రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'కల్కి 2989 ఏడీ' (Kalki 2989 AD). టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ఇది. భైరవగా ప్రభాస్ క్యారెక్టర్, లుక్ ఆల్రెడీ పరిచయం చేశారు. ఇప్పుడు బుజ్జి (స్పెషల్ కార్)ను పరిచయం చేయడానికి రెడీ అయ్యారు. ఆ ఈవెంట్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేశారు.


'బాహుబలి' ఈవెంట్ జరిగిన చోటే!
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడం వెనుక కీలక పాత్ర 'బాహుబలి'ది. ఆ సినిమా ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. ఆ తర్వాత 'రాధే శ్యామ్' ఈవెంట్ కూడా అక్కడే చేశారు. ఇప్పుడు 'కల్కి' ఈవెంట్ కూడా సేమ్ ప్లేసులో చేయడానికి మూవీ యూనిట్ రెడీ అయ్యింది. 


మే 22న... అంటే బుధవారం (రేపే) రామోజీ ఫిల్మ్ సిటీలో 'కల్కి 2989 ఏడీ' మూవీ ఈవెంట్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సంస్థ ట్వీట్ చేసింది. సాయంత్రం ఐదు గంటలకు ఈవెంట్ మొదలు అవుతుందని పేర్కొంది.


50 వేల మంది అభిమానుల సమక్షంలో!
'కల్కి 2989 ఏడీ'పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ 'కల్కి' పాన్ వరల్డ్ సినిమా అని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. ఆ స్థాయిలో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. 'కల్కి' సినిమా వరకు ఫస్ట్ ఈవెంట్ ఇది. సుమారు 50 వేల మంది సమక్షంలో ఈవెంట్ చేయడానికి ఏర్పాట్లు చేశారని తెలిసింది.


'కల్కి'లో ఐదో సూపర్ స్టార్ బుజ్జి కోసం ఇదంతా!
'కల్కి'లో హీరో ప్రభాస్ ఒక సూపర్ స్టార్ అయితే... ఆయన సరసన కథానాయికగా నటిస్తున్న దీపికా పదుకోన్, కీలక పాత్రలు పోషించిన లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సైతం సూపర్ స్టార్లే. వీరితో పాటు సినిమాలో మరొక సూపర్ స్టార్ ఉన్నారని, అది బుజ్జి అని సినిమా యూనిట్ చెబుతోంది. ఆ బుజ్జిని పరిచయం చేయడం కోసమే ఈవెంట్ చేస్తున్నది. సినిమాలో హీరో క్లోజ్ ఫ్రెండ్ ఈ బుజ్జి అని చెప్పారు.


Also Read: మోహన్ లాల్ మూవీస్ రీమేక్ చేసిన టాలీవుడ్ స్టార్స్... లిస్టులో చిరు, వెంకీ కంటే మోహన్ బాబు, నాగార్జునవే ఎక్కువ






జూన్ 27న థియేటర్లలో సినిమా విడుదల!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న 'కల్కి'ని వైజయంతీ మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేలా ఏర్పాట్లు చేశారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో', 'రాధే శ్యామ్' సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేదు. అందుకని, ఈ సినిమా మీద అభిమానులు అంచనాలు ఎక్కువ పెట్టుకున్నారు.


Also Readఎన్టీఆర్ కెరీర్‌లో టాప్ 5 బెస్ట్ లుక్స్ - ఆ మేకోవర్, స్టైలింగుకు విమర్శకుల నోళ్లూ మూతపడ్డాయంతే!