Lok Sabha Elections 2024: ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కలిసొచ్చారే - ముంబైలో పోలింగ్ బూత్ దగ్గర బాలీవుడ్ స్టార్స్ సందడి
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ పోలింగ్ బూత్ దగ్గర కనిపించింది. భార్య గౌరీ ఖాన్, పిల్లలతో ఆయన వచ్చారు. ఓటు వేసి వెళ్లారు. షారుఖ్ అబ్ రామ్ కూడా రావడం విశేషం.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, దర్శకురాలు కిరణ్ రావు విడాకులు తీసుకున్నా మంచి స్నేహతులుగా కొనసాగుతున్నారు. వాళ్లిద్దరూ జంటగా పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చి ఓటు వేయడం విశేషం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఇప్పుడు గర్భవతి అనేది తెలిసిన విషయమే. ఆమెను భర్త, స్టార్ హీరో రణబీర్ కపూర్ దగ్గరుండి మరీ పోలింగ్ బూత్ దగ్గరకు తీసుకు వచ్చారు. ఇద్దరు ఓటు వేసిన అనంతరం ముంబైలో ఒక రెస్టారెంట్ కు వెళ్లి లంచ్ చేశారు. ఆ వీడియోస్ వైరల్ అయ్యాయి.
బాలీవుడ్ హీరోయిన్, ప్రభాస్ సరసన 'సాహో' సినిమాలో నటించిన శ్రద్దా కపూర్ సైతం ఫ్యామిలీతో వచ్చి ఓటు వేశారు. ఆమెతో పాటు తల్లి ఉన్నారు.
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ దంపతులు ఒకే పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, క్రౌడ్ ఉండటంతో వెంటనే కారు ఎక్కేశారు. కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు.
హీరోయిన్ శిల్పా శెట్టి తన తల్లితో పాటు చెల్లెలు షమితా శెట్టితో కలిసి పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. ఓటు వేసిన అనంతరం అక్కాచెలెళ్లు తమ వేలిపై సిరా చుక్కను ఇలా చూపించారు.
తెలుగుతో పాటు హిందీలో పలు సినిమాలు చేసిన హీరోయిన్ శ్రియా శరణ్ తన తల్లితో కలిసి వచ్చి ఓటు వేశారు. ఆమె భర్త విదేశీయుడు కావడంతో ఆయనకు ఇండియాలో ఓటు హక్కు లేదు.
నటుడు మనోజ్ బాజ్ పాయ్, ఆయన భార్య షబానా జంటగా పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు. తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
తండ్రితో కలిసి ఓటు వేయడానికి వచ్చిన విద్యా బాలన్
ఆమిర్ ఖాన్ మొదటి భార్య సంతానం ఐరా, జునైద్ ఓటు వేసిన తర్వాత ఫోటోలకు ఇలా ఫోజులు ఇచ్చారు.
బాలీవుడ్ సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్, ఆయన తనయుడు & హీరో వరుణ్ ధావన్. తండ్రీ తనయులు ఇద్దరూ పోలింగ్ బూత్ దగ్గరకు కలిసి వచ్చి ఓటు వేశారు.