భర్త తనను పూర్తిగా దూరం పెట్టారని కన్నీరుమున్నీరైంది. లాక్ డౌన్ సమయంలో చంద్రకాంత్, పవిత్ర జయరాం ఒక్కటి అయ్యారని పేర్కొంది. అప్పటి నుంచి తనకు భర్త నుంచి మెంటల్, ఫిజికల్ టార్చర్ మొదలైందంటూ వాపోయింది. 'త్రినయని' సీరియల్ చేసేటప్పుడు చందు, పవిత్ర ఒకరికొకరు పరిచయం అయ్యారని, ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి, వివాహేతర సంబంధానికి దారి తీసింది.