Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode : కార్తీక్ శౌర్యని స్కూల్‌లో జాయిన్ చేస్తాడు. శౌర్య తనకు ఇష్టమైన స్కూల్‌లో జాయిన్‌ చేశావని కార్తీక్‌ని హగ్ చేసుకుంటుంది. ఇక శౌర్య బుక్స్, యూనీఫాం పట్టుకొని కార్తీక్‌ వస్తుంటే జ్యోత్స్న, పారిజాతం చిరాకుపడతారు. 


పారిజాతం: ఇప్పుడు అర్థమైందా ఇది జాలి కాదు బాధ్యత అని. సొంత కూతురికి కూడా ఇన్ని సేవలు చేయడేమో.


జ్యోత్స్న: బావ ఇలా తనకి నచ్చినట్లు చేస్తుంటే నా పని ఇలా చూస్తూ ఊరుకోవడమేనా గ్రానీ.


పారిజాతం: కంట్రోల్ చేయాలి ఆ పని మనం చేయకూడదు. చేయాల్సిన వాళ్లతో చేయించాలి. ముందు పద చెప్తా. కాంచన దగ్గరకు జ్యోత్స్న, పారిజాతం వెళ్తారు.


కాంచన: మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు అనిపిస్తుంది.


జ్యోత్స్న: అవును అత్త. నీ కొడుకు చేస్తున్న పనుల కోసం నీకు చెప్పాలి అనే వచ్చాను. కనీసం నువ్వు అయినా అతను ఏం చేస్తున్నాడో అతనికి అర్థమయ్యేలా చెప్తావని.


కాంచన: బావని పట్టుకొని అతను ఇతను అంటావు ఏంటి.


పారిజాతం: చేస్తున్న పని బట్టి పిలుపు మారుతుంది. దూరం పెరుగుతుంది.  


కాంచన: ముందు ఏం జరిగిందో చెప్పండి పిన్ని.


జ్యోత్స్న: దీపకు నీ కొడుకుకి ఏంటి సంబంధం. దీప విషయంలో అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏంటి. శౌర్యని జాయిన్ చేయించడానికి స్కూల్‌కి తీసుకెళ్లాడు. దీప కాపాడింది మా మమ్మీని. వాళ్లు ఉంటుంది మా ఇంట్లో మా ఎవ్వరికీ లేని శ్రద్ధ ఈయనకు ఎందుకు. ఇప్పటికే దీప వాళ్ల ఆయన ఇంటికి వచ్చి ఎలాంటి నిందలు వేశాడో నీకు తెలుసుకదా అత్త. బావ అటు రెస్టారెంట్ పనులు మానేసి, ఇటు నన్ను పట్టించుకోకుండా దీప చుట్టూ పాప చుట్టూ తిరిగితే వాళ్ల మీద వచ్చిన నిందల్ని బావ నిజం చేస్తున్నట్లే కదా. 


కాంచన: జ్యోత్స్న ఇక ఆపుతావా.. ఇంట్లో పనివాళ్లు దారిన పోయిన వాళ్లు ఇలా అన్నారు అంటే బుద్ధిలేక అనుకునేదాన్ని. చిన్నప్పటి నుంచి చూస్తున్న దానివి  మీ బావ ఎలాంటి వాడో నీకు తెలీదా. ఏ  పిన్ని చిన్నది అది అర్థం చేసుకోకపోతే పెద్దదానివి నువ్వు చెప్పాల్సింది పోయి రెచ్చగొట్టి తీసుకొస్తావా.


పారిజాతం: నేను రెచ్చగొట్టడం ఏంటి స్కూల్ దగ్గర చూసింది నీకు వచ్చి చెప్పాం అంతే. జాగ్రత్త పడాలి కదా.


కాంచన: జాగ్రత్తలు చెప్తున్నట్లు లేదు దాన్ని భయపెడుతున్నట్లుంది. నా కొడుకు గురించి ఒకరు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను పిన్ని. శౌర్యని స్కూల్‌లో చేర్పించిన విషయం వాడు నాకు ఎప్పుడో చెప్పాడు. అది మంచి పని అని ఊరుకున్నా. జ్యోత్స్న నీ బావ ఎలాంటి వాడో నీకు తెలుసు కదా. ఎవరు ఏ చెత్త వాగుడు వాగినా నువ్వు పట్టించుకోకు.


జ్యోత్స్న: బావ ఎలాంటి వాడో నాకు తెలుసు అత్త. కానీ బావలో మార్పు వచ్చింది. నాకు ఇప్పుడు తెలుస్తుంది. త్వరలో నీకు తెలుస్తుంది. ఉంటాను అత్త. పద గ్రానీ. 


కాంచన: కోడలా ఆగు.. పిన్ని నువ్వు అసలు దాన్ని ఇలా తయారు చేయకు. పిన్ని అర్థం లేని అనుమానాలతో కోడలి మనసు పాడు చేస్తుంది. ఇంక వీలైనంత త్వరగా వీళ్ల పెళ్లి చేయాల్సిందే. 


దీప ఇంటికి వచ్చే సరికి శౌర్య ఉండదు. దీంతో సుమిత్ర దగ్గర ఉందేమో అని దీప వాళ్ల ఇంటికి వెళ్తుంటుంది. అప్పుడే జ్యోత్స్న, పారిజాతం ఇంటికి వస్తారు. పారిజాతం దీపని ఆపుతుంది. దీప శౌర్య కోసం లోపలికి వెళ్తున్నా అని తాను ఇప్పుడే పని నుంచి వస్తున్నా అని చెప్తుంది. కానీ పారిజాతం దీపని తిడుతుంది. 


