Harom Hara Release Date Postponed: ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేసి దాదాపు మూడు నెలలు అయిపోయింది. ఎక్కువ హైప్ ఉన్న సినిమాలు విడుదల కాకపోవడమే దీనికి కారణం. అందుకే కొంతకాలం పాటు సింగిల్ స్క్రీన్స్‌ను మూసివేయాలని కూడా నిర్ణయించుకున్నారు థియేటర్ ఓనర్లు. దీంతో ముందుగానే మే చివరి వారంలో విడుదల తేదీని అనౌన్స్ చేసుకున్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి. అందులో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘హరోం హర’ కూడా ఒకటి. ముందుగా మే 31న ఈ మూవీ విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ దీని వాయిదా గురించి సుధీర్ బాబు స్వయంగా ప్రకటించాడు.


జూన్... నా లక్కీ నెల!


‘‘పలు కారణాల వల్ల హరోం హర ఇప్పుడు జూన్ 14న థియేటర్లలో విడుదల కానుంది. కృష్ణగారి పుట్టినరోజున సినిమాల విడుదల కావడం లేదని బాధగా ఉన్నా... జూన్ అనేది నా లక్కీ నెల కావడంతో కాస్త పరవాలేదనిపిస్తోంది. ప్రేమకథా చిత్రమ్, సమ్మోహనం... ఈ రెండు సినిమాలు జూన్‌ లోనే విడుదలయ్యాయి. మీ ఎదురుచూపులకు కచ్చితంగా ప్రతిఫలం దక్కుతుందని మాటిస్తున్నాను. 'హరోం హర గట్టిగా కొడుతుంది’’ అంటూ ‘హరోం హర’ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ గురించి ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేశాడు సుధీర్ బాబు. ‘హరోం హర’ షూటింగ్ మొదలయినప్పటి నుండి ఈ మూవీ సక్సెస్‌పై సుధీర్ చాలా నమ్మకంతో ఉన్నాడు.






ఆకట్టుకున్న పాటలు..


విడుదల తేదీ దగ్గర పడడంతో ‘హరోం హర’ ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్, పాటలు కూడా విడుదలయ్యాయి. అంతే కాకుండా ఇందులో నుండి బయటికి వచ్చిన పోస్టర్స్, ప్రోమోలు కూడా ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశాయి. ఇటీవల సుధీర్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలయిన ‘మురుగన్’ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంది. దాంతో పాటు మరో లవ్ సాంగ్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని యూట్యూబ్‌లో కొన్నిరోజుల పాటు ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో ‘హరోం హర’ కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్ సంఖ్య పెరిగిపోయింది.


సోలో రిలీజ్..


జూన్ 14న ఇప్పటివరకు ఇంకా ఏ సినిమా విడుదల అవుతున్నట్టుగా ప్రకటన రాలేదు. దీంతో ‘హరోం హర’ సోలో రిలీజ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘సెహరీ’ లాంటి యూత్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన జ్ఞానసాగర్ ద్వారక.. ‘హరోం హర’ను డైరెక్ట్ చేశాడు. ఎస్ఎస్‌సీ బ్యానర్‌పై సుమంత్ జీ నాయుడు.. ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో సుధీర్ బాబుకు జంటగా మాళవిక శర్మ నటించింది. 1989లో చిత్తూరులోని కుప్పంలో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా ‘హరోం హర’ తెరకెక్కింది. మొత్తానికి తనకు బాగా కలిసొచ్చిన జూన్ నెలలో సుధీర్ బాబు మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.


Also Read: థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం రిలీజవుతున్న సినిమాలు ఇవే