Naga Panchami Today Episode : పంచమి, చిత్రలకు ఆడపిల్లలని తన కొడుకే ఇంటికి వారసుడు అందుకే తన కొడుకుకి ప్రత్యేకంగా బారసాల చేయాలని జ్వాల పట్టు పడుతుంది. దాంతో శబరి నీకు అంత ఘనంగా జరిపించుకోవాలి అని ఉంటే నీ పుట్టింటిలో జరిపించుకోమని జ్వాలని తిడుతుంది. 


జ్వాల: ఇదే మీ అందరి మాట అయితే చెప్పండి. నా కొడుకుకు ఎక్కడ బారసాల జరిపించాలో ఎలా జరిపించుకోవాలో నాకు తెలుసు.


రఘురాం: తొందర పడకు జ్వాల. ముగ్గురు పిల్లలది ఒకే వయసు. ఇద్దరిని పక్కన పెట్టి ఒకరికి చేయడం సరికాదు. ముగ్గురుకి ఒకేసారి శాస్త్రీయంగా జరిపిద్దాం.


జ్వాల: మీ అందరూ కలిసి నా కొడుకుని అవమానిస్తున్నారు. మగ పిల్లాడు అన్న గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్లతో సమానంగా నా కొడుకుని చూడటం నాకు నచ్చడం లేదు. ఎవ్వరూ నా మాటలకు విలువ ఇవ్వరు. అంతా మీ ఇష్ట ప్రకారం జరిగితే ఇక  ఇంటి పెద్ద కోడలిగా నాకు ఏ గౌరవం ఉంటుంది.


వరుణ్: జ్వాల ఒక్కసారి నాతో రా. జ్వాల బాగా తెలివిగా ఆలోచించు. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ పుట్టింటికి వెళ్లి జరిపించుకో అంటారు. అప్పుడు ఖర్చు ఎవరికి.  అంతేకాదు ఈ ఒక్క విషయం అడ్డుపెట్టుకొని మా అమ్మానాన్నలు మోక్ష పిల్లలకు బంగారం చేసి పెడతారు. ఆస్తులు రాసి ఇచ్చినా ఆశ్చర్యం లేదు. అప్పుడు మనమే కదా నష్టపోయేది.


జ్వాల: అయ్యో అల జరగడానికి వీళ్లేదు. 


వరుణ్: అందుకే నేను చెప్పినట్లు చేయ్. కొన్ని విషయాలకు రాజీ పడతే మన బాబుకి ఏం కావాలో అవి జరిపించుకుందాం. పద ఫంక్షన్‌కి ఒకే చెప్పు. నాన్న ఈ చిన్న విషయానికి ఇంట్లో గొడవలు వద్దు. 


జ్వాల: నేను ఈ ఇంటి పెద్ద కోడలిని కాబట్టి ముందు నా కొడుకుకే నామకరణం చేయండి. కనీసం ఆ విలువ అయినా ఇవ్వండి. 


మోక్ష: అన్నయ్య మాకు అలాంటి తారతమ్యం ఏం లేదు. ముందు బాబుకే చేద్దాం. 


జ్వాల: నాకొడుకు పెద్ద వాడు అయిన తర్వాత వాడితోనే వీళ్ల అందరి ఆటలు కట్టించాలి. ఈ వంశానికి ఈ ఆస్తికి నా కొడుకు ఒక్కడే వారసుడు.


పంచమి, జ్వాలల పిల్లలకు నామకరణానికి ఏర్పాట్లు జరుగుతాయి. చిత్ర రగిలిపోతుంటుంది. మనసులో పంచమి సుబ్బు వస్తే బాగున్ను అనుకుంటుంది. అప్పుడు సుబ్బు ప్రత్యక్షం అవుతాడు. పంచమి మనసులో అనుకున్నానో లేదో వచ్చావ్ అని అనుకుంటుంది. మోక్ష కూడా సుబ్బుతో నువ్వు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సుబ్బు. నువ్వు మాకు చాలా సాయం చేశావని అంటాడు. ఇక పంచమి సుబ్బుని తన పక్కన కూర్చొమని చెప్తుంది.


సుబ్బు జ్వాల ఒడిలో బిడ్డని చూసి గరుడని చూస్తాడు. ఇక పంతులు పిల్లల పేర్లు బియ్యంలో రాయమని పంచమికి ఇస్తే జ్వాల అడ్డుకుంటుంది. తన బిడ్డ పేరు మొదట రాయమని అంటుంది. ఇక మోక్ష కూడా తన బిడ్డ అయినా మా బిడ్డే అని ముందు బాబుకే నామకరణం చేయించమని అంటాడు. జ్వాల, వరుణ్‌లు ఉంగరంతో బియ్యంలో పేరు రాస్తుండగా సుబ్బు మాయతో నెమలి పింఛం పడుతుంది. 


ఇక పంతులు అలా నెమలి పింఛం పడటం చాలా మంచి శుభ సూచకం అని చెప్తాడు. అందరూ దేవుడిని దండం పెట్టుకుంటారు. ఇక వరుణ్, జ్వాలలు నెమలి పింఛంతోనే పేరు రాస్తారు. ఇక జ్వాల కొడుకుకు ఘనపర్ణా అని పేరు పెడతారు. ఇక పంచమి, మోక్ష కూడా నెమలి పింఛంతో పేరు రాస్తారు. మోక్ష తన బిడ్డలకు వైశాలి, ఫాల్గుణి అని పేర్లు పెడతారు. ఇక రెండు జంటలు తమ బిడ్డలను ఉయ్యాల్లో వేస్తారు. అందరూ పిల్లలను చూసి ముచ్చట పడతారు. 


ఆరు సంవత్సరాల తర్వాత..


ఉదయం వైశాలి, ఫాల్గుణి ఆరు బయట బాలుతో ఆడుకుంటూ ఉంటారు. మేడ మీద నుంచి ఘన వాళ్లని చూస్తూ ఉంటాడు. ఇక జ్వాల తన కొడుకు ఘనని వెతుక్కుంటూ వస్తుంది. బాల్కానీలో పిల్లడిని చూసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. దీంతో ఘన వాళ్లని చూస్తున్నాను అని వాళ్లంటే తనకు చాలా కోపమని అంటాడు. దీంతో జ్వాల తన కొడుకు ఘనని నిన్ను చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది ఘన. నీకు అన్నీ నా పోలికలే అని అంటుంది. 


ఇక పంచమి వైశాలి పాపని పిలుస్తుంది. వైశాలి పంచమి దగ్గరకు వెళ్లి తల్లిని హత్తుకుంటుంది. పంచమి ప్రేమగా వైశాలిని ముద్దు పెట్టుకుంటుంది. ఇక మోక్ష ఫాల్గుణిని పిలుస్తాడు. ఫాల్గుణి దగ్గరకు వెళ్లి హత్తుకుంటాడు. మరోవైపు కరాళీ ధ్యానం చేస్తూ ఉంటుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ఎన్టీఆర్ బర్త్‌డే... విషెస్ చెప్పిన పవన్, మహేష్, చరణ్, బన్నీ - థాంక్స్ చెప్పిన బన్నీ