పారిజాతం: నీ కూతురు లోపల లేదు అని నీకు తెలుసు. నాకు తెలుసు. ఎక్కడుందో ఎవరితో పంపావో నీకు తెలుసు నాకు తెలుసు.


దీప: శౌర్య ఎక్కడికి వెళ్లిందమ్మా.


జ్యోత్స్న: నిజంగా నీకు తెలీదా.


దీప: తెలిస్తే అడుగుతానా.


జ్యోత్స్న: నువ్వు అడుగుతావు. ఎందుకు అంటే ఇదంతా నీకు తెలీకుండా జరుగుతుందని మేం అనుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావ్. అయినా మన ముందు నటించే వాళ్ల ముందు మాట్లాడటం అనవసరం గ్రానీ పద.


పారిజాతం: నువ్వు వెళ్లు నేను వస్తా. దీప నువ్వు అనుకున్నవి జరగడం కోసం నువ్వు వేస్తున్న వేషాలు నాకు నచ్చడం లేదు. 


దీప: అలా అనుకోవడం మీ పొరపాటు. 


పారిజాతం: అవునా మరి నీ కూతుర్ని కార్తీక్‌తో ఎందుకు పంపావ్ దీప.


దీప: శౌర్యని కార్తీక్ బాబు తీసుకెళ్లారా.


పారిజాతం: ఇదే ఈ నటనే తగ్గించమన్నది. ఇక్కడికి రావడానికి ముందే నీకు కార్తీక్ తెలుసు ఆ విషయం ఇంట్లో ఎవరికైనా చెప్పావా.. లేదు. నీ కూతురు చెప్తేనే నాకు తెలిసింది అయినా నువ్వు చెప్పలేదు. మీ ఇద్దరు నిన్న ఇక్కడ ఏం మాట్లాడుకున్నారో తెలీదు. నువ్వు నీ కూతుర్ని తీసుకెళ్లి చిన్న స్కూల్‌లో జాయిన్ చేశావు. ఈ రోజు కార్తీక్ దాన్ని తీసుకెళ్లి పెద్ద స్కూల్‌లో జాయిన్ చేశాడు. ఇప్పుడు అడిగితే అది కూడా నీకు తెలీదు అంటావ్. నువ్వు చాలా తెలివైనదానివి దీప.  


ఇంతలో కార్తీక్ శౌర్యని తీసుకొని వస్తాడు. శౌర్య పరుగున వచ్చి తనని కార్తీక్ పెద్ద స్కూల్‌లో చేర్పించాడని చెప్తుంది. 


పారిజాతం: నిజం బయట పడిపోయిందని టెన్షన్‌ పడుతున్నావా.. అయినా మీ ఇద్దరి మధ్య నేను ఎందుకులే ఎందుకంటే మీ సీక్రెట్స్ మీకు ఉంటాయి కదా. కానీ..


దీప: ఎవర్నీ అడిగి తీసుకెళ్లారు.


శౌర్య: కార్తీక్‌ని ఏమీ అనొద్దమ్మ. నేనే చెప్పా నాకు ఆ స్కూల్ నచ్చింది అని కార్తీక్ జాయిన్ చేశాడు.  


దీప: ఇంటి కెళ్లగానే అమ్మతో ఇలా మాట్లాడు అని పాపతో మీరే చెప్పారా. తండ్రిని దూరం చేశారు సరిపోలేదా. కూతుర్ని కూడా దూరం చేయాలా.


కార్తీక్: దీప నేను చేసిన పని మీకు నచ్చదని తెలియదు. అదే మా అత్తయ్య చెప్తే ఏమీ అనేవాళ్లు కాదు కదా. మీరు చేర్పించిన స్కూల్‌ శౌర్యకు నచ్చలేదు.


దీప: అది నేను నా కూతురు చూసుకుంటాం. మీరు ఎందుకు ఇలా చేయాలి నలుగురితో నేను ఎందుకు మాటలు పడాలి. 


కార్తీక్: మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మీకు శ్రేయాభిలాషిగా ఉంటాను అన్నాను. ఉంటాను. 


ఇక దీప తన కష్టంతోనే తన కూతురు చదవాలి అని ఫీజు ఎంత అని అడుగుతుంది. కార్తీక్ చెప్పను అంటే దీప పాపను ఆ స్కూల్‌కి పంపను అంటుంది. తన దగ్గరున్న 1900 ఇస్తుంది. మిగతా డబ్బు ఎంత చెప్పమంటే కార్తీక్ సరిపోతుంది అంటాడు. దాంతో దీప స్కూల్‌కి వెళ్లి అడుగుతాను అంటే అవసరం లేదు అని 80 వేలు అయిందని చెప్తాడు. దీంతో దీప షాక్ అయిపోతుంది. అంత డబ్బు కట్టి చదివించడం తన వల్ల కాదు అంటుంది.  కార్తీక్ అవుతుంది అని దీప దగ్గర డబ్బు తీసుకొని తనతో దీపని రమ్మని పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: ఇండియన్ 2 రిలీజ్ డేట్ - జూలైలో భారతీయుడిగా కమల్ సందడి ఆ రోజే