Trinayani Today Episode : తిలోత్తమ జాతకం చెప్పమని గురువుగారిని అడుతుంది. గురువుగారు నాగులాపురం పెట్టెను తీసుకురమ్మని చెప్పి దాని మీద గాయత్రీ పాపని కూర్చొపెట్టి అప్పుడు గాయత్రీ పాప చేత గవ్వలు వేయించి వచ్చిన సంఖ్య గల కాలపత్రం చదివితే తిలోత్తమకు ప్రాణ హాని ఉందా లేదా తెలుస్తుందని అంటారు.
వల్లభ: గురువుగారు నాకు ఓ డౌట్. ఈ పాపే ఎందుకు గవ్వలు వేయాలి.
గురువుగారు: మంచి ప్రశ్న వల్లభ. అరచేతిలో నాగ రేఖ మీ పెద్దమ్మకి ఉండేది. ఆ తర్వాత ఆ రేఖ ఈ పాపకే ఉంది. జాతక దోషాలు ఏమైనా ఉన్నా చిన్న పిల్లలు గవ్వలు వేయడం వల్ల అవి బాలారిష్టాలా పోతాయి అంతే.
తిలోత్తమ: అర్థమైంది గురువుగారు. మీరు ఎలా ఆలోచిస్తే ఆలా చేయండి. కానివ్వండి.
గురువుగారు: గాయత్రీ గవ్వలు వేయమ్మా..
హాసిని: మూడు అంటే అత్తయ్యకు మూడిందని.
తిలోత్తమ: నోర్ముయ్.
నయని: భయపెట్టకు అక్క.
గురువుగారు: నయని లోపల ఉన్నది తీయండి.
సుమన: తీయడం అయితే తీశారు కానీ ఆ పత్రాలను మానవ మాత్రులెవరూ చదవలేరు అని చెప్పారు కదా స్వామి.
దురంధర: పోయిన సారి అయితే పాము కాబట్టి పెద్ద బొట్టమ్మ తీసుకొని చదివింది. ఈ సారి అలా చదవడానికి ఇక్కడ మానవాతీతులు ఎవరూ లేరు కదా స్వామి.
గురువుగారు: ఉన్నారు. మానవాతీతంగా ఉన్నది ఎవరో కాదు విశాలా మీ అమ్మ. అక్షరాలు కనిపించని ఆ తాళపత్రాలు చదవాలి అంటే గాయత్రీ వల్లనే సాధ్యం. వెళ్లి గాయత్రీ దేవిని తీసుకొని రండి.
హాసిని: మనసులో.. విశాల్ గాయత్రీ పాప గురించి చెప్పేసేలా ఉన్నారు ఈయన.
గురువుగారు: నయని నువ్వు అయినా తీసుకుకొని వస్తావా.
నయని: తీసుకొని వస్తాను స్వామి అని ఫొటో తీసుకొని వస్తుంది.
గురువుగారు: ఈ చిత్రంలోని గాయత్రీ దేవిని అందరూ దేవత అని కొలిచేవారు. గత జన్మ వాసన చుట్టు ముట్టినా సరే తను దైవాంశ సంభూతురాలిగానే ఉంది.
విశాల్: కానీ అమ్మ ఫొటో ఈ తాళపత్రాలను ఎలా చదవగలదు స్వామి.
దురంధర: ఇది సాధ్యమైన పనేనా..
గురువుగారు గాయత్రీ దేవి ఫొటోని గాయత్రీ పాపకి ఎదురుగా పెడతారు. దాని ద్వార తాళపత్రంలోని రాతలు కనిపిస్తాయి. తాళపత్రంలో రేపు నీ మృత్యువును తప్పించుకోవాలి అంటే సర్పదేవినే శరణ్యం అని రాసి ఉంటుంది. సర్ప దేవినా అని తిలోత్తమ షాక్ అవుతుంది. అయితే సర్ప దీవికి వెళ్లి పూజలు చేస్తే గండం తప్పుతుందని స్వామిజీ అంటారు.
నయని: తనలో తాను.. తిలోత్తమ అత్తయ్యను చంపేది గాయత్రీ అమ్మగారు కదా. మరి ఈ గండం ఎవరి వల్ల? ఎందుకు వల్ల? ఏం జరగబోతుంది?
వల్లభ టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతూ తన తల్లిని సర్పగండం నుంచి తప్పించాలని అనుకుంటూ ఉంటే సుమన వచ్చి ఓ విషయం చెప్పాలి అంటుంది. ఇంతలో హాసిని కూడా అక్కడికి వస్తుంది. విషయం ఏంటో తొందరగా చెప్పాలని అంటాడు. దాంతో సుమన సర్పదీవికి అత్తయ్య వెళ్తుంది కదా అక్కడ నుంచి వజ్రాలు, మణులు తీసుకురమ్మని అంటుంది. హాసిని సుమన మీద సెటైర్లు వేస్తుంది.
