Seethe Ramudi Katnam Today Episode : జైలులో సూర్యని తోటి ఖైదీలు మాటలతో హర్ట్ చేస్తారు. తన భార్య వేరే వాడితో కులుకుతుందని అంటారు. ఆ మాటలకు సూర్య కోపంతో వాళ్ల దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న గునపంతో వాళ్లని కొడతాడు. అయినా వాళ్లు ఊరుకోకుండా నువ్వు ఎందుకు పనికి రావు అని పనికి రాని వాడి పెళ్లాం పక్క వాళ్లతో గొడవ పడుతుందని అంటారు. దీంతో సూర్య ఆ రౌడీలు గొడవ పడతారు. ఇంతలో శివకృష్ణ వాళ్లు అక్కడికి వస్తారు. వాళ్లని విడిపిస్తారు.


శివకృష్ణ: ఏం చేస్తున్నావ్ సూర్య నువ్వు నిన్ను విడిపించడానికి నేను బయట ప్రయత్నాలు చేస్తుంటే లోపల నువ్వు తోటి ఖైదీలతో గొడవ పడుతున్నావా. నువ్వు ఇలా చేస్తే నీ శిక్ష ఇంకా పెరుగుతుంది.


సూర్య: అంతా మీ కూతురు వల్లే. జైలులో కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఈ జైలు శిక్ష కంటే తను వేసిన శిక్షే నాకు నరకంగా ఉంది. తను ఇప్పుడు ఎక్కడ ఉంది. మీ ఇంట్లోనా లేక మా ఇంట్లోనా. మీ చిన్నల్లుడి ఇంట్లో ఉంది. మధు నన్ను వదిలేసి ఆ రామ్‌తో తిరుగుతుందని ఆఖరికి జైలులో ఉన్న ఖైదీలు కూడా చెప్పుకుంటున్నారు. 


శివకృష్ణ: లేదు సూర్య తను సీత దగ్గర ఉంది. 


సూర్య: ఈ కవరింగ్‌లే వద్దు. నాకు అంతా తెలుసు. మీరే ప్లాన్ చేసి మా ఇద్దరిని విడగొట్టారు. మీకు డబ్బున్న అల్లుడు కావాలి నేను వద్దు.


శివకృష్ణ: నాకు నువ్వంటే కోపం ఉండొచ్చు సూర్య.. కానీ నిన్నూ మధుని విడగొట్టే అంత చెడ్డొడ్డుని కాదు. 


సూర్య: అయితే మీ కూతురే నన్ను వదిలేసి ఆ రామ్ దగ్గరకు వెళ్లిందా. అలా పెంచారా దాన్ని.


శివకృష్ణ: అసహ్యంగా మాట్లాడకు సూర్య. మధు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ ప్రేమను గౌరవించు. 


సూర్య: ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడిని వదిలేసి తన సుఖం తాను చూసుకుంది. అక్కడ సంతోషంగా ఉంది. నన్ను విడిపించడం కాదు. మీకు చేతనైతే మీ కూతురిని ఆ ఇంటి నుంచి బయటకు తీసుకురండి. అది మీ వల్ల కాకపోతే ఇంకెప్పుడూ ఇక్కడికి రాకండి. 


సీత: ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా అక్క.


మధు: డ్యాన్స్ పోటీ గురించేనా చెప్తున్నావ్.


సీత: పోటీ గురించి మాత్రమేనా పందెం గురించి కూడా తెలుసా. 


మధు: నాకు అంతా తెలుసు నిన్నే మహాలక్ష్మి గారు చెప్పారు.


సీత: అంతా తెలిసి నాతో ఏం మాట్లాడకుండా ఉన్నావా. పోటీలో నేను గెలిస్తే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి.


మధు: పగటి కలలు కనకు పోటీలో గెలిచేది ప్రీతి, ఉషలు. నువ్వు ఓడిపోతావ్. ఈ ఇంటికి రామ్‌ గారికి దూరం అవుతావు.


సీత: నా భర్తకి నేను దూరం కాను. నువ్వే నీ భర్తకు దగ్గర అవుతావు. అందుకే ఆ పందెం కాసాను. 


మధు: తప్పు చేశావ్ నీ గొయ్యి నువ్వే తీసుకున్నావ్.


సీత: అంటే నువ్వు నేను ఓడిపోవాలి అనుకుంటున్నావా. నేను ఇంటి నుంచి పోతే నువ్వు తిష్ట వేయాలి అనుకుంటున్నావా.


మధు: నువ్వు పందెం కాసి నన్ను అంటావ్ ఏంటి. అలాంటి పందెం కాయమని నేను నీకు చెప్పానా. నీకు డ్యాన్స్ రాదు అది తెలిసి నువ్వు పోటీ కట్టావు. ప్రీతి ఉషలు తమ డ్యాన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి పెద్ద డ్యాన్స్ మాస్టర్ దగ్గరకు వెళ్లారు. ఇదంతా నువ్వు నీ అహం కోసం చేస్తున్నావ్. పోటీలో ఓడిపోతే నీకు అది అర్థం అవుతుంది. ఓడిపోయి ఇంటి నుంచి వెళ్లిపోతావ్ కదా అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. 


సీత: అమ్మానాన్నల మీద ఒట్టు వేసి చెప్తున్నా అక్క నేను ఓడిపోను.


మధు: మహాలక్ష్మి సాక్షిగా చెప్తున్నా నువ్వు గెలవలేవు. ఆవిడను తక్కువ చేయకు. నువ్వు ఓడిపోవడం ఖాయం. మాటలు చెప్పడం కాదు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు.


మహాలక్ష్మి, జనార్థన్, గిరిధర్ అంతా కలిసి డ్యాన్స్ మాస్టర్ ఇంటికి వస్తారు. ఇక ఆ డ్యాన్స్ మాస్టర్ ఫుల్‌గా తాగుతూ ఉంటాడు. అతను నిజంగానే మాస్టరా లేక మందు బానిసా అతని గురించి పూర్తిగా తెలుసుకున్నావా అని జనార్థన్ అంటాడు. ఇక ఆ మాస్టర్‌కి మహా టెస్ట్ పెడుతుంది. ఆయన డ్యాన్స్ చూసి ఇంప్రెస్ అవుతారు. తమ ఇంటికి ఆహ్వానిస్తారు. 


ఇక ప్రీతి, ఉషలు డ్యాన్స్ చేస్తుంటే రామ్ స్పీకర్లు ఆపేస్తాడు. ఇక రామ్ సీతని ఓడించలేరు అని పోటీ క్యాన్సిల్ చేసుకోమని అంటాడు. రేవతి, చలపతి కూడా రామ్‌కి సపోర్ట్ చేస్తారు. ఇక ముగ్గురు బయటకు వచ్చి వీళ్లు ఈ రేంజ్‌లో ప్రాక్టీస్ చేస్తే సీత ఓడిపోవడం ఖాయమని అనుకుంటారు. ఈ పోటీ ఎటు దారి తీస్తుందో తెలీదని రామ్ భయపడతాడు. ఇక డ్యాన్స్ మాస్టర్ ఇంటికి వచ్చేసరికి సీత బయట ప్రాక్టిస్ చేస్తుంటుంది. సీతని చూసి మాస్టర్ ఇంప్రెస్ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్ : దీప, కార్తీక్‌ల సంబంధం గురించి కాంచనను ప్రశ్నించిన జ్యోత్స్న.. ఆ డబ్బుతో దీపని వెంట తీసుకెళ్లిన కార్తీక్!