Guppedanta Manasu Serial Today Episode: మనుకు ఫోన్ చేసిన శైలేంద్ర.. మహేంద్ర, వసుధారతో మాట్లాడొద్దని వీలైతే అక్కడ ఉండొద్దని చెప్తాడు. ఎందుకు అని మను అడుగుతే తర్వాత చెప్తాను నువ్వు త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చేయ్ అంటాడు. నువ్వు ఉండటానికి హోటల్‌లో రూం బుక్ చేస్తానని.. లేదంటే విల్లా బుక్ చేస్తానని చెప్తాడు. దీంతో మను మీరేదో కంగారులో ఉన్నట్లున్నారు తర్వాత మాట్లాడుదాం అంటూ ఫోన్ కట్ చేస్తాడు. దీంతో శైలేంద్ర షాక్ అవుతాడు. అయినా డీల్ ప్రకారం మనుని జైలు నుంచి బయటకు తీసుకొచ్చాను. రేపు కాలేజీ ఎండీ సీటు నాదే అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంటాడు. తర్వాత మహేంద్ర రెడీ అయి రాగానే వసుధార వస్తుంది.
వసు: ఏంటి మామయ్యా ఇవాళ త్వరగా రెడీ అయ్యారు. ఉదయాన్నే కాలేజీకి వెళ్దాం అంటున్నారు.
మహేంద్ర:ఈరోజు కాలేజీ వాడి సొంతం అవుతుందన్న భ్రమతో శైలేంద్ర ముఖం వెలిగిపోతుందమ్మా..
వసు: అవును మామయ్యా కానీ కథలోని ట్విస్ట్ తెలిస్తే గుండె ఆగిపోతుందేమో..?
అంటూ ఇద్దరూ కలిసి శైలేంద్ర గురించి మాట్లాడుకుంటారు. ఎండీ అయ్యే అర్హత కూడా వాడికి లేదు అని మహేంద్ర అంటాడు. జగతి చావుకు కారణం అయిన వెధవ వాడు అలాంటి వాడిని అసలు వదలకూడదు. వాణ్ని ఎండీ సీటుకే కాదు కాలేజీకే దూరంగా ఉంచాలని వసు అంటుంది. మరోవైపు కాలేజీలో కూర్చున్న మను దగ్గరకు హడావిడిగా శైలేంద్ర వచ్చి అంతా ఓకే కదా అని అడుగుతాడు. రాత్రి సడెన్‌గా ఫోన్ కట్ చేశావు కదా మనసు మార్చుకున్నావేమో అనుకున్నాను అంటాడు. దీంతో ఈ మను ఒక్కసారి ఫిక్స్ అయితే ఇచ్చిన మాట తప్పడు అంటాడు. ఇంతలో వసుధార వస్తుంది.
శైలేంద్ర: ఏంటి వసుధార కాబోయే ఎండీ ఇక్కడ కూర్చుని ఉంటే పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలని తెలియదా?
వసు: ఇప్పుడు ఇంకా నేనే ఎండీ.. నువ్వు ఇంకా కాలేదు.
శైలేంద్ర: ఇంకో పది నిమిషాల్లో నేను ఎండీ కాబోతున్నాను. ఎంటీ నేను ఎండీ సీటులో ఎలా ఉంటానని ఊహించుకుంటున్నారా? ఈ శైలేంద్ర ఎండీ సీటులో కూర్చుంటే ఆ ఠీవియే వేరు.
అనగానే ఇంతలో అటెండర్ వచ్చి బోర్డు మీటింగ్‌కు అంతా రెడీ అని చెప్తాడు. అయితే శైలేంద్ర.. వసు, మనులను మీటింగ్‌కు వెళ్లమని నేను చిన్న ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని చెప్పడంతో వసు, మను వెళ్లిపోతారు. శైలేంద్ర దేవయానికి ఫోన్ చేసి పదిన్నరకు కాలేజీకి రమ్మని చెప్తాడు. దీంతో దేవయాని నువ్విలా మాట్లాడుతుంటే నాకెందుకో భయంగా ఉందని అనడంతో శైలేంద్ర అదేం లేదని ఫోన్ కట్ చేసి బోర్డు మీటింగ్ హాల్‌లోకి వెళ్తాడు. అక్కడ అందరూ కూర్చుని ఉంటారు. ఇంతలో ఒక బోర్డు మెంబర్ మను గారు పంపించిన నోటీసు గురించి అడిగితే ఇప్పుడు ఆ యాభై కోట్లు మను గారు మాఫీ చేశారు అని వసుధార చెప్పడంతో శైలేంద్ర షాక్ అవుతారు.
అసలు విషయం చెప్పకుండా ఏదో మాట్లాడుతున్నారు అంటూ నిలదీస్తాడు. దీంతో వసుధార మీటింగ్ ఈజ్ ఓవర్ అనడంతో శైలేంద్ర పిచ్చిపిచ్చిగా మాట్లాడతాడు. దీంతో ఫణీంద్ర, శైలేంద్రను తిడతాడు. అయితే ఫణీంద్రను అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పి మనం రాసుకున్న అగ్రిమెంట్ మర్చిపోయావా అంటూ మనును నిలదీస్తాడు శైలేంద్ర. అగ్రిమెంట్ పేపర్స్ చూపించమని మను అడగ్గానే పేపర్స్ మనుకు ఇస్తాడు శైలేంద్ర ఆ పేపర్స్ తీసుకుని చించిపారేస్తాడు మను. దీంతో కోపంగా శైలేంద్ర మీ అంత చూస్తానని వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కలిసొచ్చారే - ముంబైలో పోలింగ్ బూత్ దగ్గర బాలీవుడ్ స్టార్స్ సందడి