సుమన: సర్ప దీవికి వెళ్తారు కదా అక్కడే మా అక్క కన్న బిడ్డ అలియాస్ గాయత్రీ దేవి ఉంటుంది అనుకుంటా.
హాసిని: చిన్నగా.. ఇంట్లో పిల్లని పెట్టుకొని ఊరురూ వెతుకుతున్నారు ఈ పిచ్చోళ్లు.
విశాల్: నయని నేను అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పు. స్మైల్ ఇవ్వకు.
నయని: చెప్పండి.
విశాల్: స్వామిజీ గారు అమ్మని తీసుకురమ్మని అంటే ఫొటో తీసుకురావాలి అని నీకు ఎలా అనిపించింది.
నయని: ఏడాదిన్నర నుంచి అమ్మగారి కోసం వెతుకుతున్నాం దొరకలేదు. ఇంటికి రానే లేదు. ఆ విషయం తెలిసిన స్వామిజీ గారు గాయత్రీని తీసుకురమ్మని అంటే ఫొటో తీసుకురావాలి అనిపించింది. కానీ ఎంత ఆలోచించినా తిలోత్తమ అత్యయ్యకు ఉన్న గండం ఏంటో అంతు పట్టడం లేదు. బాబుగారు.
విశాల్: ఆ సర్ప దీవికి వెళ్తే కానీ తిలోత్తమ అమ్మ బతకదు అంటున్నారు.
నయని: జరిగే హాని ఏంటో తెలిస్తే కదా బాబుగారు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలిసేది. గాయత్రీ అమ్మగారు ఇంటికి వచ్చేసి ఉంటే తిలోత్తమ అత్తయ్యకు ఏ ప్రమాదం ఉందో తెలిసిపోయేది.
విశాల్: అలా ఏలా నయని. అమ్మ బతికుండగా ఎవరిని చావు బతుకుల మధ్యకు వెళ్లనివ్వదు.
నయని: మనసులో ఒక్క తిలోత్తమ అత్తయ్యని తప్పు. ఆ రాక్షసిని చంపడానికి దేవత పునర్జన్మ ఎత్తినా పసిపిల్లలా ఉండిపోవడం వల్ల ఇక్కడికి రాలేకపోయింది. లేదంటే మీ పెంపుడు తల్లికి ఈ పాటికి ఖర్మ కాండలు చేసేవాళ్లం. సర్ప దీవి గురించి చిన్నప్పుడు మా తాతయ్య చెప్పేవాళ్లు అక్కడికి వెళ్లిన వాళ్లు ఎవరూ తిరిగి రారు అని.
విశాల్: వాట్.. అలాంటప్పుడు అక్కడికి వెళ్తే తప్ప ఆయుష్షు ఉండదు అని అమ్మకి స్వామీజి ఎందుకు చెప్పినట్లు.
నయని: అదే నాకు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్తే ప్రాణాలు ఉండవో అక్కడికి వెళ్లి ప్రాణాలు నిలబెట్టుకోమని చెప్పడం నాకు విడ్డూరంగా ఉంది.
విశాల్: అయితే తిలోత్తమ అమ్మ సర్ప దీవిలో చనిపోతుంది అన్నమాట.
నయని: అంత తేలికగా అంటున్నారేంటి బాబుగారు. మిమల్ని పెంచిన తల్లి ఆవిడ.
విశాల్: మనసులో..ఆ రుణం ఉంది అనే ఆయుష్షుతో ఉంది నయని. నన్ను కన్న తల్లే ఆవిడను కడ తేర్చుతుందని తెలుసు. కానీ సర్పదీవికి తిలోత్తమ అమ్మ వెళ్లిపోతే మన దగ్గర ఉన్న ఈ పాప ఎక్కడో ఉన్న ఆమెను ఎలా చంపుతుందా అని నాకు అర్థం కావడం లేదు. నయని అందర్ని కాపాడే నువ్వు తిలోత్తమ అమ్మని కాపాడటానికి ఎలా ప్లాన్ చేశావ్.
నయని: ఇంకా ఏం అనుకోలేదు బాబుగారు. సమస్య తెలిస్తేనే పరిష్కారం తెలుస్తుంది.
విశాల్: కరెక్టే నయని కాస్త చీకటి పడితే అసలు విషయం తెలుస్తుంది అని గురువుగారు చెప్పారు కదా.
తిలోత్తమ విభూది రాసుకొని దేవుడిని దండం పెట్టుకుంటుంది. వల్లభ కూడా తల్లిని కాపాడమని వేడుకుంటాడు. ఇక హాసిని అక్కడికి వచ్చి పెద్దగా నవ్వుతుంది. అందరూ వాళ్ల దగ్గరికి వస్తారు. ఇక విశాలాక్షి కూడా అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.