Seethe Ramudi Katnam Today Episode : మహాలక్ష్మి మాట్లాడిన డ్యాన్సర్ ఇంటికి వచ్చే సరికి సీత ఆరు బయట భరత నాట్యం చేస్తూ వాళ్లని మెప్పిస్తుంది. ఇంతలో మహా వాళ్లు బయటకు వచ్చి తమ పిల్లలు లోపల ఉన్నారని ఈ అమ్మాయిని ఓడించాలి అని అంటుంది. ఇక ప్రీతి, ఉషలు వచ్చి మాస్టర్‌కి దండం పెడతారు.

  ఇక మాస్టర్ అందరి ముందే మందు తాగుతాడు. మందు తాగి ఈయన మనకు ఏం నేర్పిస్తాడు అని ప్రీతి ఉషలు అంటారు. ఇక సీత ఆయనకు హరతి ఇస్తానని అంటుంది. మహా ఇంట్లో వాళ్లకి ఆయన్ను పరిచయం చేస్తుంది. సీత వాళ్లని కాకాపట్టే పనిలో పడుతుంది. 
 
మహాలక్ష్మి: హారతి ఇచ్చి మాస్టర్‌ని కాకా పడుతున్నావా. 


సీత: ఇంటికి వచ్చిన పెద్దలను గౌరవించడం మన సంస్కారం. 


మహాలక్ష్మి: మీరు లోపలికి రండి మాస్టర్. ప్రీతి, ఉషలకు ప్రాక్టీస్ చేయించండి. మాస్టర్ వచ్చాడు సీత ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. 


చలపతి: నువ్వు ఓడిపోతావ్ సీత. పోటీ వద్దు ఆగిపో.


రామ్: అవును సీత నువ్వు పోటీలో పాల్గొనొద్దు. పోటీ నుంచి తప్పుకో.


సీత: ఇంత దాక వచ్చాక ఇక తప్పుకోలేను. ఇది నాకు తప్పని సరి. ఈ పోటీ ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు. 


రామ్: ఎందుకు సీత.


సీత: ఎందుకో ఇప్పుడు చెప్పలేను మామ. కాసేపు నన్ను అలా బయటకు తీసుకెళ్తావా ప్లీజ్. 


సీత, రామ్‌లు కారులో బయటకు వస్తారు. సీత తన మనసు బాలేదు అని రామ్‌తో చెప్తుంది. రామ్ సీతకు ధైర్యం చెప్తాడు. ఇక సీత ఓడిపోతే రామ్‌ని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని బాధ పడుతుంది. రామ్ ప్రశాంతంగా ఉండమని అనడంతో రామ్ భుజం మీద వాలిపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక సీత రామ్‌తో నేను నిన్ను వదిలిపెట్టాల్సి వస్తే అని అడుగుతుంది. రామ్ అలాంటిదేమీ జరగదు టెన్షన్ పడకు అంటాడు. ఇక రామ్ లాస్ట్ మినిట్‌ వరకు ఉండి నిన్ను గెలిపిస్తా అని అంటాడు. ఇక సీతకు ముద్దు పెట్టి ఒట్టు అంటాడు. సీత నవ్వేస్తుంది. ఇక రామ్ సీతతో రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. సీత సిగ్గేస్తుందని అంటుంది. ఇక ఇద్దరూ గుడికి వెళ్దామనుకుంటారు. 


సీత, రామ్‌లు గుడికి వెళ్లేసరికి అక్కడ సుమతి కొంత మంది పిల్లలకు భరతనాట్యం నేర్పిస్తూ ఉంటుంది. సీత అది చూసి భర్తను తీసుకొని వెళ్తుంది. సుమతిని చూసి చాలా సంతోషిస్తారు. తెలీకుండానే ఎమోషనల్ అవుతారు. ఇక సుమతి కూడా సీత, రామ్‌లను చూసి ఎమోషనల్ అవుతుంది. జరిగిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటుంది. పిల్లలకు ఇక ఇంటికి వెళ్లిపోమని చెప్తుంది. సీత, రామ్‌లు సుమతి దగ్గరకు వస్తారు. సుమతి ఆశ్చర్యంగా చూస్తుంది. ఇద్దరూ తమని తాము పరిచయం చేసుకుంటారు. 


సీత: నాకు నాట్యం అంటే చాలా ఇష్టం అండి. మీరు పిల్లలకు నేర్పడం చూసి వచ్చాం నాకు మీరు భరతనాట్యం నేర్పుతారా. 


రామ్: ప్లీజ్ అండి తను ఇప్పుడు భరత నాట్యం నేర్చుకోవడం చాలా అవసరం కాదు అనకండి. 


సుమతి: అది నేను.. ఇంతలో రామ్‌కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది పక్కకు వెళ్తాడు.


సీత: చెప్పండి నాకు డ్యాన్స్ నేర్పిస్తారా. 


సుమతి: ఇప్పుడు నువ్వు భరతనాట్యం నేర్చుకోవాలి అని ఎందుకు అనుకుంటున్నావ్. నువ్వు నాట్యం నేర్చుకోవడం చాలా అవసరం అని నీ భర్త చెప్పాడు.


సీత: అవునండి మిమల్ని చూస్తుంటే మా ఆత్మీయుల్లా అనిపిస్తున్నారు. 


సుమతి: మనసులో.. ఆత్మీయురాలినే సీత నీ అత్తని, రామ్ కన్నతల్లిని. మారిన రూపంతో నీ ముందు నిల్చొన్నా. 


సీత: మిమల్ని చూడగానే అలా అనిపించింది ఏమనుకోకండి. మీకు నా కథ చెప్తాను. నేను ఎందుకు నాట్యం నేర్చుకోవాలో చెప్తాను. అంటూ మొత్తం చెప్తుంది. పందెం గురించి చెప్తుంది. మా అక్కని మా బావ దగ్గరకు చేర్చాలి. అందుకు డ్యాన్స్ పోటీ ఒక్కటే దారి. నేను ఓడిపోతే నా భర్తను వదులుకోవాలి. పోటీకి ఎక్కువ సమయం లేదు. వారం రోజులే ఉంది. అందుకే మీ సాయం కోరుతున్నా. నాకు నాట్యం నేర్పిస్తారా.


సుమతి: నీ పోరాటంలో నీతి ఉంది. మీ అక్క కాపురం నిలబెట్టాలి అని చూస్తున్నావ్. నీకు భరత నాట్యం నేర్పతాను నిన్ను గెలిపిస్తాను.


సుమతి అభయంతో సీత సుమతిని హగ్ చేసుకుంటుంది.  సుమతి డ్యాన్స్ పోటీ అయ్యే వరకు మీ ఇంట్లోనే ఉంటాను అని సీత, రామ్‌లకు చెప్తుంది. ఇంట్లో వాళ్లు ఒప్పుకునేలా చేయమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: శౌర్య తండ్రి నేనా? ఆ కార్తీక్‌నా? అంటూ దీప తాళిని తెంచేందుకు రచ్చ చేసిన నర్సింహ